కాల్కా మెయిల్
కాల్కా మెయిల్ భారతీయ రైల్వేలు నిర్వహిస్తున్న పురాతన రైలు సర్వీసుల్లో ఒకటి.ఇది పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కాతా సమీపంలో గల హౌరా నుండి బయలుదేరి హర్యానా రాష్టంలో గల కాల్కా వరకు ప్రయాణిస్తుంది.
సారాంశం | |
---|---|
రైలు వర్గం | సూపర్ ఫాస్ట్ రైలు |
స్థానికత | పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్,ఉత్తర ప్రదేశ్,ఢిల్లీ,పంజాబ్ మరియుహర్యానా |
తొలి సేవ | 1866 as the "East Indian Railway Mail". |
ప్రస్తుతం నడిపేవారు | తూర్పు రైల్వే మండలం |
మార్గం | |
మొదలు | హౌరా జంక్షన్ రైల్వే స్టేషను |
గమ్యం | కాల్కా |
ప్రయాణ దూరం | 1,713 కిలోమీటర్లు (1,064 మై.) |
రైలు నడిచే విధం | రోజు |
సదుపాయాలు | |
శ్రేణులు | స్లీపర్ , ఏ.సి 1,2,3 జనరల్ |
కూర్చునేందుకు సదుపాయాలు | కలదు |
పడుకునేందుకు సదుపాయాలు | కలదు |
ఆహార సదుపాయాలు | పాంట్రీ కార్ ఉంది |
వినోద సదుపాయాలు | లేదు |
బ్యాగేజీ సదుపాయాలు | కలవు |
సాంకేతికత | |
పట్టాల గేజ్ | 1,676 mm (5 ft 6 in) |
వేగం | 115 km/h (71 mph) maximum 57 km/h (35 mph) (average with halts) |
చరిత్ర
మార్చుకాల్కా మెయిల్ ను ఈస్ట్ ఇండియా రైలే కంపెనీ 1866 లో హౌరా నుండి పాత ఢిల్లీ వరకు ఈస్ట్ ఇండియా రైలే మెయిల్ పేరుతో ప్రారంభించింది.1891 లో దీనిని కల్కా వరకు పొడిగించడమైనది.నాడు కాల్కా మెయిల్ యొక్క ప్రధాన ఉద్దేశం భారత ప్రధాన రాజధాని అయిన కోల్‌కాతా నుండి భారత వేసవి రాజధాని అయిన సిమ్లాకు అనుసంధానం చేయడం.కోల్‌కాతా నుండి సిమ్లా వరకు ప్రభుత్వ యంత్రాంగాన్ని, తరలించడానికి కాల్కా మెయిల్ ను ఉపయోగించేవారు.ప్రభుత్వ యంత్రాంగాన్ని తరలించడానికి వీలుగా కోల్‌కాతా లోను సిమ్లా లోను ప్రత్యేక ఏర్పాట్లు ఉండేవి. కాల్కా మెయిల్ ను ప్రస్తుతం తూర్పు రైల్వే మండలం నిర్వహిస్తున్నది.
ప్రయాణ సమయం
మార్చుకాల్కా మెయిల్ మొదటిరోజు రాత్రి 07గంటల 40నిమిషాలకు హౌరా జంక్షన్ రైల్వే స్టేషను 12311 నెంబరుతో బయలుదేరి మూడవ రోజు ఉదయం 04గంటల 30నిమిషాలకు కాల్కా చేరుతుంది.తిరుగుప్రయాణంలో కాల్కాలో 12312 నెంబరుతో రాత్రి 11గంటల 55నిమిషాలకు బయలుదేరి రెండు రోజుల ప్రయాణం తరువాత ముడవ రోజు ఉదయం 07గంటల 55 నిమిషాలకు హౌరా జంక్షన్ రైల్వే స్టేషనును చేరును.హౌరా జంక్షన్ రైల్వే స్టేషను నుండి కాల్కాను చేరుటకు 32గంటల 50నిమిషాలు ప్రయాణసమయం, కాల్కా నుండి హౌరా చేరుటకు 32 గంటల సమయం తీసుకుంటున్నది.
ప్రయాణ మార్గం
మార్చుకాల్కా మెయిల్ హౌరా జంక్షన్ రైల్వే స్టేషను నుండి బయలుదేరి ధన్‌బాద్, గయ, అలహాబాద్, కాన్పూర్, అలీగడ్, ఘజియాబాద్, పాత ఢిల్లీ, అంబాలా, చండీగఢ్ ల మీదుగా కాల్కా చేరుతుంది.
సమయ సారిణి
మార్చుసం | కోడ్ | స్టేషను పేరు | 12311: | ||||
రాక | పోక | ఆగు
సమయం |
దూరం | రోజు | |||
1 | HWH | హౌరా | ప్రారంభం | 19:40 | 0.0 | 1 | |
2 | BWN | బర్ధమాన్ జంక్షన్ | 20:49 | 20:54 | 5ని | 94.4 | 1 |
3 | DGR | దుర్గాపూర్ | 21:41 | 21:43 | 2ని | 158.2 | 1 |
4 | ASN | ఆసన్సోల్ జంక్షన్ | 22:17 | 22:22 | 5ని | 200.4 | 1 |
5 | DHN | ధన్‌బాద్ | 23:26 | 23:36 | 10ని | 258.7 | 1 |
6 | GMO | గోమోహ్ | 00:05 | 00:15 | 10ని | 288.4 | 2 |
7 | PNME | పరస్నాథ్ | 00:29 | 00:31 | 2ని | 306.4 | 2 |
8 | HZD | హజారీబాగ్ | 00:53 | 00:55 | 2ని | 333.6 | 2 |
9 | KQR | కోడెర్మా | 01:28 | 01:30 | 2ని | 381.9 | 2 |
10 | GAYA | గయ | 02:55 | 03:00 | 5ని | 458.1 | 2 |
11 | DOS | దేహ్రి-ఆన్-సోనే | 03:55 | 03:57 | 2ని | 543.2 | 2 |
12 | SSM | ససారాం | 04:11 | 04:13 | 2ని | 561.0 | 2 |
13 | BBU | భబువ రోడ్ | 04:43 | 04:45 | 2ని | 308.7 | 2 |
14 | MGS | ముఘల్ సరై | 06:15 | 06:30 | 15ని | 663.3 | 2 |
15 | MZP | మిర్జాపూర్ | 07:35 | 07:40 | 5ని | 726.5 | 2 |
16 | ALP | అలహాబాద్ | 09:00 | 09:10 | 10ని | 816.0 | 2 |
17 | FTP | ఫతెహ్ పుర్ | 1055 | 1058 | 3ని | 932.8 | 2 |
18 | CNP | కాన్పూర్ | 12:25 | 12:35 | 10ని | 1010.4 | 2 |
19 | PHD | ఫఫుండ్ | 13:42 | 13:44 | 1093.5 | 2 | |
20 | ETW | ఈటవా జంక్షన్ | 14:28 | 14:30 | 2ని | 1149.8 | 2 |
21 | SKB | షికోహాబాద్ జంక్షన్ | 15:09 | 15:11 | 2ని | 1205.2 | 2 |
22 | FZD | ఫిరోజాబాద్ | 15:33 | 15:35 | 2ని | 1225 | 2 |
23 | TDL | తుండ్ల జంక్షన్ | 16:10 | 16:18 | 8ని | 1241.6 | 2 |
24 | HRS | హథ్రాస్ జంక్షన్ | 16:51 | 16:53 | 2ని | 1289.6 | 2 |
25 | ALJN | అలీగడ్ | 17:20 | 17:25 | 5ని | 1319.8 | 2 |
26 | KRJ | ఖుర్జ | 17:55 | 17:58 | 3ని | 1363.1 | 2 |
27 | GZB | ఘజియాబాద్ | 20:00 | 20:02 | 2ని | 1425.8 | 2 |
28 | DLI | పాత ఢిల్లీ | 20:45 | 21:35 | 50ని | 1446.1 | 2 |
29 | SZM | సబ్జీ మండీ | 21:46 | 21:48 | 2ని | 1449.0 | 2 |
30 | SNP | సోనిపట్ | 22:20 | 22:22 | 2ని | 1489.4 | 2 |
31 | GNU | గన్నుర్ | 22:35 | 22:37 | 2ని | 1505.3 | 2 |
32 | SMK | సమల్ఖ | 22:49 | 22:51 | 2ని | 1517.6 | 2 |
33 | PNP | పానిపట్ | 23:07 | 23:09 | 2ని | 1534.7 | 2 |
34 | KUN | కర్నాల్ | 23:37 | 23:39 | 2ని | 1568.9 | 2 |
35 | KKDE | కురుక్షేత్ర జంక్షన్ | 00:35 | 00:37 | 2ని | 1602.1 | 3 |
36 | UMB | అంబాలా | 02:10 | 02:20 | 10ని | 1644.1 | 3 |
37 | CDG | చండీగఢ్ | 03:00 | 03:50 | 50ని | 1688.8 | 3 |
38 | CNDM | చండి మందిర్ | 04:04 | 04:05 | 1ని | 1698.1 | 3 |
39 | KLK | కాల్కా | 04:30 | గమ్యం |
భోగీల అమరిక
మార్చుకాల్కా మెయిల్ లో 11 స్లీపర్స్, 7 ఎ.సి కోచ్‌లు (1AC, 2AC, 3AC), 1 పాంట్రీ కార్, 3 జనరల్ సిటింగ్, 2 ఎస్.ఎల్.ఆర్ బోగీలు ఉంటాయి.
Loco | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
SLR | RMS | UR | S1 | S2 | S3 | S4 | S5 | PC | B1 | B2 | B3 | A3 | A1 | A2 | HA1 | S6 | S7 | S8 | S9 | S10 | S11 | UR | D1 |
సంఘటనలు
మార్చుజులై 10 2011 న కాన్పూర్, ఫతెహ్ పుర్ రైల్వే స్టేషన్ ల మద్య కాల్కా మెయిల్ పట్టాలు తప్పడంతో సమారు 69మంది మృతి చెందగా,200మందికి పైగా ప్రయాణికులు గాయాలపాలైయ్యారు.దీనికి కారణం లోకోమోటివ్ యొక్క నిర్వహణ సరిగ్గా లేకపోవడమని దర్యాప్తూలో తేలింది.