ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

2021-22 ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుత విలువ ఆధారంగా, రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి ₹12,01,736 కోట్లు. గత సంవత్సరపు విలువ ₹10,14,374 కోట్లు కాగా, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిగా ఏడాదిలో ₹ 1,87,362 కోట్ల పెరుగుదల నమోదైంది. వార్షిక వృద్ధి రేటు 18.47%, దేశపు వృద్ధి రేటు 17 శాతం కంటే ఎక్కువ. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుత విలువ ప్రాతిపదికన, తలసరి ఆదాయం ₹2,00,771. అంతకు ముందు సంవత్సరంలో తలసరి ఆదాయం ₹176,000. ఏడాదిలో రాష్ట్రంలో ₹31 వేలు తలసరి ఆదాయం పెరగగా, దేశంలో తలసరి ఆదాయం ₹23 వేలు పెరిగింది.

ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ
విశాఖపట్నం, ఒక ప్రముఖ వాణిజ్య కేంద్రం
Statistics
GDP12.02 లక్ష కోట్లు (US$150 billion) (2021–22)[1]
GDP growth
18.47% (2021-22)[1]
GDP per capita
2,00,771 (US$2,500) (2021-22)[1]
GDP by sector
వ్యవసాయం 34%
పరిశ్రమలు 23%
సేవలు 43% (2018–19)[2]
Population below poverty line
Positive decrease పేదరికం తరుగుదల 9.2% (2017–18)[3]
Increase 0.650 medium (2018) (27th)[4]
Labour force by occupation
వ్యవసాయం 55%
పరిశ్రమలు 10%
సేవలు 35% (2015)[5]
UnemploymentPositive decrease 6.0% (Nov 2020)[6]
Public finances
27% of GSDP (2019–20 est.)[2]
−35,261 crore (US$−4.4 billion) (3.26% of GSDP) (2019-20 est.)[2]
Revenues1.79 లక్ష కోట్లు (US$22 billion) (2019–20 est.)[2]
Expenses2.28 లక్ష కోట్లు (US$29 billion) (2019–20 est.)[2]

ఆంధ్ర ప్రదేశ్లో సుమారు 62% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడ్డారు కావున వ్యవసాయం రంగం ఆర్థిక వ్యవస్థ ప్రధాన ప్రభావం చూపుతుంది.[7] 2016 లో వెలువడిన వ్యాపార సౌలభ్య సూచికలో రాష్ట్రం తెలంగాణాతో పాటు అత్యుత్తమంగా నిలబడింది.[8]

కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 2020-21లో తీవ్రంగా దెబ్బతిని[9] 2021-2022 లో కోలుకుంది.

రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి

మార్చు
 
ప్రత్తి సేకరిస్తున్న ఒక మహిళ
 
పొగాకు బేళ్ళుగా కట్టలు కట్టి

2021-22 ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుత విలువ ఆధారంగా, రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి ₹12,01,736 కోట్లు. గత సంవత్సరపు విలువ ₹10,14,374 కోట్లు కాగా, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిగా ఏడాదిలో ₹ 1,87,362 కోట్ల పెరుగుదల నమోదైంది. వార్షిక వృద్ధి రేటు 18.47% దేశపు వృద్ధి రేటు 17 శాతం కంటే ఎక్కువ.[1][10]

  • వ్యవసాయరంగం : ₹3.9 లక్షల కోట్లు (+14.5%)
  • పారిశ్రామిక రంగం : ₹2.5 లక్షల కోట్లు (+25.5% )
  • సేవా రంగం : ₹4.67 లక్షల కోట్లు (+18.9% )
జాతీయోత్పత్తి (ఆంధ్రప్రదేశ్), భారతదేశం (కోట్ల రూపాయలలో), ప్రస్తుత ధరలు, 2011-12 నాటి స్థిర ధరలు ప్రాతిపదిక [10]
Year GSDP/GDP-AP at Current Prices Growth (%) -AP GSDP/GDP-India at Current Prices Growth (%) -India GSDP/GDP-AP at Constant Prices Growth (%) -AP GSDP/GDP -India at Constant Prices - Growth (%) -India
2017-18 7,86,135 14.86 1,70,90,042 11.00 5,94,737 10.09 1,31,44,582 6.80
2018-19 (TRE) 8,73,721 11.14 1,88,99,688 10.60 6,26,614 5.36 1,39,92,914 6.50
2019-20 (SRE) 9,66,099 10.57 2,00,74,856 6.20 6,69,783 6.89 1,45,15,958 3.70
2020-21 (FRE) 10,14,374 5.00 1,98,00,914 -1.40 6,70,321 0.08 1,35,58,473 -6.60
2021-22 (AE) 12,01,736 18.47 2,36,43,875 19.40 7,46,913 11.43 1,47,71,681 8.90

తలసరి ఆదాయం

మార్చు

ఏపీలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుత విలువ ప్రాతిపదికన, తలసరి ఆదాయం ₹2,00,771. అంతకు ముందు సంవత్సరంలో తలసరి ఆదాయం ₹176,000. ఏడాదిలో రాష్ట్రంలో ₹31 వేలు తలసరి ఆదాయం పెరగగా, దేశంలో తలసరి ఆదాయం ₹23 వేలు పెరిగింది.

తలసరి ఆదాయం పెరుగుదల ప్రస్తుత ధరలలో (₹కోట్లలో) [10]
సంవత్సరం Per Capita Income (PCI) -AP PCI-india
2017-18 1,38,299 1,15,224
2018-19 (TRE) 1,54,031 1,25,946
2019-20 (SRE) 1,69,320 1,32,115
2020-21 (FRE) 1,76,707 1,26,855
2021-22 (AE) 2,07,771 1,49,848

చేపల పెంపకం

మార్చు

ఆంధ్రప్రదేశ్ లోని తీర ప్రాంతాలలో చేపలు, రొయ్యలు లాంటివి పెంచడం, అమ్మడం ప్రజలకు ఒక ప్రధాన వృత్తి. రొయ్యల ఉత్పత్తిలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ది ప్రథమ స్థానం. దేశంలో సుమారు 70% ఉత్పత్తి ఇక్కడే జరుగుతోంది.[11] రాష్ట్రం భౌగోళిక పరిస్థితులు ఇందుకు అనుకూలిస్తున్నాయి. తుఫానులు లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు పంటలకు జరిగే నష్టం కన్నా చేపల చెరువులకు జరిగే నష్టం తక్కువ కావడంతో రైతులు ఈ వృత్తి వైపు మొగ్గు జూపారు. నెల్లూరులో ఉన్న జలాలు రొయ్యలు పెంపకానికి అనుకూలమైనవి.[12]

ఎగుమతులు

మార్చు

రాష్ట్రం నుంచి సాఫ్ట్‌వేర్ సేవలు, ఆహార ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి.

రాష్ట్ర రుణం

మార్చు

CAG నివేదిక ప్రకారం 2020 నవంబరు నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సృష్టించిన మొత్తం ప్రజా రుణం 3,73,140 కోట్లు. ఇది 2021 సంవత్సరంలో 5.2 కోట్ల [13] జనాభాను అంచనా వేసుకుంటే ప్రతి పౌరునికి రూ.71750.[14] యూనియన్ ఆఫ్ ఇండియా కారణంగా ప్రతి పౌరుడిపై ప్రజా రుణం సుమారుగా రూ. 32371.61 (2021 సంవత్సరంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 130 కోట్ల (1.3 బిలియన్) జనాభాకు దాదాపు భారతదేశం మొత్తం బాహ్య రుణం $570 బిలియన్లు ).

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 "AP Socio Economic Survey: ఏపీ ఆర్థిక సర్వే-₹31 వేలు పెరిగిన తలసరి ఆదాయం, వృద్ధి రేటులో భేష్!". ABP Telugu. 2022-03-11. Retrieved 2022-03-15.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 "Andhra Pradesh Budget Analysis 2019-20" (PDF). PRS Legislative Research. Archived from the original (PDF) on 10 ఆగస్టు 2019. Retrieved 24 July 2019.
  3. "SDGs India Index". NITI Aayog. 31 December 2019.
  4. "Sub-national HDI – Area Database". Global Data Lab. Institute for Management Research, Radboud University. Archived from the original on 23 September 2018. Retrieved 25 September 2018.
  5. "Andhra Pradesh Budget Analysis 2016-17" (PDF). PRS Legislative Research. Archived from the original (PDF) on 4 ఏప్రిల్ 2019. Retrieved 19 November 2016.
  6. "Unemployment Rate in India". Centre for Monitoring Indian Economy. Retrieved 3 November 2020.
  7. "Socio-economic Survey of Andhra Pradesh" (PDF). Archived from the original (PDF) on 6 June 2017.
  8. S, Arun (31 October 2016). "A.P., Telangana top in ease of doing business". The Hindu. ISSN 0971-751X. Retrieved 4 January 2018.
  9. "Andhra Pradesh witnesses huge shortfall in revenue in first quarter". thehansindia.com.
  10. 10.0 10.1 10.2 Socio economic survey 2021-22 (PDF). Amaravathi. 2022.{{cite book}}: CS1 maint: location missing publisher (link)[permanent dead link]
  11. "AP top producer of shrimp: MPEDA". 16 Jan 2013.
  12. "Waterbase India". waterbaseindia. Retrieved 18 July 2014.
  13. "Andhra Pradesh's debt burden rises to Rs 3.73 lakh crore, CAG accounts show". Retrieved December 16, 2021.
  14. "అప్పుల ఊబిలో ఆంధ్రా.. ఒక్కొక్కరి తలపై ఎంత అప్పుందో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!". సమయం. 2021-01-05. Retrieved 2022-03-15.