గుమ్మా సాంబశివరావు
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
డా. గుమ్మా సాంబశివరావు సాహిత్యలోకంలో సుపరిచితులయిన సమీక్షకుడు, కవి, రచయిత, ఉపన్యాసకుడు. 2013 సంవత్సరానికి గాను ఉత్తమ అధ్యాపకునిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను సన్మానించింది.[1]
డా.గుమ్మా సాంబశివరావు
| |
---|---|
జననం | డా.గుమ్మా సాంబశివరావు 1-6-1958 గుంటూరు జిల్లా, చేబ్రోలు మం. వేజెండ్ల. |
నివాస ప్రాంతం | విజయవాడ |
ఇతర పేర్లు | ప్రశంగ సింహ డా.గుమ్మా సాంబశివరావు |
వృత్తి | ఆంధ్ర లొయోల కళాశాల, విజయవాడలో తెలుగు అధ్యాపకుడు |
ప్రసిద్ధి | ఆశుకవి, ఉపన్యాస కేశరి, ఉత్తమ అధ్యాపక |
తండ్రి | అయితమరాజు |
తల్లి | పార్వతమ్మ |
వెబ్సైటు | |
http://www.andhraloyolacollege.ac.in |
![](http://up.wiki.x.io/wikipedia/commons/thumb/4/46/%E0%B0%97%E0%B1%81%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE_%E0%B0%B8%E0%B0%BE%E0%B0%82%E0%B0%AC%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B5%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81_QRpedia.png/220px-%E0%B0%97%E0%B1%81%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE_%E0%B0%B8%E0%B0%BE%E0%B0%82%E0%B0%AC%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B5%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81_QRpedia.png)
జీవిత విశేషాలు
మార్చుఆయన 1-6-1958 తేదీన వేజెండ్ల, చేబ్రోలు మండలం, గుంటూరు జిల్లాలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు - పార్వతమ్మ, ఐతమరాజు. ప్రాథమిక విద్య వేజెండ్లలో పూర్తిచేసి, ప్రాథమికోన్నత విద్య నారాకోడూరు, గుంటూరు జిల్లాలో జరిగింది. సంగంజాగర్లమూడి, గుంటూరు జిల్లాలో ఉన్నత పాఠశాల విద్యను అభ్యసించాడు. కాలేజీ చదువులనుహిందూ కళాశాల, గుంటూరు (1973-1978) మధ్యకాలంలో పూర్తిచేశాడు. స్నాతకోత్తర విద్య ఎం.ఎ. తెలుగు – నాగార్జున విశ్వవిద్యాలయం (1978-1980) అనంతరం పి.హెచ్.డి. కూడా నాగార్జున విశ్వవిద్యాలయం (1985) లోనే అన్నమాచార్య సంకీర్తనముల లోని వర్ణనలు అనే అంశంపై పరిశోధించాడు.
ఆంధ్రోపన్యాసకత్వం : 1981 సెప్టెంబరు నుండి 1988 జూలై వరకు సప్తగిరి కళాశాల విజయవాడ. 1988 ఆగస్టు నుండి, ఆంధ్ర లయోల కళాశాల, విజయవాడ ఉద్యోగం చేశాడు. తన పరిశోధక పర్యవేక్షణలో పది మంది విద్యార్థులు తమ ఎం. ఫిల్. సిద్దాంత వ్యాసాలు విశ్వవిద్యాలయానికి సమర్పించారు.
అవార్డులు
మార్చు- యు.జి.సి.కెరీర్ అవార్డు - తెలుగు జానపద ప్రదర్శన కళారంగం అనే ప్రాజెక్ట్ కు (1992-1995).
- సెల్ ఫోన్ శతకానికి ఉత్తమ శతక రచన బహుమతి - నల్లజర్ల జగన్నాధ సాహితీ సమాఖ్య 2006.
- నత్తవిలాపం పద్య ఖండికకు సాహితీ మిత్రులు మచిలీపట్నం వారి జాతీయ స్థాయి ప్రథమ బహుమతి – 2007.
- ఆంధ్రప్రభ దినపత్రిక నిర్వహణలో జరిగిన పుస్తక సమీక్షల పోటీలో ప్రథమ బహిమతి – 2007.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు సెప్టెంబరు 5 – 2008.
- మా నాన్నకవితకు హైదరాబాద్ కిన్నెర ఆర్ట్ థియేటర్స్ వారిచే ప్రథమ బహుమతి.
- ఉగాది పురస్కారం - 2016
రచనలు-ముద్రితాలు
మార్చు- అన్నమాచార్య సంకీర్తనములలోని వర్ణనలు – 1990
- ప్రాచీనాంధ్ర కవయిత్రుల స్త్రీ స్వభావ చిత్రణం – 1991
- అన్నమయ్య (నవల) – 2000
- సెల్ ఫోను శతకము – 2005
- సాహిత్యం – సామాజిక చైతన్యం (వ్యాససంపుటి) – 2008
- శ్రీ వెంకటాద్రీశ్వర శతకం - 2009
- తెలుగు బాల శతకం - 2010
- మహాకవి శ్రీ శ్రీ శతకం – 2010
- తెలుగు సాహిత్య చరిత్రకారులు – 2011
- కన్యాశుల్కంలో హాస్యం – 2011
- ఆంధ్ర వాఙ్మయ చరిత్ర రచయితలు - 2012
- గుఱ్ఱం జాషువ శతకం - 2013
- సి . నా . రే . శతకం - 2013
ముద్రణకు సిద్ధం
మార్చు- అన్నమయ్య భక్తిపద కవిత
- జాషువా సాహిత్య సమీక్ష
- సాహితీ సౌరభం
- సూక్తి మాలిక.
ప్రసంగాలు
మార్చువీరు 60 కి పైగా ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, 9 దూరదర్శన్ కార్యక్రమాలు చేశారు. వీరు జాతీయ/రాష్ట్రస్థాయి సదస్సులలో 50 కి పైగా ప్రసంగా పత్రాల సమర్పించగా 5 అంతర్జాతీయ సదస్సులలో పాల్గొన్నారు.
వ్యాసాలు
మార్చువీరు 135 కి పైగా వ్యాసాలు వివిధ పత్రికల్లో ముద్రించబడ్డాయి,, 150 కి పైగా పుస్తక సమీక్షలు చేశారు.
ఇతరములు
మార్చుజాషువా పై అనేక సాహిత్య ప్రసంగాలు
ఆచార్య నాగార్జున,ఆంధ్ర,పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం దూర విద్య కేంద్రాలకు డిగ్రీ,ఎం.ఏ, తరగతులకు పాఠ్యాంశాలు రచించడం.
భువన విజయం,ఇంద్రసభ,సరస్వతి సామ్రాజ్య వైభవం,త్రైలోక్య విజయం మొదలైన సాహిత్య రూపకాలలో వివిధ కవుల పాత్ర ధారణ.
బయటి లంకెలు
మార్చు- సరసభారతి బ్లాగులో గుమ్మా సాంబశివరావు గారి సన్మానం గురించి వ్యాసం
- ఈనాడు, విజయవాడ ఎడిషన్,2014 డిసెంబరు 4, "సామాజిక పరిస్థితులకు ప్రతిబింబమే సాహిత్యం. "
మూలాలు
మార్చు- ↑ "గుమ్మపాల మధురం గుమ్మా సాహిత్యం". సరసభారతి ఉయ్యూరు. Archived from the original on 22 ఏప్రిల్ 2016. Retrieved 14 June 2016.
- ↑ "ఉగాది పురస్కారాల ప్రకటన". సూర్య దినపత్రిక. Retrieved 14 June 2016.[permanent dead link]