కొమిరెడ్డి రాములు
కొమిరెడ్డి రాములు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2004 నుండి 2009 వరకు మెట్‌పల్లి నియోజకవర్గం (ప్రస్తుత కోరుట్ల) ఎమ్మెల్యేగా పని చేశాడు.[2]
కొమిరెడ్డి రాములు | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2004 – 2009 | |||
నియోజకవర్గం | మెట్‌పల్లి | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | వెంకటరావుపేట్, మెట్‌పల్లి మండలం, జగిత్యాల జిల్లా | 1949 జూన్ 3 ||
మరణం | ఏప్రిల్ 4, 2023 హైదరాబాదు | (aged 73)||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | కొమిరెడ్డి జ్యోతి | ||
సంతానం | కొమిరెడ్డి కరంచంద్, విజయ్‌అజాద్, కపిల్[1] | ||
నివాసం | హైదరాబాద్ | ||
పూర్వ విద్యార్థి | ఉస్మానియా యూనివర్సిటీ |
రాజకీయ జీవితం
మార్చుకొమిరెడ్డి రాములు 1970 లో ఉస్మానియా యూనివర్సిటీ నుండి న్యాయవిద్యను పూర్తి చేశాడు. ఆయన 1968 లో వెంకటరావుపేట్ సర్పంచ్‌గా పని చేసి 1985లో మెట్‌పల్లి నియోజకవర్గం నుండి స్వతంత అభ్యర్థిగా ఓడిపోయి ఆ తరువాత ఢిల్లీకి వెళ్లి సుప్రీంకోర్టు న్యాయవాదిగా స్థిరపడ్డాడు. రాములు 1998 లో మెట్‌పల్లి నియోజకవర్గంకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన భార్య కొమిరెడ్డి జ్యోతిని కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేయించి గెలిపించుకున్నాడు.
కొమిరెడ్డి రాములుకు 2001 లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ నిరాకరించడంతో జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అనుబంధ సభ్యుడిగా కొనసాగాడు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గ్రామ పంచాయతీగా ఉన్న మెట్‌పల్లిని పురపాలక సంఘంగా అప్‌గ్రేడ్ చేయించాడు. ఆయన హయాంలోనే మెట్‌పల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయించి నగరబాటలో భాగంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డిని మెట్‌పల్లికి తీసుకువచ్చాడు.
ఎన్నికల్లో పోటీ
మార్చుసం. | నియోజకవర్గం | విజేత | పార్టీ | ప్రత్యర్థి | పార్టీ |
---|---|---|---|---|---|
1985 | మెట్‌పల్లి | చెన్నమనేని విద్యాసాగర్ రావు | బీజేపీ | కొమిరెడ్డి రాములు | స్వతంత్ర |
1994 | మెట్‌పల్లి | చెన్నమనేని విద్యాసాగర్ రావు | బీజేపీ | కొమిరెడ్డి రాములు | కాంగ్రెస్ |
1999 | మెట్‌పల్లి | తుమ్మల వెంకట రమణారెడ్డి | బీజేపీ | కొమిరెడ్డి రాములు | కాంగ్రెస్ |
2004 | మెట్‌పల్లి | కొమిరెడ్డి రాములు | జనతా పార్టీ | కల్వకుంట్ల విద్యాసాగర్ రావు | స్వతంత్ర |
2014 | కోరుట్ల | కల్వకుంట్ల విద్యాసాగర్ రావు | టీఆర్ఎస్ | కొమిరెడ్డి రాములు | కాంగ్రెస్ |
మరణం
మార్చుకొమిరెడ్డి రాములు మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ ఆరోగ్యం విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందతూ 2023 ఏప్రిల్ 4 న మరణించాడు.[3][4][5]
మూలాలు
మార్చు- ↑ Andhrajyothy (21 November 2024). "కొమిరెడ్డి దంపతుల సేవలు మరువలేం". Archived from the original on 21 November 2024. Retrieved 21 November 2024.
- ↑ Namasthe Telangana (6 April 2023). "మాజీ ఎమ్మెల్యే రామ్‌లు కన్నుమూత". Archived from the original on 6 April 2023. Retrieved 6 April 2023.
- ↑ Sakshi (5 April 2023). "మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు కన్నుమూత". Archived from the original on 8 April 2023. Retrieved 8 April 2023.
- ↑ Telangana Today (5 April 2023). "Former Metpalli MLA Komireddy Ramulu passes away". Archived from the original on 8 April 2023. Retrieved 8 April 2023.
- ↑ Disha Daily (7 April 2023). "అశ్రునయనాలతో కొమిరెడ్డి రాములు అంతిమ యాత్ర". Archived from the original on 8 April 2023. Retrieved 8 April 2023.