కనక్ రెలె
డా.కనక్ రెలే (ఆంగ్లం: Kanak Rele; 2023 ఫిబ్రవరి 22 - 1937 జూన్ 11) భారతీయ నృత్యకళాకారిణి, నృత్య దర్శకురాలు. మోహినీయాట్టం నృత్యంలో ప్రసిద్ధురాలు. ఆమె నలందా రీసెర్చ్ సెంటర్ కు వ్యవస్థాపకురాలు, దర్శకురాలు. ఆమె ముంబాయి లోని నలందా నృత్య కళా మహావిద్యాలయానికి వ్యవస్థాపకురాలు, ప్రిన్సిపాల్.[1][2]
కనక్ రెలె | |
---|---|
![]() | |
జననం | గుజరాత్, బ్రిటిష్ ఇండియా | 1937 జూన్ 11
మరణం | 22 ఫిబ్రవరి 2023 ముంబై, మహారాష్ట్ర, భారతదేశం | (aged 85)
వృత్తి |
|
సుపరిచితుడు/ సుపరిచితురాలు | మోహినియాట్టం |
జీవిత భాగస్వామి | యతీంద్ర రెలె |
పిల్లలు | 1 |
పురస్కారాలు | పద్మ భూషణ్ పద్మశ్రీ సంగీత నాటక అకాడమీ అవార్డు కాళిదాస్ సమ్మాన్ గౌరవ్ పురస్కార్ కళా విపంచి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి అవార్డు |
ప్రారంభ జీవితం , విద్య
మార్చుఆమె గుజరాత్ లో జన్మించారు.[3] ఆమె బాల్యంలో కోల్‌కతా లోని శాంతినికేతన్లో కొంతకాలం గడిపారు. శాంతినికేతన్ లో కథాకలి, మోహిని అట్టం నృత్యరీతులను ప్రదర్శించే అవకాశం ఆమెకు లభించింది.[4][5] ఆమె అర్హత పొందిన న్యాయవాది. ఆమె ఎల్.ఎల్.బిని ముంబాయి లోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో చేశారు. ఆమె మాంచెస్టర్ విశ్వవిద్యాలయం నుండి అంతర్జాతీయ న్యాయశాస్త్రం చదివారు.[5] ఆమె ముంబాయి విశ్వవిద్యాలయంలో నృత్యంలో పి.హెచ్.డి చేశారు.[6]
మోహినియాట్టం ఆర్టిస్టు
మార్చుడా. రెలే కథాకలి కళాకారిణి కూడా. ఆమె తన ఏడవయేట "పాంచాలి:కరుణాకర పానికెర్ అనే గురువువద్ద శిక్షణ పొందారు.[5][7] ఆమె కలామండలం రాజలక్ష్మి వద్ద నుండి మోహినీ అట్టం అభ్యసించారు. ఆమెకు వచ్చిన సంగీత నాటక అకాడమీ పారితోషికం, ఫోర్డ్ ఫౌండేషన్ సహకారంతో ఆమె మోహినీ అట్టం పై ఆసక్తిని పెంపొందించుకున్నారు. 1970-71 కాలంలో ఆమె కేరళలో ప్రముఖ సినిమా కళాకారులైన కుంజుకుట్టి అమ్మ, చిన్నమ్ము అమ్మ, కల్యాని కుట్టి అమ్మ ల వద్దకు వెళ్ళారు.
మూలాలు
మార్చు- ↑ "ARTISTE'S PROFILE - Kanak Y. Rele". Centre for Cultural Resources and Training. Archived from the original on 18 ఫిబ్రవరి 2013. Retrieved 27 January 2013.
- ↑ "Imagination unlimited". The Hindu. October 27, 2006. Archived from the original on 13 నవంబరు 2007. Retrieved 27 January 2013.
- ↑ "Kanak Rele gets Kalidas Samman". Narthaki. May 7, 2006. Retrieved 27 January 2013.
- ↑ "Dance has its own language: Dr. Kanak Rele". Times of India. April 9, 2011. Archived from the original on 2013-02-16. Retrieved 27 January 2013.
- ↑ 5.0 5.1 5.2 "'Dance has to serve more social causes'". The Hindu. October 28, 2010. Retrieved 27 January 2013.[permanent dead link]
- ↑ "Dancing Queen - Dr.Kanak Rele". Archived from the original on 6 జనవరి 2013. Retrieved 27 January 2013.
- ↑ "Tryst with Mohiniyattam". The Hindu. January 29, 2006. Archived from the original on 14 మార్చి 2007. Retrieved 27 January 2013.