అరణ్యం (సినిమా)
అరణ్యం 1996లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ రామచరణ్ మూవీ క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించాడు. నారాయణమూర్తి, ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.[1] ఆర్ నారాయణమూర్తి ద్విపాత్రాభినయం, మొట్టమొదటి సారిగా పోలీసు అధిఅకరి పాత్రలో కనబడటం ఈ చిత్రంలోని విశెషం. అదే కాకుండా కమర్షియల్ ఫార్లులా చిత్రాలకు పేరుపొందిన దర్శకుడు రవిరాజా పినిశెట్టి మొదటి సారిగా పూర్తి రాజకీయపరమైన ఇతివృత్తం తీసుకోవడమే కాక, నక్సలిజాన్ని పరోక్షంగా సమర్థించే ఇతివృత్తాన్ని ఎన్నుకొని చిత్రీకరించడం మరో విశేషం
అరణ్యం (1996 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రవిరాజా పినిశెట్టి |
---|---|
తారాగణం | నారాయణమూర్తి |
సంగీతం | వందేమాతరం శ్రీనివాస్ |
నిర్మాణ సంస్థ | శ్రీ రామచరణ్ మూవీ క్రియేషన్స్ |
భాష | తెలుగు |
కథ
మార్చుఈ అరణ్యంలో అరణ్యరోదనగా తమ బతుకులు వెళ్లదీస్తున్న గిరిజన జీవితాలని మరో కోణం నుంచి రాజ్యాంగపరమైన సంఘిక సమానత్వపరమైన మరో కోణాన్ని ఈ చిత్రం ప్రతిపాదిస్తుంది.
ఈ చిత్రంలో ఇద్దరు మూర్తిలున్నారు. ఒకరు కృష్ణమూర్తి, మరొకరు నారాయణమూర్తి. రెండు పాత్రలూ ఆర్ నారాయణమూర్తే వేసాడు. చిత్ర పూర్వార్థంలో ప్రధానంగా నడిచేవి కృష్ణమూఋతి అనే దళిత సమసమాజ ప్రదర్శనకు నడుంకట్టి ప్రజాస్వామ్యం పేరుతో, రాజ్యాంగంలోని లొసుగులను అడ్డం పెట్టుకుని, స్వార్థంతో, పదవులు అధికారం చేపట్టి, గిరిజౌలను కాని హింసలకు గురిచేసి, గిరిజన ప్రాంతాల్లోని భూములను కాజేసే వారిపై తన విల్లుని ఎక్కుపెట్టి పోరాటాన్ని నడిపించే పాత్ర. ఆ దళిత నాయకుడిని తుదముట్టించడంలో, పోలీసు వ్యవస్థలో పనిచేస్తున్న నారాయణమూర్తి అనే ఒక సర్కిల్ ఇనస్పెక్టరు పై వారి ఒత్తిళ్ళకు తట్టుకోలేక "ఎన్‌కౌంటర్" పేరుతో కృష్ణమూర్తిని హత్య చేయడానికి ఇష్టం లేక పదవీ త్యాగం చేస్తే అదే కృష్ణమూర్తిని స్వార్థ రాజకీయ నాయకులు, మంత్రులు కాంట్రాక్టర్లతొ చేతులు కలిపి ఒక పోలీసు కమీషనర్ నేతృత్వంలో హత్య చేసినప్పుడు అది చూసి భరించలేని నారాయణమూర్తి కృష్ణమూర్తి స్థానంలో కొచ్చి, తనే కృష్ణమూర్తి తల్లికి కొడుకుగా, చెల్లెళ్ళకి అన్నగా, మొత్తం అక్కడి గూండాలకి ఉగ్రవాది అన్నగా మారడాం ఈ ద్వితీయ భాగపు కథ.
తారాగణం
మార్చు- ఆర్. నారాయణమూర్తి
- పార్వతి
- అమూల్య
- కమలాకామేష్
- జె.వి.సోమయాజులు
- నర్రా
- నారాయణ
- ఏ.ఆర్. విజయ
- ముక్కురాజు
సాంకేతిక వర్గం
మార్చు- బ్యానర్: శ్రీ రామచరణ్ మూవీ క్రియేషన్స్
- సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
- దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి
- మాటలు: సత్యమూర్తి
- పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గూడా అంజయ్య, భానూరి సత్యనారాయణ, పాముల రాంచందర్ రావు
- ఫోటోగ్రఫీ: రాం ప్రసాద్ పినిశెట్టి
- నిర్మాతలు: జొన్నాడ రమణమూర్తి , కె.హేమలత
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి
పాటలు
మార్చు- వాలేకుం సలామలేకుం......: గానం: వందేమాతరం శ్రీనివాస్, రచన: గూడ అంజయ్య
- జో లాలి జో లాలి....: గానం; యేసుదాసు, రచన: బానూరి సత్యనారాయణ
- నమ్మొద్దన్నా... : గానం: వందేమాతరం శ్రీనివాస్, రచన: పాముల రామచంద్రరావు
- ఓ కొండలారా..: గానం: ఎస్.జానకి కె.ఎస్.చిత్ర, రచన: గూడ అంజయ్య
- వెయ్యరా దరువెయ్యరో...: గానం: ఎస్.పి.బాబు, శ్రీనివాస్, రచన: పాముల రామచంద్రరావు
- ఎవరికోసం...: ఎస్.పి.బాలు, రచన: పాముల రామచంద్రరావు
- అరణ్యం ఇది అరణ్యం...: గానం: ఎస్.పి.బాలు, రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి
- కిల కిల కిల కిల రామచిలకమ్మ, గానం.కె ఎస్ చిత్ర బృందం, రచన: పాముల రామచంద్రరావు.
మూలాలు
మార్చు- ↑ "Aranyam (1996)". Indiancine.ma. Retrieved 2020-08-11.
3.ghantasala galaamrutamu, kolluri bhaskararao blog.