ఆమదాలవలస

ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం జిల్లా, ఆముదాలవలస మండల పట్టణం
(ఆముదాలవలస నుండి దారిమార్పు చెందింది)

ఆమదాలవలస, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన పట్టణం, అదేపేరుగల మండలానికి కేంద్రం.

పట్టణం
పటం
Coordinates: 18°25′N 83°54′E / 18.42°N 83.9°E / 18.42; 83.9
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీకాకుళం జిల్లా
మండలంఆముదాలవలస మండలం
విస్తీర్ణం
 • మొత్తం19.65 కి.మీ2 (7.59 చ. మై)
జనాభా
 (2011)[1]
 • మొత్తం39,799
 • జనసాంద్రత2,000/కి.మీ2 (5,200/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1017
ప్రాంతపు కోడ్+91 ( 08942 Edit this on Wikidata )
పిన్(PIN)532185 Edit this on Wikidata
WebsiteEdit this at Wikidata

ఇక్కడికి దగ్గరలో సంగమయ్య కొండ పై జైన దేవాలయాల ఆనవాళ్లు, సంగమేశ్వర ఆలయం ఇక్కడి పర్యాటక ఆకర్షణలు. శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషను ఈ వూరిలోనే ఉంది. ఇక్కడనుండి శ్రీకాకుళం 8 కి.మీ. దూరంలో ఉంది.

పేరు వ్యుత్పత్తి

మార్చు

పూర్వం ఈ గ్రామం పేరు హేరండపల్లి. హేరండం అంటే సంస్కృతంలో ఆముదం అని అర్ధం.

భౌగోళికం

మార్చు

జిల్లా కేంద్రం, సమీప నగరమైన శ్రీకాకుళంకు ఉత్తర దిశగా 18 కి.మీ దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు

మార్చు

2011 జనగణన ప్రకారం జనాభా 39,799.

పరిపాలన

మార్చు

ఆముదాలవలస పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.

పర్యాటక ఆకర్షణలు

మార్చు

సంగమేశ్వరాలయం

మార్చు

ప్రస్తుతం సంగమయ్య కొండ ఆముదాలవలస పట్టణమునకు 8 కి.మీ. దూరంలో హీరమండలం పోవు మార్గములో జి.కొల్లి వలస గ్రామమునకు దాపున ఉంది. ఈ కొండ పవిత్రమైన శైవక్షేత్రముగా నేటికీ పరిగణింపబడుతున్నది. ఈ కొండకు సుమారు 800 మెట్లు ఉన్నాయి. మెట్లుదాటి పైకి చేరిన వెంటనే సంగమేశ్వరస్వామి గుహలయం కనబడుతుంది. గుహముఖద్వారం శిఖరంగా మలిచి, ముఖమండపం కట్టి శివలింగాన్ని, నంది విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. నంది విగ్రహం పక్కనే రెండు జైన విగ్రహాలు ఉన్నాయి. వీటికి సింహం లాంఛనముగా ఉన్నందు వలన వీటిని మహావీరుని ప్రతిమలు.జైన మతం ఉత్తర సర్కారు జిల్లాలలో సా.శ.12వ శతాబ్దములో వేంగీ చాళుక్యుల కాలంలో తూర్పుగాంగుల కాలమున ఉచ్ఛస్థితిలో ఉన్నట్లు చారిత్రక శాసనాలు తెలుపుచున్నాయి. మూడవ విష్ణువర్ధనుడి కాలంలో జైన గురువగు సిద్ధాంతదేవుడు విజయనగరం పట్టణానికి దాపున ఉన్న రామతీర్ధంను సందర్సించినట్లు అక్కడ లభించిన శాసనముల ద్వారా తెలియుచున్నది. ఈయన దేశీ గణమునకు చెందినవాడని, విజయదిత్యునకు జిన గురువని కూడా ఈ శాసనం పేర్కొనుచున్నది. అందువలన ఈ గుహ కూడా అదేకాలమునందు నిర్మించబడి ఉండవచ్చును. కానీ 16వ శతాబ్దమునాటికి జైన మతం పై ఈ ప్రాంతములో వ్యతిరేక భావనలు వీచినందు వలన, శైవము జిన మత ధ్వంసానికి కొంత కారణమైనందువలన, సంగమయ్య కొండ శివాలయముగా మార్చబడి ఉండవచ్చును. బహుశా 13,14వ శతాబ్దాల కాలమునాటికే మార్చబడి ఉండవచ్చును అని చారిత్రకుల అభిప్రాయం.[ఆధారం చూపాలి]

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018

వెలుపలి లంకెలు

మార్చు
"https://te.wiki.x.io/w/index.php?title=ఆమదాలవలస&oldid=4054278" నుండి వెలికితీశారు