కాకినాడ టౌన్ - సికింద్రాబాద్ ఎసి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
కాకినాడ టౌన్ - సికింద్రాబాద్ ఎసి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక సూపర్‌ఫాస్ట్ [1] ఇది కాకినాడ టౌన్ రైల్వే స్టేషను, సికింద్రాబాద్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[2] కాకినాడ - సికింద్రాబాద్ ఎసి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వారానికి మూడు రోజులు సికింద్రాబాద్ నుండి కాకినాడ టౌన్ వరకు నడిచే విధంగా నాటి భారతీయ రైల్వేలు మంత్రి దినేష్ త్రివేది, 2012-13 రైల్వే బడ్జెట్లో ప్రకటించారు. ఈ ఎసి ఎక్స్‌ప్రెస్ భీమవరం టౌన్, విజయవాడ జంక్షన్ మీదుగా నడిపించే విధంగా ప్రతిపాదించారు.[3]
సారాంశం | |||||
---|---|---|---|---|---|
రైలు వర్గం | సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ | ||||
స్థితి | ఆపరేటింగ్ | ||||
స్థానికత | ఆంధ్ర ప్రదేశ్ | ||||
ప్రస్తుతం నడిపేవారు | దక్షిణ మధ్య రైల్వే జోను, భారతీయ రైల్వేలు | ||||
మార్గం | |||||
మొదలు | సికింద్రాబాద్ జంక్షన్ | ||||
ఆగే స్టేషనులు | 09 | ||||
గమ్యం | కాకినాడ | ||||
ప్రయాణ దూరం | 589 కి.మీ. (366 మై.) | ||||
సగటు ప్రయాణ సమయం | 10 గం.లు, 35 ని.లు | ||||
రైలు నడిచే విధం | సికింద్రాబాద్ నుండి కాకినాడ టౌన్ వరకు - వారానికి మూడు రోజులు (సోమ, బుధ , శుక్రవారములు) కాకినాడ టౌన్ నుండి సికింద్రాబాద్ వరకు - వారానికి మూడు రోజులు (ఆది, మంగళ , గురువారములు) | ||||
సదుపాయాలు | |||||
శ్రేణులు | ఎసి స్లీపర్ 1వ తరగతి, 2వ తరగతి , 3వ తరగతి | ||||
వికలాంగులకు సదుపాయాలు | భారతీయ రైల్వేలు ప్రామాణికం | ||||
పడుకునేందుకు సదుపాయాలు | ఉంది | ||||
ఆహార సదుపాయాలు | ఉంది | ||||
చూడదగ్గ సదుపాయాలు | అన్ని భోగీలకు శుభ్రమైన పెద్ద కిటికీలు | ||||
బ్యాగేజీ సదుపాయాలు | సీట్ల క్రింద సదుపాయం ఉన్నది. | ||||
సాంకేతికత | |||||
రోలింగ్ స్టాక్ | రెండు | ||||
పట్టాల గేజ్ | బ్రాడ్‌గేజ్ (1,676 mm) | ||||
విద్యుతీకరణ | 5,350 hp (3,989 kW) | ||||
వేగం | 55 కి.మీ./గంటకు సరాసరి వేగం" | ||||
|
రేక్ (భోగీలు)
మార్చుఈ రైలుకు ఎసి స్లీపర్ 1వ తరగతి (1ఎ) - 1 భోగీ, 2వ తరగతి - 5 బోగీలు, 3వ తరగతి - 10 బోగీలు, ఈఒజి (ఎండ్ ఆఫ్ జనరేషన్) కార్లు - 2 బోగీలు ఉంటాయి.
ఇంజను
మార్చుకాకినాడ టౌన్ - సికింద్రాబాద్ ఎసి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ యొక్క ప్రయాణ రైలు మార్గమునకు విద్యుద్దీకరణ పనులు కొద్ది దూరము వరకే చేయుట వలన కాకినాడ టౌన్ నుంచి విజయవాడ వరకు ఉన్న రైలు మార్గము విభాగం వరకు విజయవాడ డిపోకు చెందిన డబ్ల్యుఎఎం4/ డబ్ల్యుఎపి4 ఇంజను ద్వారా లాగబడుతుంది. ఆ తదుపరి విద్యుత్తు ఇంజను అందుబాటును బట్టి లాలగూడా డిపోకు చెందిన డబ్ల్యుఎపి7/ డబ్ల్యుఎపి4, విజయవాడ డిపోకు చెందిన డబ్ల్యుఎఎం4/డబ్ల్యుఎపి4 ఇంజను ద్వారా విజయవాడ నుంచి సికింద్రాబాద్ వరకు లాగబడుతుంది.
చరిత్ర
మార్చుకాకినాడ యొక్క నైరుతి భాగము (ఇప్పుడు సర్పవరం) తెలుగులో కోకనాడము అని పిలుస్తారు. ఈ ప్రాంతము ఎర్ర లోటస్ (కలువలు) తో నిండి చెరువులు అంతటా పూర్తిగా నిండి ఉంటుంది. చివరకు ఇది కోకనాడగా మారింది. అందువల్ల రైలుకు గతకాలపు ఆనవాళ్ళకు గుర్తుగా కాకినాడ పేరు పెట్టారు. ఈ రైలుకు 2012 డిసెంబరు 14 నాడు కాకినాడ ఎక్స్‌ప్రెస్ అని పేరు పెట్టబడింది.
రైలు ప్రయాణము
మార్చురైలు నంబరు : 12775 కాకినాడ టౌన్ నుండి గం. 22.15 ని.లకు బయలుదేరి, గం. 08:50 ని.లకు సికింద్రాబాద్ చేరుకునే విధంగా పరిచయం చేస్తున్న సమయంలో ముందుగా నిర్ణయించబడింది. అదేవిధముగా రైలు నంబరు : 12776 సికింద్రాబాద్ నుండి గం. 21.15 ని.లకు బయలుదేరి, గం. 07:45 ని.లకు కాకినాడ టౌన్ చేరుకునే విధంగా పరిచయం చేస్తున్న సమయంలో ముందుగా నిర్ణయించబడింది. ఇప్పుడు ఈ సమయాలు మార్చబడ్డాయి.[4][5][6]
సేవలు (సర్వీస్)
మార్చుకాకినాడ టౌన్ - సికింద్రాబాద్ ఎసి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, కాకినాడ టౌన్ నుండి సికింద్రాబాద్ వరకు మొత్తం 9 విరామములతో చేరుతుంది. ఈ రైలు 589 కిలోమీటర్ల దూరాన్ని 10 గంటల 45 నిమిషాల్లో చేరుకుంటుంది. ఈ రైలు గంటకు 54 కి.మీ. సరాసరి వేగంతో నడుస్తుంది.
ఈ రైలు నంబరు : 12775 / 12776 కాకినాడ టౌన్ - సికింద్రాబాద్ ఎసి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం తదుపరి, రైలునకు శాశ్వతంగా 2015 జనవరి 29 నుండి ఒక ఎసి టూ టైర్ కోచ్ (46 బెర్త్లు) కూడా కాకినాడ టౌన్ నుండి జత కలిసింది. అదేవిధముగా 30 వ జనవరి 2015 నుండి సికింద్రాబాద్ నుండి జత కలిసింది.[7]
రైలు నిలుపుదల స్టేషన్లు
మార్చుఈ రైలు రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, ఖమ్మం, వరంగల్ స్టేషన్లలో ఆగుతుంది.
భోగీలు కూర్పు
మార్చుబోగీలు కూర్పు (అమరిక) ఈ క్రింద విధముగా ఉంటాయి. అవసరార్థము బోగీలు అమరికలు మారుతూ ఉంటాయి.
Loco | 0 | L | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
0 | L | EOG | B1 | B2 | B3 | B4 | B5 | B6 | B7 | B8 | B9 | B10 | A1 | A2 | A3 | A4 | H1 | EOG | BZA |
ఇవి కూడా చూడండి
మార్చుబయటి లింకులు
మార్చుమూలాలు
మార్చు- ↑ http://indiarailinfo.com/trains?date=undefined&dd=0&ad=0&co=0&tt=7&ed=0&dp=0&ea=0&ap=0&loco=&drev=undefined&arev=undefined&trev=0&rake=&rsa=0&idf=0&idt=0&dhf=0&dmf=0&dht=0&dmt=0&ahf=0&amf=0&aht=0&amt=0&nhf=-1&nht=-1&ttf=0&ttt=0&dstf=0&dstt=0&spdf=0&spdt=0&zone=0&pantry=0&stptype=undefined&trn=0&q=
- ↑ http://www.indianrail.gov.in/mail_express_trn_list.html
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-05-26. Retrieved 2016-04-19.
- ↑ http://www.prokerala.com/travel/indian-railway/trains/kakinada-secunderabad-cocanada-express-2333.html
- ↑ https://www.youtube.com/watch?v=vr8RgqQ5_6I
- ↑ http://railenquiry.in/runningstatus/12775
- ↑ http://www.scr.indianrailways.gov.in/view_detail.jsp?lang=0&dcd=5270&id=0,5,268