గడుసు పిల్లోడు 1977, నవంబర్ 12న విడుదలైన తెలుగు సినిమా.

గడుసు పిల్లోడు
(1977 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.బాపయ్య
తారాగణం శోభన్ బాబు,
మంజుల (నటి)
నిర్మాణ సంస్థ శ్రీరామకృష్ణ ఆర్ట్స్
భాష తెలుగు

సాంకేతిక వర్గం

మార్చు

నటీనటులు

మార్చు

పాటలు

మార్చు

ఈ చిత్రంలోని పాటలను ఆత్రేయ రచించగా, కె.వి.మహదేవన్ సంగీతం సమకూర్చాడు.[1]

క్ర.సం పాట గాయనీగాయకులు
1 "ఫూల్ ఫూల్ ఏప్రిల్ ఫూల్ చెకుముకిరాయి చెలాకిరాయి" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల బృందం
2 "అవునన్నావ్ అవునన్నావ్ అడిగిందానికి అవునన్నావ్" పి.సుశీల,ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
3 "చీకటి పడుతూంది జంటలు ఇంటికి చేరే వేళయింది" పి.సుశీల,ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
4 "అనకు ఆమాట మాత్రం అనకు ఇది ఆఖరిమాట అని అనకు" పి.సుశీల
5 "ముమ్మూర్తులలో ఎవ్వరు ప్రేమను ఆపేది ముల్లోకాలలో ఎవ్వరు ప్రేమించక జీవించేది" పి.సుశీల,ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
6 "గోడమీద బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చిపోయేవారికి వడ్డించు బొమ్మ ఎవరమ్మా" పి.సుశీల బృందం

ఏ సమస్యనైనా సమయస్ఫూర్తితో, సందర్భోచితంగా పరిష్కరిస్తాడు రవి. అందుకే అతడిని అందరూ గడుసు పిల్లోడంటారు. రవి తల్లి పార్వతి తనకు ఒక అన్నయ్య ఉన్నాడని, తమకు అతనికీ మధ్య చాలా అగాధం ఉందనీ, తామెవరో అతనికి తెలియకుండా మేనమామ ఇంటికెళ్ళి అక్కడి పరిస్థితులు తెలుసుకురమ్మని సంఘసేవ నిమిత్తం మంగళాపురం వెళుతున్న రవికి చెబుతుంది. ఒక అద్భుతమైన పథకం వేసి రవి తన మేనమామ ఇంట్లోకి ప్రవేశిస్తాడు రవి. తన స్నేహితురాలు లతే తన మేనమామ కూతురు అని తెలుసుకుని ఆమెతో ఉన్న పరిచయాన్ని కాస్తా ప్రణయంగా మార్చుకుంటాడు. మంగళాపురం నుండి తిరిగి వచ్చిన రవి తన మేనమామ రాఘవయ్య గురించి, అతని కూతురు లతను గురించి తల్లి విపులంగా వివరిస్తాడు. ఆ వార్త విన్న ఆమె మనసు ఉత్సాహంతో ఉరకలు వేస్తుంది. రవి - లతల ప్రేమ ఉదంతాన్ని కోర్టు కైలాసం ద్వారా తెలుసుకున్న బ్యాంక్ ఏజెంటు సుదర్శనరావు ఉగ్రుడవుతాడు. తనకు తెలియకుండా తన విరోధి, బావమరిది ఐన రాఘవయ్య కూతురు లతతో ప్రేమకలాపాలు సాగించిన కొడుకు రవిపై మండిపడతాడు. గతంలో రాఘవయ్య మూలాన తనకు జరిగిన అవమానాన్ని తెలియజేసి లతను మరచిపొమ్మని రవిని శాసిస్తాడు సుదర్శనరావు. రవి తన మేనత్త కొడుకే అని మూర్తి ద్వారా తెలుసుకున్న లత మేనత్త పార్వతి ఇంటికి వెళుతుంది. భర్త మాట జవదాటని పార్వతి కోడలును హత్తుకుని కన్నీరు కార్చిందే తప్ప ఆమె కన్నీరు తుడవలేకపోయింది. ఇన్నాళ్ళూ దొంగనాటకమాడిన రవి తన మేనల్లుడే అని తెలుసుకున్న రాఘవయ్య మనసు పాతపగలతో రగిలిపోతుంది. తన కూతురును మరొకరికిచ్చి పెళ్ళి చేయాలని నిశ్చయించుకుంటాడు. తన ఫిక్స్‌డ్ డిపాజిట్ డ్రా చేయడానికి బ్యాంకుకు వచ్చిన రాఘవయ్యకు తన సొమ్మును అప్పటికే ఎవరో దొంగసంతకాలతో డ్రా చేసినట్లు తెలుస్తుంది. రాఘవయ్య ఏజెంటు సుదర్శనరావునే నిలదీసి అడిగి నిందిస్తాడు. ఆ మర్నాడే "పదిలక్షల సొమ్ముతో బ్యాంకు ఏజెంట్ సుదర్శనరావు పరారీ" అని పేపర్లో వార్త వస్తుంది. అయితే బ్యాంకులో దోచుకోబడిన సొమ్ము ఏమైంది? లతను ఇంకొకరికిచ్చి పెళ్ళి చేయాలన్న రాఘవయ్య నిర్ణయం ఏమైంది? ఇంటికి రాని సుదర్శనరావు ఎక్కడికి వెళ్ళాడు? ఇంట్లో నుంచి బయలుదేరిన రవి ఏమి సాధించాడు? ఎలాసాధించాడు? అనే ప్రశ్నలకు సమాధానం చివర్లో లభిస్తుంది[1].

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 ఈశ్వర్. గడుసు పిల్లోడు పాటల పుస్తకం. p. 12. Archived from the original on 20 ఆగస్టు 2020. Retrieved 18 August 2020.

బయటి లింకులు

మార్చు