కలువకొలను సదానంద

రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత

కలువకొలను సదానంద ప్రముఖ బాల సాహిత్య రచయిత. బాలసాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ వారి మొట్టమొదటి బాలసాహిత్య పురస్కార్‌ పురస్కారం అందుకున్న వ్యక్తి.

కలువకొలను సదానంద
కలువకొలను సదానంద
జననంకలువకొలను సదానంద
ఫిబ్రవరి 22, 1939
పాకాల, చిత్తూరు జిల్లా
మరణంఆగస్టు 25, 2020
పాకాల, చిత్తూరు జిల్లా
మరణ కారణంసహజ మరణం
నివాస ప్రాంతంపాకాల
ఇతర పేర్లుకలువకొలను సదానంద
వృత్తిఉపాధ్యాయుడు
ప్రసిద్ధిబాల సాహితీకారుడు, ప్రముఖ రచయిత
మతంహిందూ
భాగస్వాములుకస్తూరి
పిల్లలుకలువకొలను ఇందుమౌళి, సుధానిధి, తారక లక్ష్మి, దివ్య మూర్తి.
తండ్రికృష్ణ పిళ్ళై
తల్లినాగమ్మ
Notes
బాలసాహిత్య పురస్కార్‌ అవార్డు గ్రహీత

జీవిత విశేషాలు

మార్చు

సదానంద చిత్తూరు జిల్లా పాకాల లో శ్రీమతి నాగమ్మ, కృష్ణయ్య దంపతులకు తేది. ఫిబ్రవరి 22 1939 న జన్మించారు. ఎస్‌.ఎస్‌. ఎల్‌.సి చేసి టి.ఎస్‌.ఎల్‌.సి చదివారు. వృత్తిరీత్యా 36 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేసి 1997లో పదవీ విరమణ పొంది పాకాల లోనే స్థిర పడ్డారు.

రచయితగా

మార్చు

సదానంద మొదటి రచన తన 18 ఏటనే ప్రచురితమైంది. చందమామ, బాలమిత్ర, బాలజ్యోతి, బాలరంజని, బొమ్మరిల్లు, బాలభారతి, బుజ్జాయిలాంటి బాలల మాస పత్రికలలో, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి వంటి వార, మాస పత్రికలలోని పిల్లల శీర్షికలలో వీరి రచనలు ప్రచురితమయ్యాయి. ప్రస్తుతం ఈనాడు దినపత్రిక ‘హాయ్‌బుజ్జి’ పేజీలో వీరికథలు ఎక్కువగా మనం గమనించవచ్చు.

సదానంద బాలలకోసం ఇప్పటి వరకు 200కు పైగా కథలు, 2 నవలలు, 100 కి పైగా గేయాలు, కొన్ని గేయకథలు రాశారు. 8 కథా సంపుటాలు, 2 నవలలు ప్రచురించారు. తన 25 సంలో రాసిన పిల్లలనవల బాల రంజనిలో సీరియల్‌గా వచ్చింది. 1964లో మొదటి కథా సంపుటి ‘సాంబయ్య గుర్రం’ ప్రచురితమైంది. అదే సంవత్సరం ‘చల్లనితల్లి’, 1966లో నీతికథామంజరి, 1967లో విందుభోజనం, 1983లో శివానందలహరి ఇలా... మొత్తం 8 కథా సంపుటాలు ప్రచురించారు. 1965లో బాలల కోసం ‘బంగారు నడిచినబాట’ నవల ప్రచురించారు. ఈ నవలకు 1966లో ఉత్తమ బాల సాహిత్య గ్రంధంగా కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ వారి పురస్కారం లభించింది. వీరి "నవ్వే పెదవులు - ఏడ్చేకళ్ళు" కథా సంపుటానికి 1976లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. తెలుగు కథాసాహిత్యంలో వంద ఆణిమ్యుత్యాలు పేరుతో వెలువడిన కథా సంకలనంలో వీరి కథ "తాత దిగిపోయిన బండి"కి స్థానం లభించింది. త్వరలో వీరి "పరాగభూమి కథలు" గ్రంథం వెలువడనుంది.[1]

పెన్నేటి ప్రచురణలు, కడప వారు సదానంద పిల్లల నవల ‘అడవితల్లి’ 2007లో ప్రచురించారు. మహాభారతంలోని కొన్ని పద్యాల ఆధారంగా అల్లిన నవల. మొదట ఈ నవల ‘బాలరంజని’ పిల్లల మాసపత్రికలో ప్రచురితమై బాలలను అలరించింది.

పురస్కారాలు

మార్చు

ఈయన ఆగస్టు 25, 2020న పాకాలలోని తన స్వగృహంలో స్వర్గస్థులైనారు.

మూలాలు

మార్చు
  1. కథల కొలను - కలువకొలను - పలమనేరు బాలాజీ - ఆంధ్రజ్యోతి దినపత్రిక - 22 ఫిబ్రవరి, 2016[permanent dead link]
  2. "23మందికి కళారత్న పురస్కారం". www.andhrabhoomi.net. 2016-04-09. Archived from the original on 2016-04-10. Retrieved 2023-03-24.
  3. తెలుగు విశ్వవిద్యాలయం, పురస్కారాలు. "ప్రతిభా పురస్కారాలు" (PDF). www.teluguuniversity.ac.in. Archived from the original (PDF) on 9 సెప్టెంబరు 2017. Retrieved 7 జూన్ 2020.
  4. సాక్షి, హైదరాబాదు (18 December 2013). "తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారాలు". Sakshi. Archived from the original on 20 September 2021. Retrieved 20 September 2021.


ఇతర మూలాలు

మార్చు