కేయీ పన్యోర్ జిల్లా

అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జిల్లా
(కీ పాన్యోర్ జిల్లా నుండి దారిమార్పు చెందింది)

కేయీ పన్యోర్ జిల్లా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక జిల్లా. ఇది 2024 మార్చి 1న కొత్తగా ఏర్పడింది. కేయీ పన్యోర్ జిల్లా ప్రధాన కార్యాలయం యాచులి.[1][2]

కేయీ పన్యోర్ జిల్లా
దేశం India
రాష్ట్రంఅరుణాచల్ ప్రదేశ్
స్థాపన2024 మార్చి 1
జనాభా
 (2011)
 • Total30,000
Time zoneUTC+05:30 (IST)
Vehicle registrationAR

చరిత్ర

మార్చు

అప్పటి లోయర్ సుబన్‌సిరి జిల్లాను విభజించడం ద్వారా కేయీ పన్యోర్ జిల్లాను ఏర్పాటు చేయాలని 2022 డిసెంబరులో ఆల్ యాచులి స్టూడెంట్ యూనియన్ డిమాండు చేసింది. [3]2023 సెప్టెంబరులో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ ఈ జిల్లా ఏర్పాటు చేయటానికి ప్రకటించారు. [4][5] 2024 ఫిబ్రవరిలో జిల్లా ఏర్పాటుకు సంబంధించిన బిల్లును పెమా ఖండూ మంత్రివర్గం ఆమోదించింది.[6] లోయర్ సుబన్‌సిరి జిల్లా నుండి 195 గ్రామాలను చెక్కడం ద్వారా ఇది ఏర్పడింది.[7] 2024 మార్చి1న జిల్లా అధికారికంగా ప్రారంభించబడింది.[8][9]

జనాభా గణాంకాలు

మార్చు

ఈ జిల్లాలో ప్రధానంగా నైషి ప్రజలు నివసిస్తున్నారు. ఈ జిల్లాలో 30,000 మందికి పైగా జనాభాతో 195 గ్రామాలను కలిగిఉంది.[10]

విభాగాలు

మార్చు

అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఈ జిల్లాకు యాచులి శాసనసభ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తుంది.[11] ఈ జిల్లా అరుణాచల్ పశ్చిమ లోక్‌సభ నియోజకవర్గంలో పాక్షికం.[12]

మూలాలు

మార్చు
  1. "Arunachal Assembly passes bill for two new districts". India Today NE (in హిందీ). 2024-02-08. Retrieved 2024-02-25.
  2. PTI. "Arunachal CM announces creation of 'Keyi Panyor' district". Deccan Herald. Retrieved 2024-06-25.
  3. "Create Keyi Panyor district by bifurcating Lower Subansiri: AYSU". Arunachal Observer. 2022-12-05. Retrieved 2024-02-25.
  4. "Keyi Panyor becomes 26th district of Arunachal Pradesh". The Indian Express. 2024-03-02. Retrieved 2024-06-25.
  5. PTI. "Arunachal CM announces creation of 'Keyi Panyor' district". Deccan Herald. Retrieved 2024-02-25.
  6. "Arunachal Pradesh cabinet approves Keyi Panyor, Bichom as new districts". The Times of India. 2024-02-06. ISSN 0971-8257. Retrieved 2024-06-25.
  7. "Arunachal assembly passes bill to create two new districts". The Week. Retrieved 2024-02-25.
  8. Today, North East (2024-03-01). "Arunachal: New District Keyi Panyor Officially Inaugurated Today". Northeast Today. Retrieved 2024-03-03.
  9. "Arunachal Pradesh cabinet approves Keyi Panyor, Bichom as new districts". The Times of India. 2024-02-06. ISSN 0971-8257. Retrieved 2024-06-25.
  10. "Arunachal government inaugurates 27th district, Keyi Panyor, amid grand celebrations". India Today NE. 2024-03-01. Retrieved 2024-03-03.
  11. "Arunachal: Pema Khandu inaugurates new district 'Keyi Panyor'". 2024-03-01. Retrieved 2024-03-03.
  12. "Assembly Constituencies allocation w.r.t District and Parliamentary Constituencies". Chief Electoral Officer, Arunachal Pradesh website. Archived from the original on 13 August 2011. Retrieved 21 March 2011.