ఎ వెడ్నెస్‌డే!

(ఎ వెడ్నెడే! నుండి దారిమార్పు చెందింది)

ఒక బుధవారం! 2008లో విడుదలైన థ్రిల్లర్ సినిమా. యూటీవీ మోషన్ పిక్చర్స్, ఫ్రైడే ఫిల్మ్‌వర్క్స్ బ్యాన‌ర్స్‌పై రోనీ స్క్రూవాలా , అంజుమ్ రిజ్వీ & శీతల్ భాటియా నిర్మించిన ఈ సినిమాకు నీరజ్ పాండే  దర్శకత్వం వహించాడు.[1][2] ఈ సినిమాలో నసీరుద్దీన్ షా, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రల్లో నటించగా  సెప్టెంబర్ 5న విడుదలై 56వ జాతీయ చలనచిత్ర అవార్డులలో దర్శకుని యొక్క ఉత్తమ తొలిచిత్రంగా ఇందిరా గాంధీ అవార్డుతో సహా అనేక అవార్డులను గెలుచుకుంది.[3]

ఎ వెడ్నెస్‌డే
దర్శకత్వంనీరజ్ పాండే
రచననీరజ్ పాండే
నిర్మాతరోనీ స్క్రూవాలా
శీతల్ భాటియా
అంజుమ్ రిజ్వీ
తారాగణంనసీరుద్దీన్ షా
అనుపమ్ ఖేర్
జిమ్మీ షెర్గిల్
అమీర్ బషీర్
దీపల్ షా
ఛాయాగ్రహణంఫువాద్ ఖాన్
కూర్పుశ్రీ నారాయణ్ సింగ్
సంగీతంసంజయ్ చౌదరి
నిర్మాణ
సంస్థలు
ఫ్రైడే ఫిల్మ్‌వర్క్స్
అంజుమ్ రిజ్వీ ఫిల్మ్ కంపెనీ
పంపిణీదార్లుయూటీవీ మోషన్ పిక్చర్స్
విడుదల తేదీ
5 సెప్టెంబరు 2008 (2008-09-05)
సినిమా నిడివి
99 నిమిషాలు [4]
దేశంభారతదేశం
భాషభారతదేశం
బాక్సాఫీసు₹ 12 కోట్లు[5]

నటీనటులు

మార్చు
  • నసీరుద్దీన్ షా - "ది కామన్ మ్యాన్"
  • అనుపమ్ ఖేర్ - ప్రకాష్ రాథోడ్, ముంబై పోలీస్ కమిషనర్
  • జిమ్మీ షీర్‌గిల్ - ఇన్‌స్పెక్టర్ ఆరిఫ్ ఖాన్, ATS
  • అమీర్ బషీర్ -ఇన్‌స్పెక్టర్ జై ప్రతాప్ సింగ్
  • దీపాల్ షా - నైనా రాయ్, UTV జర్నలిస్ట్‌
  • పరాగ్ త్యాగి - ఇన్‌స్పెక్టర్ ఆకాశ్ దురైవంశీ
  • అలోక్ నరులా రాజ్ శర్మ; నైనా రాయ్ కెమెరామెన్
  • రోహితాష్ గౌర్- ఇఖ్లాక్ అహ్మద్ (ఉగ్రవాది)
  • కాళీ ప్రసాద్ ముఖర్జీ - ఇబ్రహీం ఖాన్ (ఉగ్రవాది)
  • ముఖేష్ ఎస్ భట్ - ఖుర్షీద్ లాలా (ఉగ్రవాది)
  • విజే భాటియా - మొహమ్మద్, జహీర్ (ఉగ్రవాది)
  • చేతన్ పండిట్ - సునీల్ నిగ్వేకర్, ముఖ్యమంత్రి
  • రాజేంద్ర చావ్లా - జైశంకర్ తివారీ; ముఖ్యమంత్రి సహాయకుడు
  • గౌరవ్ కపూర్ - అర్జున్ ఖన్నా (నటుడు)
  • వీరేంద్ర సక్సేనా - బాబురావు పాటిల్, కొలాబా పోలీస్ స్టేషన్‌లో ఆఫీసర్ ఇన్-ఛార్జ్ (OC)
  • స్నేహల్ దాబీ - శంభు అకా ఎలక్ట్రిక్ బాబా
  • ఆయామ్ మెహతా - శంకర్ పాటిల్; ముఖ్యమంత్రి సహాయకుడు
  • అపూర్వ మెహ్రోత్రా - అనుజ్ శర్మ; ది హ్యాకర్
  • శక్తి భారతి - ఇన్‌స్పెక్టర్ జై ప్రతాప్ సింగ్ భార్య
  • విక్కీ అహుజా - ఆర్‌డిఎక్స్‌ను సరఫరా చేసే మధ్యవర్తి
  • నమ్రతా సాహ్ని - సామాన్యుడి భార్య (వాయిస్ ఓవర్)

పాటలు

మార్చు

ఇర్షాద్ కమిల్ & బుల్లెహ్ షా రచించిన పాటలకు సంజోయ్ చౌదరి సంగీతం అందించాడు.  ఆల్బమ్‌లో 6 పాటలు ఉన్నాయి.

  • "థీమ్ సాంగ్" - N/A
  • "బెకలి" - జావేద్ అలీ
  • "బుల్లే షా" - తోచి రైనా
  • "బుల్లే షా - రీమిక్స్" - తోచి రైనా
  • "జల్వా" - షాన్
  • "నాజర్ లగే నా" - షాన్, మహాలక్ష్మి అయ్యర్
  • "పర్వాజెన్" - షాన్

రీమేక్‌లు

మార్చు

ఈ సినిమాని తమిళం, తెలుగులోకి రీమేక్ చేయగా తమిళ వెర్షన్‌లో మోహన్‌లాల్ & కమల్ హాసన్ ప్రధాన పాత్రలు పోషించగా, తెలుగు వెర్షన్‌లో కమల్ హాసన్ & వెంకటేష్ ప్రధాన పాత్రలు పోషించారు.

అవార్డులు & నామినేషన్లు

మార్చు
సంవత్సరం అవార్డు విభాగం నామినీ స్థితి మూ
2008 56వ జాతీయ చలనచిత్ర అవార్డులు దర్శకుని ఉత్తమ తొలి చిత్రం నీరజ్ పాండే గెలిచింది [6]
2009 54వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉత్తమ దర్శకుడు నామినేట్ చేయబడింది [7]
ఉత్తమ నటుడు నసీరుద్దీన్ షా
స్క్రీన్ అవార్డులు ఉత్తమ చిత్రం రోనీ స్క్రూవాలా , శీతల్ భాటియా, అంజుమ్ రిజ్వీ నామినేట్ చేయబడింది [8]
ఉత్తమ దర్శకుడు నీరజ్ పాండే గెలిచింది
ఉత్తమ కథ
మోస్ట్ ప్రామిసింగ్ డెబ్యూ డైరెక్టర్
ఉత్తమ నటుడు నసీరుద్దీన్ షా నామినేట్ చేయబడింది
ఉత్తమ సహాయ నటుడు అనుపమ్ ఖేర్
ఉత్తమ నేపథ్య సంగీతం సంజయ్ చౌదరి
బెస్ట్ ఎడిటింగ్ శ్రీ నారాయణ్ సింగ్
ఉత్తమ స్క్రీన్ ప్లే నీరజ్ పాండే
బెస్ట్ డైలాగ్
బెస్ట్ సౌండ్ డిజైనింగ్ రాకేష్ రంజన్
ఉత్తమ కళా దర్శకుడు సునీల్ నిగ్వేకర్
2009 3వ ఆసియా పసిఫిక్ స్క్రీన్ అవార్డులు ఉత్తమ నటుడు నసీరుద్దీన్ షా [9]

మూలాలు

మార్చు
  1. "Saif's Phantom to Akshay's Baby: How Bollywood has dealt with terrorism on screen", India Today. Retrieved 27 August 2015.
  2. "Neeraj Pandey taking it easy after A Wednesday". Hindustan Times. 25 September 2008. Archived from the original on 9 February 2011.
  3. "Naseer and Anupam Kher are poles apart'". Rediff.com Movies. 2 September 2008.
  4. "A Wednesday". British Board of Film Classification.
  5. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; nett అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  6. "56th National Film Awards" (PDF). Archived from the original (PDF) on 2013-10-19.
  7. "Nominations for 54th Filmfare Awards 2009". Sify.com. Archived from the original on 31 July 2017. Retrieved 27 November 2018.
  8. "Star Screen Awards nominations". India Cine. 8 January 2009.
  9. "Asia Pacific Screen Awards Nominees & Winners Archive 2009". www.asiapacificscreenacademy.com. Archived from the original on 16 డిసెంబరు 2014. Retrieved 16 డిసెంబరు 2014.

బయటి లింకులు

మార్చు