ఆర్థిక శాస్త్రంలో నోబుల్ పురస్కారాలు - 2024

దేశాల మధ్య ఆర్థిక అసమానతులకు కారణాలపై పరిశోధన చేసిన ముగ్గురు ప్రొఫెసర్లకు 2024 సంవత్సరానికి గాను ఆర్థిక శాస్త్ర విభాగంలో ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం లభించింది. డారెన్ అసెమోగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ రాబిన్సన్ లను ఎంపిక చేసినట్లు 2024 సంవత్సరం అక్టోబర్ 14వ తేదీన రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది[1]. దేశంలోని సంస్థలు, వ్యవస్థల అసమర్ధత కారణంగా ఆదేశం ఎలా పేదరికంలో మగ్గిపోతుందని అంశాలపై మీరు ముగ్గురు విస్తృత పరిశోధన చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పేర్కొంది. ముఖ్యంగా కొన్ని దేశాలు ఎందుకు అభివృద్ధి చెందుతున్నాయి ...? కొన్ని దేశాలు ఎందుకు ఎప్పుడు పేదరికంలో మగ్గుతున్నాయి...? అన్న అంశంపై వీరు చేసిన పరిశోధనలకు గాను ఈ అవార్డు అందిస్తున్నట్లు తెలిపింది. అసెమోగ్లు, జేమ్స్ రాబిన్సన్ లు కలిసి 2012 వ సంవత్సరంలో 'వై నేషన్స్ ఫెయిల్ ది ఆరిజన్స్ ఆఫ్ పవర్, ప్రాస్పారిటీ, అండ్ పావర్టీ' అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకం అత్యధిక కాపీలు అమ్ముడుపోయాయి. వ్యక్తుల తప్పిదాలే ఆయా దేశాలను పేద దేశాలుగా మిగిలిపోవడానికి కారణమని రచయితలు పుస్తకంలో వివరించారు.

మూలాలు :

  1. "All Nobel Prizes". NobelPrize.org (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2025-01-02.