కుల్కచర్ల మండలం
కుల్కచర్ల మండలం, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.[1] కుల్కచర్ల, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన మహబూబ్ నగర్ నుండి 40 కి. మీ. దూరంలో ఉంది.పరిగి అసెంబ్లీ నియోజకవర్గంలో భాగమైన మహబూబ్ నగర్ జిల్లా సరిహద్దులో ఉంది. మహబూబ్ నగర్ నుంచి పరిగి వెళ్ళు ప్రధాన రహదారి ఈ మండలం గుండా వెళుతుంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం వికారాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది చేవెళ్ళ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 16 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు
కుల్కచర్ల మండలం | |
— మండలం — | |
![]() |
|
అక్షాంశరేఖాంశాలు: 17°00′39″N 77°52′01″E / 17.010828°N 77.866859°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | వికారాబాదు జిల్లా |
మండల కేంద్రం | కుల్కచర్ల |
గ్రామాలు | 16 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 70,281 |
- పురుషులు | 35,780 |
- స్త్రీలు | 34,501 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 36.40% |
- పురుషులు | 48.44% |
- స్త్రీలు | 24.02% |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
గణాంకాలు
మార్చు2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా - మొత్తం 70,281 - పురుషులు 35,780 - స్త్రీలు 34,501
1991 జనాభా లెక్కల ప్రకారము మండల జనాభా 46550 కాగా 2001 లెక్కల ప్రకారం 60217కు పెరిగింది. అందులో పురుషుల సంఖ్య సంఖ్య 30548, మహిళల సంఖ్య 29669. మండల జనసాంద్రత 222. స్త్రీ,పురుష నిష్పత్తి 971:1000. ఎస్సీ, ఎస్టీల సంఖ్య 8233, 15687. మొత్తం మండల జనాభాలో వీరి వాటా సుమారు 40%.
మండలంలోని గ్రామాలలో 5000 జనాభాకు పైబడిన గ్రామాల సంఖ్య 2 కాగా 2000 జనాభా కంటే అధికంగా ఉన్న గ్రామాలు 9 ఉన్నాయి.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 196 చ.కి.మీ. కాగా, జనాభా 56,038. జనాభాలో పురుషులు 28,444 కాగా, స్త్రీల సంఖ్య 27,594. మండలంలో 11,195 గృహాలున్నాయి.[3]
మండలంలోని పాఠశాలలు, కళాశాలలు
మార్చుమండలంలో 92 ప్రాథమిక పాఠశాలలు, 14 ప్రాథమికోన్నత పాఠశాలలు, 13 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. 2 జూనియర్ కళాశాలలతో పాటు 2 డిగ్రీకళాశాలలు ఉన్నాయి.
వర్షపాతం, నీటిపారుదల
మార్చుమండల సరాసరి వర్షపాతం 776 మిమీ. 2000-01లో అత్యధికంగా 1102 మిమీ వర్షం కురియగా ఆ తర్వాత రెండేళ్ళు కరువు ఏర్పడింది. 2003-04లో 955 మిమీ కాగా ఆ మరుసటి ఏడాది 487 మిమీ మాత్రమే కురిసింది. 2005-06, 207-08లలో కూడా వెయ్యి మిమీ దాటింది. సంవత్సర వర్షపాతంలో అత్యధికంగా జూన్, జూలై మాసములలో నైరుతి ఋతుపవనాల వలన కురుస్తుంది.
వ్యవసాయం, పంటలు
మార్చుమండలంలో పండించే ప్రధానపంటలు గోధుమ, వరి, వేరుశనగ, కందులు. కూరగాయలు, పండ్లు కూడా పండిస్తారు. మండలంలో మొత్తం పంట విస్తీర్ణం 6261 హెక్టార్లు. రైతుల సంఖ్య 10500.[4] కుల్కచర్ల గ్రామంలో అనేక రకాలైన పంటలను పండి స్తున్నారు.
మండలంలోని దేవాలయాలు, చారిత్రాత్మక ప్రదేశాలు
మార్చుప్రముఖ శివాలయం పాంబండ గ్రామంలో, రామలింగేశ్వరస్వామి దేవస్థానం మండల కేంద్రం కుల్కచర్లకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. అతివిశాలమైన మర్రిచెట్టుకు పేరుగాంచిన మరికల్, నిజాంనవాబుల కట్టడాలు కలిగిన ముజాహిద్‌పూర్ మండలం పరిధిలో ఉన్నాయి.
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
మార్చుచౌడాపూర్ మండలంలో చేరిన గ్రామాలు
మార్చు2016 పునర్వ్యవస్థీకరణలో ఈ మండలంలో 23 రెవెన్యూ గ్రామాలతో ఏర్పడింది.తరువాత ఈ మండలంలోని చౌడాపూర్ గ్రామం మండలకేంద్రంగా వికారాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో 2021 ఏప్రిల్ 24 న ఏర్పడిన చౌడాపూర్ అనే కొత్త మండలంలో ఈ దిగువ గ్రామాలు విలీనమయ్యాయి.[5][6]
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 248 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "వికారాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
- ↑ ముఖ్య ప్రణాళికాధికారి, రంగారెడ్డి జిల్లా, గణాంకాల పుస్తకం, 2007-08
- ↑ "తెలంగాణలో కొత్త మండలాలు ఇవే.. ఉత్తర్వులు జారీ". Samayam Telugu. Retrieved 2022-01-23.
- ↑ "Notification to create two new mandals issued". The New Indian Express. Retrieved 2022-01-23.