కోటీశ్వరుడు (1970 సినిమా)


కోటీశ్వరుడు 1970, ఏప్రిల్ 24న విడుదలైన తెలుగు అనువాద చలనచిత్రం. బాలకృష్ణ మూవీస్ పతాకంపై ఆర్. వెంకటేశ్వర్లు, బి. సుశీల దేవి నిర్మాణ సారథ్యంలో ఎ.సి.త్రిలోక్ చందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివాజీ గణేశన్, జయలలిత, సౌందరరాజన్, నగేష్, పండరీబాయి తదితరులు నటించగా, ఎమ్మెస్ విశ్వనాథన్, జె.వి.రాఘవులు సంగీతం అందించారు.[1] తమిళ మాతృక దైవమగన్‌ శాంతి ఫిలిమ్స్‌ బ్యానర్‌ మీద 1969, సెప్టెంబరు 5న విడుదలైంది. ఎ.వి.యం. స్టూడియోస్ లో నిర్మితమైన ఈ డబ్బింగ్‌ చిత్రం తెలుగులో కూడా విజయవంతమైంది.

కోటీశ్వరుడు
(1970 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.సి.త్రిలోక్ చందర్
నిర్మాణం ఆర్. వెంకటేశ్వర్లు, బి. సుశీల దేవి
తారాగణం శివాజీ గణేశన్,
జయలలిత,
సుందరరాజన్,
నగేష్,
పండరీబాయి
సంగీతం ఎమ్మెస్ విశ్వనాథన్
జె.వి.రాఘవులు
నిర్మాణ సంస్థ బాలకృష్ణ మూవీస్
భాష తెలుగు

పుట్టుకతోనే వికృత రూపంలో ఉన్న శంకర్‌ (శివాజీ గణేశన్‌) అనే ధనికుడు, పార్వతి (పండరిబాయి) ని పెళ్ళిచేసుకుంటాడు. వారికి కణ్ణన్‌ (శివాజీ గణేశన్‌), విజయ్‌ (శివాజీ గణేశన్‌) అనే ఇద్దరు కవలలు జన్మిస్తారు. అయితే తండ్రిలాగా ముఖం మీద పెద్ద మచ్చతో పెద్ద కుమారుడు కణ్ణన్‌ పుడతాడు. అది చూసిన శంకర్‌ తన స్నేహితుడు, వైద్యుడు అయిన రాజు (సుందరరాజన్‌)కు కణ్ణన్ ను అప్పగించి, చంపేమంటాడు. సుందరరాజన్, ఆ బాలుణ్ణి ఒక బాబా (చిత్తూరు నాగయ్య) నిర్వహిస్తున్న అనాధాశ్రమంలో వుంచి పెంచుతాడు. అలా కణ్ణన్‌ పెరిగి పెద్దవాడై చదువులో ముందంజలో వుండడమే కాకుండా సితార్‌ వాద్యం వాయించడంలో కూడా ప్రావీణ్యం సంపాదిస్తాడు. రెండవవాడు విజయ్‌ కాలేజీలో తన సహవిద్యార్ధిని నిర్మల/నిమ్మి (జయలలిత)ను ప్రేమిస్తాడు. బాబా ద్వారా తన జన్మ వృత్తాంతం తెలుసుకున్న కణ్ణన్, తన తల్లిని, అన్నని కలుసుకోవాలనుకుంటాడు. ఆ విషయం తెలిసిన శంకర్ అతణ్ణి వారిస్తాడు. శంకర్‌ మీద పగబట్టిన కరణ్‌ (నంబియార్‌) విజయ్‌ను అపహరించి బంధిస్తాడు. దాంతో వికలాంగుడైన కణ్ణన్‌ వెళ్ళి కరణ్‌ తో పొరాడి అన్నను రక్షించి, తల్లి ఒడిలో మరణిస్తాడు.[2]

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం: ఎ.సి.త్రిలోక్ చందర్
  • నిర్మాణం: ఆర్. వెంకటేశ్వర్లు, బి. సుశీల దేవి
  • సంగీతం: ఎమ్మెస్ విశ్వనాథన్, జె.వి.రాఘవులు
  • పాటలు: ఆత్రేయ, రాజశ్రీ, ఆరుద్ర
  • నిర్మాణ సంస్థ: బాలకృష్ణ మూవీస్

పాటలు

మార్చు

ఈ చిత్రానికి ఎమ్మెస్ విశ్వనాథన్ సంగీతం అందించాడు. జె.వి.రాఘవులు తెలుగులో పాటలను రికార్డింగ్‌ చేసాడు. తెలుగు డబ్బింగ్‌ పాటలను ఘంటసాల, టి.యం. సౌందరరాజన్, ఎల్‌.ఆర్‌. ఈశ్వరి పాడారు.

  1. కళ్ళు కళ్ళు కలిశాయమ్మా - ఘంటసాల - రచన: ఆత్రేయ
  2. చక్కనైన రామచిలకుంది కలలు కంది - ఘంటసాల, ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: రాజశ్రీ
  3. యాదవకుల పావనా కృష్ణా కృష్ణా ఆశ్రిత దీనజనా - ఘంటసాల - రచన: ఆత్రేయ
  4. దైవమా దైవమా ఎంత భాగ్యం దైవమా... కంటినే కంటినే కరువుతీరా కంటినే - టి.యం.సౌందరరాజన్ -
  5. కమ్మని హ్యాపీ డే ఓ కన్నుల పండగే - టి.యం.సౌందరరాజన్
  6. నేలపై చుక్కలు చూడు పట్టపగలొచ్చెను నేడు ఎంతో వింతా ఏదో వింతా - టి.యం.సౌందరరాజన్
  7. షోకైనా దొరలకు కొంటె సవాలోయే , ఎల్ ఆర్ ఈశ్వరి.

మూలాలు

మార్చు
  1. Indiancine.ma, Movies. "Koteswarudu (1970)". www.indiancine.ma. Retrieved 15 August 2020.
  2. సితార, ఆణిమత్యాలు. "శివాజీ మూడు పాత్రల ముచ్చట". www.sitara.net. ఆచారం షణ్ముఖాచారి. Archived from the original on 15 August 2020. Retrieved 15 August 2020.

ఇతర లంకెలు

మార్చు