అష్టమహిషులు
అష్టమహిషులు శ్రీకృష్ణుడి ఎనిమిది మంది భార్యలు: ఈ అష్ట మహిషులే కాక మిగిలిన పదహారు వేల వంద మంది కృష్ణుడి భార్యలకు కూడా ఆయన తన ప్రేమను పంచగలగటం, దానిని వారు పోటీపడి స్వీకరించటం చాలా గొప్ప విషయం.
అష్ట భార్యలు
మార్చు- 1. రుక్మిణి
రుక్మిణీదేవి సందేశాన్ని అందకొని స్వయంవర సమయంలో ఎత్తుకొచ్చి వివాహం చేసుకొన్నాడు. అన్యాయంగా, బలవంతంగా లాక్కువెళ్ళి పెళ్ళి చేసుకొన్నాడని శిశుపాలుడు ఆరోపించాడు. ప్రేమవివాహం.
- 2. సత్యభామ
సత్రాజిత్తు కుమార్తె. ఈమె భూదేవి అవతారం. గోదాదేవి సత్యభామ అవతారం అని అంటారు.
- 3. జాంబవతి
జాంబవంతుడిని 28 రోజుల యుధ్ధంలో ఓడించి, జాంబవతిని చేపడతాడు శ్రీకృష్ణుడు. వీణా విద్వాంసురాలు.
- 4. మిత్రవింద
ఆమె కోరిక మేరకే బహిరంగంగా స్వయం వరానికొచ్చి అందులోనే ఇతర రాజకుమారులందరినీ ఓడించి చేపట్టాడు.
- 5. భద్రాదేవి
మేనత్త కేకయ దేశపు రాజు భార్య అయిన శృతకీర్తి కుమార్తె . పెద్దలందరి ముందు పెళ్ళాడాడు.
- 6. నాగ్నజితి
కోసల దేశాధిపతియైన నాగ్నజిత్తు కుమార్తె. కృష్ణుడు ఏడు రూపాలను ధరించి ఏడు ఎద్దులను ఒక్కొక్క గుద్దు గుద్ది లొంగదీసుకుని వాటిని తాళ్ళతో బంధించి పెళ్ళి చేసుకున్నాడు.
- 7. కాళింది
పెద్దలందరి ముందు పెళ్ళాడాడు.
- 8. లక్షణ
మద్ర దేశపు రాజకుమారి. మత్స్యయంత్ర పరీక్ష. స్వయంవరంలో యంత్రాన్ని పడగొట్టి లక్షణను చేపట్టాడు.[1]
అష్టమహిషుల సంతానం
మార్చుశ్రీకృష్ణుడికి రుక్మిణి, సత్యభామ తదితర అష్ఠ మహిషులు, పదహారు వేల వంద మంది భార్యలు ఉన్నారు. కృష్ణుడికి ఆ భార్యల వల్ల కలిగిన సంతానం ఎంత? భార్యలందరితోనూ ఆయనకు ఒక్కొక్కరి వల్ల పదేసి మంది పిల్లలు పుట్టారు.
- రుక్మిణి వల్ల కృష్ణుడికి ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, సుదేష్ణుడు, చారుదేహుడు, సుబారుడు, చారుగుప్తుడు, భద్రచారుడు, చారుచంద్రుడు, విచారుడు, చారుడు అనే బిడ్డలు కలిగారు.
- కృష్ణుడికి సత్యభామ వల్ల భానుడు, సుభానుడు, స్వర్భానుడు, ప్రభానుడు, భానుమంతుడు, చంద్రభానుడు, బృహద్భానుడు, అతిభానుడు, శ్రీభానుడు, ప్రతిభానుడు అనే బిడ్డలు కలిగారు.
- జాంబవతీ శ్రీకృష్ణులకు సాంబుడు, సుమిత్రుడు, పురజిత్తు, శతజిత్తు, సహస్రజిత్తు, విజయుడు, చిత్రకేతుడు, వసుమంతుడు, ద్రవిడుడు, క్రతువు అనే సంతానం కలిగింది. జాంబవతికి కలిగిన ఈ బిడ్డలంటే కృష్ణుడికి ప్రత్యేకమైన ప్రేమ ఉండేది.
- నాగ్నజితి, కృష్ణులకు వీరుడు, చంద్రుడు, అశ్వసేనుడు, చిత్రగుడు, వేగవంతుడు, వృషుడు, లముడు, శంకుడు, వసుడు, కుంతి అనే పిల్లలు కలిగారు.
- కృష్ణుడికి కాళింది వల్ల శ్రుతుడు, కవి, వృషుడు, వీరుడు, సుబాహుడు, భద్రుడు, శాంతి, దర్శుడు, పూర్ణమానుడు, శోమకుడు అనే కుమారులు జన్మించారు.
- లక్షణకు, శ్రీకృష్ణుడికి ప్రఘోషుడు, గాత్రవంతుడు, సింహుడు, బలుడు, ప్రబలుడు, ఊర్ధ్వగుడు, మహాశక్తి, సహుడు, ఓజుడు, అపరాజితుడు అనే సంతానం కలిగింది.
- మిత్రవింద, కృష్ణులకు వృకుడు, హర్షుడు, అనిలుడు, గృద్ధుడు, వర్ధనుడు, అన్నాదుడు, మహాశుడు, పావనుడు, వహ్ని, క్షుధి అనే పుత్రులు పుట్టారు.
- కృష్ణుడికి భద్రాదేవి అనే భార్య వల్ల సంగ్రామజిత్తు, బృహత్సేనుడు, శూరుడు, ప్రహరణుడు, అరిజిత్తు, జయుడు, సుభద్రుడు, వాముడు, ఆయువు, సత్యకుడు అనే పిల్లలు పుట్టారు.
- ఈ అష్ట మహిషులే కాక మిగిలిన పదహారు వేల వంద మంది కృష్ణుడి భార్యలకు కూడా ఒక్కొక్కరికి పది మంది సంతతి కలిగింది.
మూలాలు
మార్చు- ↑ Charya, M. N. (2020-09-10). "శ్రీకృష్ణుని అష్టభార్యలు... ఆసక్తికర విషయాలు". oneindia. Retrieved 2021-04-14.