కమల్‌చంద్రభంజ్‌దేవ్

ప్రస్తుత బస్తర్ పాలకుడు కమల్ చంద్ర భంజ్ దేవ్

బస్తర్ రాజవంశంలో ఈయన 22వ పరిపాలకుడు ప్రస్తుతం కూడా కొనసాగుతున్నది ఈయనే. 1984  మార్చి 13 వ తారీఖున జన్మించిన కమల్ చంద్ర కూడా వారి పూర్వికుల మాదిరిగానే రాజ్ కుమార్ కళాశాలలో విద్యనభ్యసించారు(2003). [1]

అంతర్జాతీయ వాణిజ్యంలో మాస్టర్ సైన్సు డిగ్రీని సాధించారు. మాస్టర్ ఆఫ్ పొలిటికల్ సైన్సు డిగ్రీని బెంగుళూరులోని సెయింట్ జోసెఫ్స్ కాలేజ్ ఆఫ్ కామర్సు నుండి పొందారు.  

కమల్‌ చంద్ర భంజ్‌దేవ్ కాకతీయ ప్రస్తుతం మహారాజు హోదా లో ఉన్నారు. లండన్‌లో విద్యాభ్యాసం చేసిన కమల్‌ చంద్ర భంజ్ దేవ్ ప్యాలెస్‌లోనే ఉంటూ.. ఈమధ్య రాజకీయాల్లోకి వచ్చారు. ఛత్తీస్ఘడ్ రాష్ట్రానికి క్యాబినెట్ హోదాలో యూత్ కమిషన్ చైర్మన్ గా సేవలందించారు.[1]

  1. Rathore, Abhinay (1863). "Bastar (Princely State)". Rajput Provinces of India (in ఇంగ్లీష్). Retrieved 2025-01-23.