అంత్యేష్ఠి
సనాతన ధర్మం ప్రకారం మనిషి యొక్క ఆఖరి యజ్ఞం అంత్యేష్ఠి సంస్కారం. ఇష్ఠి అనగా యజ్ఞం. మనిషి చనిపొయిన తర్వాత చేసే అంత్యక్రియలను కూడా ఒక యజ్ఞంలా పరిగణిస్తుంది హిందూ ధర్మం. ఈ ప్రక్రియ ఎలా నడుస్తుందన్నది వివిధ హిందూ శాఖలు, కులాలను బట్టి ఉంటుంది. సాధారణంగా అనుసరించే పద్ధతి... చనిపోయిన మనిషి భౌతిక కాయాన్ని కాల్చి (అగ్ని సంస్కారం చేసి), ఆ అస్తికలు, చితా భస్మాన్ని పవిత్ర నదులలో కలపడం.[1]
![](http://up.wiki.x.io/wikipedia/commons/thumb/4/4e/Hindu_funeral.jpg/220px-Hindu_funeral.jpg)