అగ్గిరాముడు (1954 సినిమా)

అగ్గిరాముడు ఎస్.ఎం.శ్రీరాములు నాయుడు దర్శకత్వంలో ఎన్.టి.రామారావు, భానుమతి ప్రధాన పాత్రల్లో నటించిన 1954 నాటి తెలుగు చలన చిత్రం.

అగ్గిరాముడు
(1954 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్.ఎమ్.శ్రీరాములు నాయుడు
తారాగణం ఎన్.టి.రామారావు,
భానుమతి,
రేలంగి,
ముక్కామల,
ఆర్. నాగేశ్వరరావు,
ఋష్యేంద్రమణి,
సంధ్య,
బాలసరస్వతి
సంగీతం ఎస్.ఎమ్. సుబ్బయ్యనాయుడు
నేపథ్య గానం ఎ.ఎమ్. రాజా,
భానుమతి,
టేకు అనసూయ
గీతరచన ఆచార్య ఆత్రేయ
నిర్మాణ సంస్థ పక్షిరాజా స్టూడియోస్
భాష తెలుగు

సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు: ఎస్. ఎం. శ్రీరాములు నాయుడు

నిర్మాత, సంగీతం: ఎస్.ఎం.శ్రీరాములు నాయుడు

నిర్మాణ సంస్థ: పక్షిరాజా స్టూడియోస్

గీత రచయిత: ఆచార్య ఆత్రేయ

సంభాషణలు: ఆచార్య ఆత్రేయ

గాయనీ గాయకులు: పాలువాయి భానుమతి, ఎ.ఎం.రాజా , టేకు అనసూయ ,మాధవపెద్ది సత్యం, రాధాజయలక్ష్మి, పెరియా నాయకీ, జయలక్ష్మి

విడుదల:05:08:1954.

నిర్మాణం

మార్చు

అభివృద్ధి

మార్చు

1954లో తమిళంలో ఎం.జి.రామచంద్రన్ కథానాయకునిగా మలై కల్లన్ సినిమాను తీశారు. ఆ సినిమా తమిళనాట ఘనవిజయాన్ని సాధించింది. దాని హక్కులు తీసుకుని తెలుగులో అగ్గిరాముడు సినిమా తీశారు.[1]

థీమ్స్, ప్రభావాలు

మార్చు

బుర్రకథా పితామహునిగా పేరొందిన షేక్ నాజర్ ప్రదర్శించే బుర్రకథల్లో అల్లూరి సీతారామరాజు చాలా ప్రాచుర్యం పొందింది. అత్యంత ప్రజాదరణ పొందిన ఆ బుర్రకథని అగ్గిరాముడు సినిమాలో చేర్చారు.[నోట్ 1]

ఈ చిత్రంలో వస్త్రధారణ జానపద ఫక్కిలో నడిచింది. అగ్గిరాముని అనుచరులు చేసే కత్తి సాము, మల్లయుద్ధం, నాట్యాలు ప్రేక్షకులను అలరించాయి. అత్రేయ మాటలు, పాటలు బాగున్నాయి.

పాటలు

మార్చు
  1. ఎవరురా నీవెవరురా ఎవరుగాని ఎరుగరాని దొర - పి. భానుమతి
  2. ఎవరొ పిలిచారు నా ఎదుటెవరో నిలిచేరు - పి. భానుమతి
  3. కరుణజూడవలెను గౌరి గిరిరాజకుమారి - పి. భానుమతి
  4. కొండకోనల్లోన పండిన దొండపిండా - ఎ.మ్. రాజా
  5. పాలరేయోయి పసిరాకు చుక్క - టేకు అనసూయ బృందం
  6. రాణీరాజు రాణీరాజు రాగమంతా నీదేరాణి - పి. భానుమతి
  7. జై ఆంధ్ర జననీ విశాలాంధ్ర ధరణి జై_మాధవపెద్ది, రాధా జయలక్ష్మి బృందం
  8. రా రా యశోధనందనా యధు వధూ జనమధన_పేరియా నాయకి, జయలక్ష్మి
  9. అంకెలు చెప్పలేదు చతురంగ బలంబుల తోడనెల్లియో(పద్యం)_పి.భానుమతి
  10. సీతారామరాజు (బుర్రకథ)_నాజర్, లక్ష్మీనరసయ్య, రామకోటి బృందం.

వనరులు

మార్చు

నోట్స్

మార్చు
  1. నాజర్ అల్లూరి సీతారామరాజు బుర్రకథ అంటే సామాన్య ప్రేక్షకుల్లో ఉన్న ఆకర్షణను దృష్టిలో ఉంచుకుని సినిమా పోస్టర్లలోనూ ప్రముఖంగా ఈ అంశాన్ని ముద్రించారు.

మూలాలు

మార్చు
  1. ఎం.బి.ఎస్., ప్రసాద్. "తమిళ రాజకీయాలు - 46". గ్రేటాంధ్ర. Retrieved 25 November 2015.