ఈడ్పుగంటి రాఘవేంద్రరావు
ఈడ్పుగంటి రాఘవేంద్రరావు (1890 - జూన్ 15, 1942[1]) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రసిద్ధ జాతీయవాది, బహుభాషా కోవిదుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి. కేంద్ర ప్రభుత్వ సలహాదారుగా పనిచేసారు. 1935 మే 15 నుండి 1936 సెప్టెంబరు 11 వరకు రాఘవేంద్రరావు మధ్య పరగణాలు (సెంట్రల్ ప్రావిన్సెస్ - ఇప్పటి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, విదర్భ ప్రాంతం), బేరర్ యొక్క ఆపద్ధర్మ గవర్నరుగా పనిచేశాడు.[2] బ్రిటీషు పాలనలో ఒక ప్రాంతము యొక్క ప్రొవిన్సియల్ గవర్నరుగా నియమితుడైన మొట్టమొదటి భారతీయుడు రాఘవేంద్రరావు.[3] ఈయన ఆ తరువాత మౌంట్‌బాటన్ వైస్రాయిగా పనిచేసిన కాలములో, ఎం.ఎస్. ఆనేతో పాటు వైస్రాయి యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సభ్యునిగా నియమితుడైనాడు. ఆనేతో పాటు రాఘవేంద్రరావు ఆ కౌన్సిల్లో భారతీయ వస్త్రధారణతోనే ఇతర బ్రిటీషు సభ్యులతో పాటు కూర్చొని తన జాతీయవాదాన్ని చాటుకున్నాడు.
ఈడ్పుగంటి రాఘవేంద్రరావు | |
---|---|
జననం | ఈడ్పుగంటి రాఘవేంద్రరావు 1890 |
మరణం | జూన్ 15, 1942 |
మరణ కారణం | అధివృక్క గ్రంథి ఆగిపోవటం వలన |
వృత్తి | బిలాస్‌పూర్ చైర్మను కేంద్ర ప్రభుత్వ సలహాదారు ఆపద్ధర్మ గవర్నరు మౌంట్‌బాటన్ వైస్రాయి |
ప్రసిద్ధి | భారత స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రసిద్ధ జాతీయవాది, బహుభాషా కోవిదుడు , బహుముఖ ప్రజ్ఞాశాలి |
రాజకీయ పార్టీ | స్వరాజ్య పార్టీ |
తండ్రి | నాగన్న |
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రాఘవేంద్రరావు తండ్రి నాగన్న వ్యవహార కారణాల వలన నాగపూరు, బిలాస్‌పూరులకు వెళ్ళడంతో రాఘవేంద్రరావు మధ్యప్రదేశంలోనే పెరిగి పెద్దయ్యాడు. ఆయన చదువు నాగపూర్, అలహాబాదుల్లో సాగింది. ఉన్నత విద్య కోసం ఆయన 1909లో ఇంగ్లండు వెళ్లాడు.[4] భారతదేశం తిరిగివచ్చి బారిష్టరుగా జీవితము ప్రారంభించిన రాఘవేంద్రరావు తొలుత బిలాస్‌పూర్ చైర్మనుగా ఎన్నికైనాడు. 1926 వరకు స్వరాజ్య పార్టీలో పనిచేసిన రాఘవేంద్రరావు పార్టీలోని మరాఠీ నాయకులతో విభేదించి బయటికి వచ్చాడు.[5] ఆ తరువాత నాగపూరులో ప్రధానమంత్రిగానూ, గవర్నరుగానూ పనిచేశాడు.[6] విద్యార్థిదశలోనే రాఘవేంద్రరావు జాతీయోద్యమంలోని తీవ్రవాదుల పట్ల ఆకర్షితుడయ్యాడు. వీరిలో ముఖ్యంగా వినాయక దామోదర సావర్కార్, శ్యాంజీ కృష్ణవర్మ వంటి వారి ప్రభావం ఆయనపై బాగా పడింది.
రాఘవేంద్రరావు 1941 జూలైలో బ్రిటీషు ప్రభుత్వపు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో పౌరరక్షణ వ్యవహారాల సభ్యునిగా నియమితుడయ్యాడు.[7] చివరి దాకా పాలనావ్యవహారాలలో తలమునకలై, అధివృక్క గ్రంథి ఆగిపోవటం వలన ఆరోగ్యం క్షీణించి 1942 జూన్ నెలలో పరమపదించాడు[8]
రాఘవేంద్రరావు యొక్క పెద్దకొడుకు ఆశోక్‌రావు 1983లో బిలాస్‌పూర్ మేయరుగాను, 1990, 1993లలో బిలాస్‌పూర్ నియోజకవర్గము నుండి మధ్యప్రదేశ్ శాసనసభకు ఎన్నికై మంత్రిగా పనిచేశాడు.[9]
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-12-15. Retrieved 2007-12-15.
- ↑ http://www.worldstatesmen.org/India_BrProvinces.htm
- ↑ http://www.centralchronicle.com/20061225/2512307.htm[permanent dead link]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-06-12. Retrieved 2009-03-12.
- ↑ Saffron Versus Green By Kanchanmoy Mojumdar పేజీ.121
- ↑ ఆంధ్రసర్వస్వము - మాగంటి బాపినీడు (1942) పేజీ.560
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-07-04. Retrieved 2009-03-12.
- ↑ Course of My Life, The - Centenary Edn. By Deshmukh, I.C.S. పేజీ.119
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-05. Retrieved 2007-12-15.