రెడ్డి రాజవంశం

(కొండవీటి రెడ్డి రాజులు నుండి దారిమార్పు చెందింది)

రెడ్డివంశం ఆంధ్రప్రదేశ్ లో కొంత భూభాగాన్ని కొంతకాలం పరిపాలించిన రాజవంశం. ఈ వంశపు రాజుల రాజధానులు కొండవీడు, అద్దంకి, రాజమహేంద్రవరం, కందుకూరు.

రెడ్డి రాజ్యం

1325–1448
రాజధానిఅద్దంకి (తొలి)
కొండవీడు
రాజమహేంద్రవరం
కందుకూరు
సామాన్య భాషలుతెలుగు
మతం
హిందూ మతం
ప్రభుత్వంరాచరికం
చారిత్రిక కాలంIndia మధ్య యుగ భారతదేశం
• స్థాపన
1325
• పతనం
1448
Preceded by
Succeeded by
కాకతీయ సామ్రాజ్యం
విజయనగర సామ్రాజ్యం
గజపతులు
పటం
రెడ్డి రాజుల రాజధానులు

కొండవీటి రెడ్లు

మార్చు

రెడ్లు ప్రధానంగా కొండవీడు రాజధానిగా తీరాంధ్రాన్ని పరిపాలించారు. రెడ్డి రాజ్యస్థాపకుడు ప్రోలయ వేమారెడ్డి.

కొండవీటి రెడ్డి రాజులు [1]
రాజు పేరు పాలన ప్రారంభం పాలనముగింపు
ప్రోలయ వేమారెడ్డి 1325 1353
ప్రోలయ అనపోతారెడ్డి 1353 1364
ప్రోలయ అనవేమారెడ్డి 1364 1386
ప్రోలయ కుమార గిరిరెడ్డి 1386 1402
ప్రోలయ పెదకోమటి వేమారెడ్డి 1402 1420
ప్రోలయ రాచవేమారెడ్డి 1420 1424

రచనలు, బిరుదులు

మార్చు

సర్వజ్ఞచక్రవర్తి బిరుదుగల పెదకోమటి వేమారెడ్డి సాహిత్య చింతామణి, సంగీత చింతామణి, శృంగార దీపిక అను గ్రంథాలను రచించాడు. వసంత రాజీయం గ్రంథాన్ని రచించిన కుమారగిరిరెడ్డికి కర్పూర వసంతరాయలు అనే బిరుదు ఉంది.

రాజమహేంద్రవర రెడ్డి రాజులు

మార్చు

రెడ్లు ప్రధానంగా కొండవీడు రాజధానిగా తీరాంధ్రాన్ని పరిపాలించారు. రెడ్డి రాజ్యస్థాపకుడు ప్రోలయ వేమారెడ్డి.

రాజమహేంద్రరెడ్డి రాజులు[2]
రాజు పేరు పాలన ప్రారంభం పాలనముగింపు
కాటయ వేముడు 1395 1414
రెండో కుమారగిరి 1414 1416
మూడో కుమారగిరి, మూడో అనవోతారెడ్డి ? ?
వీరభద్రారెడ్డి 1423 1448

కందుకూరు రెడ్డి రాజులు

మార్చు

ప్రోలయ వేముడు బోయవిహారదేశానికి తన ప్రతినిధిగా మల్లారెడ్డిని నియమించాడు. మల్లారెడ్డి, అతని సంతతి(శ్రీగిరి, రెండో కోమటిరెడ్డి) కందుకూరు రాజధానిగా ఒక శతాబ్దికాలం పరిపాలించారు. [3]

చిత్రమాలిక

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

కొండవీడు

మూలాలు

మార్చు
  • బి.యస్.యల్, హనుమంతరావు (2012). "రెడ్డి-నాయక యుగము". ఆంధ్రుల చరిత్ర. విశాలాంధ్ర.