కొల్లి హేమాంబరధరరావు
(కె. హేమాంబరధరరావు నుండి దారిమార్పు చెందింది)
కె.హేమాంబరధరరావు గా ప్రసిద్ధి చెందిన కొల్లి హేమాంబరధరరావు తెలుగు చలనచిత్ర రంగ దర్శకుడు. ఈయన దర్శకుడు కె.ప్రత్యగాత్మకు సోదరుడు. ఈయన తన అన్న ప్రత్యగాత్మ లాగానే మొదట తాతినేని ప్రకాశరావుకి సహాయకుడిగా పనిచేశారు. రేఖా అండ్ మురళి ఆర్ట్స్ చిత్రనిర్మాణ సంస్థలో ఈయన సహభాగస్వామి. ఈయన దర్శకత్వం వహించిన దేవత (1965) చిత్రం ఘనవిజయం సాధించింది . మొదట ఈయన పిచ్చిపుల్లయ్య (1953) చిత్రానికి సహాయ దర్శకునిగా పనిచేశారు. ఈయన దర్శకత్వం వహించిన దేవకన్య (1968) చిత్రానికి ఈయనే రచయిత.
![](http://up.wiki.x.io/wikipedia/te/thumb/9/92/K_hemambaradhara_rao_in_potti_pleader.jpg/220px-K_hemambaradhara_rao_in_potti_pleader.jpg.png)
చిత్రసమాహారం
మార్చుదర్సకుడిగా
మార్చు- తండ్రులు కొడుకులు (1961)
- కలవారికోడలు (1964)
- దేవత (1965)
- వీలునామా (1965)
- పొట్టిప్లీడరు (1966)
- శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న (1967)
- ఆడపడుచు (1967)
- దేవకన్య (1968)
- కథానాయకుడు (1969)
- అదృష్ట జాతకుడు (1970)
- వింత దంపతులు (1972)
- ఇంటి దొంగలు (1973)
- ముగ్గురు మూర్ఖులు (1976)
- మహానుభావుడు (1977)
- నామాల తాతయ్య (1979)
- సుబ్బారాయుడు సుబ్బలక్ష్మి (1980)
- పూల పల్లకి (1982)
- మహాప్రస్థానం (1982)
రచయితగా
మార్చుఇతరాలు
మార్చు- పిచ్చిపుల్లయ్య (1953) (సహాయ దర్శకుడు)