అంబాలిక మహాభారతంలోని పాత్ర. ఆమె విచిత్ర వీర్యుని భార్య. పాండురాజు తల్లి.

అంబాలిక కాశీరాజు కుమార్తె. అంబ, అంబిక ఈమెకు అక్కలు. వీరి వివాహం కోసం కాశీరాజు స్వయంవరం ప్రకటించగా అనేకమంది రాజులు పోటీపడ్డారు, వారందరినీ భీష్ముడు ఓడించి, యువరాణులు ముగ్గురినీ ఎత్తుకు వెళ్ళాడు.

అంబ సాళ్వరాజును ప్రేమించానని చెప్పడంతో భీష్ముడు ఆమెను అతడి వద్దకు పంపించేసాడు. అంబిక, అంబాలికలను తన తమ్ముడైన విచిత్రవీర్యునికిచ్చి వివాహం చేసాడు.

విచిత్ర వీర్యుడు క్షయరోగంతో నిస్సంతుగా మరణించాడు. వంశవృద్ధి కోసమని అతడి తల్లి సత్యవతి తన తొలిపుత్రుడైన వ్యాసుని కోరింది.

అంబిక, అంబాలికలకు సంతానాన్ని ప్రసాదించేందుకు అతడు అంగీకరించాడు.అంబాలిక వ్యాసుని చూడడంతోనే భయంతో తెల్లబారింది. ఆ కారణాన ఆమెకు, పాండురోగం కారణాన తెల్లబారిపోయిన చర్మంతో పాండురాజు పుట్టాడు.

కురువంశం వంశవృక్షం

మార్చు


మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు
"https://te.wiki.x.io/w/index.php?title=అంబాలిక&oldid=3976793" నుండి వెలికితీశారు