అన్నే ఫ్రాంక్
అన్నే ఫ్రాంక్ (అన్నెలీస్ మేరీ ఫ్రాంక్) (Anne Frank) 12 జూన్ 1929 న జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నగరంలో జన్మించింది. ఈమె డైరిస్ట్‌గా, సాధారణ వ్యాసకర్తగా ప్రసిద్ది చెందింది. ఈమె 15 సంవత్సరాల వయసులో మరణించింది. ఈమె రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, యూదులు అనుభవించిన నరక యాతన బాధితులలో ఒకరు. హోలోకాస్ట్‌లో మరణించిన అత్యంత ప్రసిద్ధ యూదు ప్రజలలో అన్నెలీస్ మేరీ ఫ్రాంక్ ఒకరు. ఆమ్‌స్టర్ డాంలో దాగి ఉన్న అన్నే ఫ్రాంక్ అనే ఈ 15 సంవత్సరాల బాలికను, ఆమె కుటుంబాన్ని, నాజీలు ఖైదు చేసారు. ఈ బాలిక రాసిన అన్నే ఫ్రాంక్ డైరీ ప్రపంచ ప్రసిద్ధి పొందింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, యూదులు అనుభవించిన నరక యాతనకు ప్రతిబింబం ఈ డైరీ. ఈమె యుద్ధ డైరీ పేరు "ది డైరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్". ఇది చాలా నాటకాలకు, సినిమాలకు ఆధారంగా, ప్రేరణగా మారింది. ఈమె జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో జన్మించింది, కాని తన జీవితంలో ఎక్కువ భాగం నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డాం, పరిసర ప్రాంతాలలో గడిపింది. ఫ్రాంక్ జర్మనీలో జన్మించినప్పటికీ, ఈమె 1941 లో జర్మన్ పౌరసత్వాన్ని కోల్పోయింది. డైరీ తన 13 వ పుట్టినరోజున అన్నేకి ఇవ్వబడింది. అందులో ఆమె 12 జూన్ 1942 నుండి 1 ఆగస్టు 1944 వరకు తన జీవితం గురించి రాసింది. ఫిబ్రవరి 1945 లో బెర్గెన్-బెల్సెన్‌లో టైఫస్ జ్వరంతో ఈమె మరణించింది, ఈమె చనిపోయేటప్పటికి ఈమెకు 15 సంవత్సరాలు మాత్రమే. ఈమె మరణం తరువాత ఈమె వ్రాసిన డైరీ ముద్రించబడినప్పుడు, ఈమె ప్రపంచంలో ప్రసిద్ధి చెందింది, నేడు ఎక్కువగా చదివిన పుస్తకాల్లో ఇది ఒకటి. ఈ డైరీలో రెండవ ప్రపంచ యుద్ధంలో నెదర్లాండ్స్‌పై జర్మనీ ఆధిపత్యం సమయంలో ఫ్రాంక్ తన అనుభవాలను వివరించింది.
Anne Frank అన్నే ఫ్రాంక్ | |
---|---|
Born | Annelies[1] or Anneliese[2] Marie Frank 1929 జూన్ 12 ఫ్రాంక్‌ఫర్ట్, ప్రుస్సియా, వీమర్ రిపబ్లిక్ |
Died | ఫిబ్రవరి లేదా మార్చి 1945 (aged 15) బెర్గెన్-బెల్సెన్ నిర్బంధ శిబిరం, తూర్పు హనోవర్, నాజీ జర్మనీ |
Resting place | బెర్గెన్-బెల్సన్ కాన్సంట్రేషన్ క్యాంప్, లోయర్ సాక్సోనీ, జర్మనీ |
Occupation | డైరిస్ట్ |
Language | డచ్ |
Citizenship |
|
Relatives |
|
Signature | |
మూలాలు
మార్చు- ↑ Anne Frank Fonds.
- ↑ Barnouw & Van Der Stroom 2003, pp. 3, 17.