కోకా విమలకుమారి
కోకా విమలకుమారి రచయిత్రి, సాహితీవేత్త.
కోకా విమలకుమారి | |
---|---|
జననం | ఆదిని విమలకుమారి జూలై 15, 1943 |
జాతీయత | భారతీయుడు |
విద్య | ఎం.ఎ., ఎం.పి.ఎడ్. |
వృత్తి | లెక్చెరర్ |
క్రియాశీల సంవత్సరాలు | 1975 నుండి ప్రస్తుతం వరకూ |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | రచయిత్రి, తెలుగుతల్లి సాహితీరూప కర్త |
గుర్తించదగిన సేవలు | తరుణీతరంగాలు, విమలభారతి |
బిరుదు | సాహిత్య సరస్వతి, సాహిత్య నవరత్న |
జీవిత భాగస్వామి | కోకా నాగేంద్రరావు |
పిల్లలు | కోకా లక్ష్మీనారాయణ, జయశ్రీ |
తల్లిదండ్రులు |
|
పురస్కారాలు | ఉగాది పురస్కారాలు, ఉత్తమ రచయిత్రి పురస్కారాలు, ఉత్తమ అధ్యాపక పురస్కారం, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ అవార్డు |
జీవిత విశేషాలు
మార్చుఈమె కృష్ణా జిల్లా, అవనిగడ్డ మండలం, పులిగడ్డ గ్రామంలో ఆదిని సుబ్బారావు, శేషమ్మ దంపతులకు 1943, జూలై 15వ తేదీన జన్మించింది. తెలుగు సాహిత్యంలో ఎం.ఎ.చదివిన ఈమె ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ కూడా చేసింది. ఈమెకు సంగీత, సాహిత్య, క్రీడా రంగాలలో ప్రవేశం ఉంది. ఈమె ఉత్తమ ఉపాధ్యాయినిగా, ఉత్తమ అధ్యాపకురాలిగా గుర్తింపు పొందింది. సంజీవదేవ్, నాగభైరవ కోటేశ్వరరావు, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ వంటి సాహితీవేత్తల వద్ద శిష్యరికం చేసింది. అవధానాలు, సాహితీ రూపకాలు, కవి సమ్మేళనాలు మొదలైనవాటిలో ఈమె ప్రదర్శించే సంగీత, సాహిత్య, నటనా ప్రతిభలు ఆ కార్యక్రమాలకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈమె ఆకాశవాణి ద్వారా 1975 నుండి నేటి వరకూ తన సాహిత్య సౌరభాలను కవితలు, ప్రసంగాల రూపంలో వెదజల్లుతోంది. ఈమె రూపొందించిన తెలుగుతల్లి సాహిత్య రూపకం ద్వారా ఈమెకు ప్రభుత్వం నుండే కాక వివిధ సాహిత్య సంస్థల నుండి అనేక సత్కారాలు లభించాయి. బాల్ బ్యాడ్మింటన్, ఖోఖో, కబడ్డి వంటి టోర్నమెంటులను నిర్వహిస్తూ ఈమె క్రీడారంగంలో కూడా తన ఉనికిని చాటుకుంటున్నది.
కుటుంబం
మార్చుఈమెకు 1961, ఏప్రిల్ 24న గుంటూరు జిల్లా కొల్లూరు గ్రామంలో కోకా నాగేంద్రరావుతో వివాహం జరిగింది. ఈమె భర్త కబడ్డీ క్రీడాకారుడిగా అంతర్జాతీయ ఖ్యాతిని గడించాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె జన్మించారు. పెద్ద కుమారుడు లక్ష్మీనారాయణ పోలీసు శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. రెండవ కుమారుడు పంచాయతీరాజ్‌లో ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. కుమార్తె జయశ్రీ ఆదర్శగృహిణిగా కుటుంబాన్ని నిర్వహిస్తున్నది[1].
రచనలు
మార్చు- తరుణీ తరంగాలు (రేడియో ప్రసారిత వ్యాసాలు)
- పున్నమి నవ్వింది (కథల సంపుటి)
- విమలభారతి (వ్యాసాలు)
- అక్షరసందేశం(వ్యాసాలు)
- నవ్యపథం (వ్యాసాలు)
- శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు (పద్యకావ్యం)
- మన పుణ్యక్షేత్రాలు
- అయ్యప్ప గీతాలు
- షిరిడీ సాయిబాబా పాటలు
- క్రీడారంగ చరిత్ర
- జిమ్నాస్టిక్స్‌లో మెళకువలు
పురస్కారాలు
మార్చు- 1988 - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే ఉగాది పురస్కారం
- 1994 - తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ రచయిత్రి పురస్కారం
- 1997 - వంశీ ఆర్ట్స్ థియేటర్స్ వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం
- 2000 - ఢిల్లీ తెలుగు అకాడెమీ వారిచే ఉగాది పురస్కారం
- 2000 - లయన్స్ క్లబ్ వారిచే ఉత్తమ అధ్యాపక పురస్కారం
- 2002 - ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ అవార్డు
- 2003 - నార్ల వెంకటేశ్వరరావు ట్రస్ట్ వారిచే విశిష్ట సేవా పతకం
- 2012 - కృష్ణాజిల్లా కలెక్టర్ చేత ఉగాది పురస్కారం
- 2014 - నాగభైరవ స్ఫూర్తి పురస్కారం
బిరుదులు
మార్చు- సాహిత్య సరస్వతి
- సాహిత్య నవరత్న
- బాల సేవారత్న
మూలాలు
మార్చు- ↑ రచయిత. "ఆదివెలమ సావనీర్" (PDF). ఆదివెలమ.ఆర్గ్. Retrieved 26 January 2020.[permanent dead link]