కన్నమ దాసు
గోసంఘి వీరుడు కన్నమ దాసు 11వ శతాబ్దం లో మాచర్ల సేన లకు సర్వ సేనాని. బ్రహ్మా నాయుడు కి నమ్మిన బంటు. పల్నాటి మహా వీరుడు .కన్నమ దాసు తండ్రి తెప్పల నాయన్న, తల్లి పెమ్మసాని. బ్రహ్మ నాయుడు దళితులకు దేవాలయాల ప్రవేశం గావించాడు. చాపకూటితో సహపంక్తి భోజనాలను ఏర్పాటుచేశాడు. కన్నమ దాసును దత్తత పొంది మాచర్ల రాజ్యానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా చేశాడు. అందుకే కన్నమ దాసు బ్రహ్మనాయుడిని తండ్రిగా సంబోధిస్తాడు. చిన్నప్పటి నుండే కన్నమదాసు కు పట్టుదల, వీరత్వం, భయపడని గుణం తల్లి, తండ్రులు నేర్పారు. శ్రీనాధుడు తన పల్నాటి వీరచరిత్ర గ్రంధం లో కన్నమ దాసు అరివీర భయంకరుడుని, మహా వీరుడని తెలిపారు. ఆ రోజుల్లో కన్నమదాసు ను కన్నమనీడు, గోసంఘి కన్నమ అని పిలిచేవారట. కన్నమదాసు కదన రంగ వీరుడు. పల్నాటి యుద్దంలో బాలచంద్రుడు లాంటి మహావీరులు మరణించినను, కన్నమ దాసు సైన్యాన్ని నడిపించి బ్రహ్మన్న గారి సహకారంతో నాగమ్మ ను ఓడించి మాచర్ల కు విజయాన్ని చేకూర్చాడు. కన్నమ దాసు రాజాజ్ఞ ను పాటించటం లో గొప్ప విధేయుడని, అత్యంత సమయస్పూర్తి గలవాడు.కన్నమ దాసు వాడిన భైరవ ఖడ్గం లాంటి ఆయుధాలను ఇప్పటికీ పూజలు అందుకుంటున్నాయి. బ్రహ్మన్న కు శత్రువుల నుండి కలిగే ముప్పును కూడా అనుక్షణం గమనిస్తూ కంటికి రెప్పలా కాపాడే వాడు. కన్నమ దాసు పక్కన ఉండగా బ్రహ్మనాయుడుని ఎవరు ఏమి చేయలేరని నానుడి.