గుండిమెడ వేంకట సుబ్బారావు

గుండిమెడ వేంకట సుబ్బారావు (జూలై 25, 1901 - మార్చి 30, 1970) ప్రముఖ రంగస్థల నటుడు, నాటకకర్త, చిత్రకారుడు, కవి. హిందూ థియేట్రికల్ క్లబ్ కార్యదర్శిగా పనిచేశాడు.[1]

గుండిమెడ వేంకట సుబ్బారావు
జననంజూలై 25, 1901
మరణంమార్చి 30, 1970
జాతీయతభారతీయుడు
వృత్తిరంగస్థల నటుడు, నాటకకర్త, చిత్రకారుడు , కవి
గుండిమెడ వేంకట సుబ్బారావు గీసిన వర్ణచిత్రం "గుఱి"

ఈయన 1901, జూలై 25న విజయనగరం జిల్లా, గంజాం లోని ఛత్రపురంలో జన్మించాడు.

నాటకరంగ ప్రస్థానం

మార్చు

ఛత్రపతి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సమయంలో నాటకాలు రాసి, ప్రదర్శించేవాడు. ఈయన నాటకాలు ఎక్కువగా దేశభక్తికి సంబంధించినవి ఉంటాయి. ఈయన నాటకాలలో ఖిల్లీ రాజ్యపతనం చాలా ప్రసిద్ధి పొందింది. దీని గురించి 1934లో కృష్ణాపత్రికలో విమర్శనా వ్యాసాలు వచ్చాయి. 1961, ఆగస్టు 20న ఛత్రపురంలో వేంకట సుబ్బారావు షష్టిపూర్తి మహోత్సవ సందర్భంగా ఆయన చిత్రించిన చిత్రపటాల ప్రదర్శన జరిగింది.

రచించిన నాటకాలు

మార్చు
  1. రాణాప్రతాప్ (1927)
  2. మేవాడు పతనం (1930)
  3. ఖిల్జీ రాజ్యపతనం (1933)
  4. పృథ్వీపుత్రి (1946)
  5. దుర్గాదాస్ (1949)

ఇతర రచనలు

మార్చు

సువర్ణ దుర్గము: ఇది అనువాద నవల. నాటకకర్తగా ప్రాముఖ్యత పొందిన గుండిమెడ రచించిన తొలి నవల ఇది. ఆంగ్లవాజ్మయంలో పేరొందిన ఈస్ల్టిన్ నవలకు ఇది తెలుగు రూపం. కేవలం కథా, కథనాన్ని స్వీకరించి పాత్రలు, వాతావరణం మార్చాడు.

ఈయన 1970, మార్చి 30 న మరణించాడు.

మూలాలు

మార్చు
  1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.655.