గొప్పింటి అల్లుడు

గొప్పింటి అల్లుడు 2000లో విడుదలైన తెలుగు చిత్రం. నందమూరి రామకృష్ణ, రామకృష్ణ హార్టికల్చర్ సినీ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించాడు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ, సిమ్రాన్, సంఘవి, సాధిక ప్రధాన పాత్రధారులు. సంగీతం కోటి అందించాడు. ఇది హిందీ చిత్రం హీరో నెంబర్ 1 (1997) కు రీమేక్. ఈ చిత్రం 2000 జూలై 21న విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది.

గొప్పింటి అల్లుడు
(2000 తెలుగు సినిమా)
దర్శకత్వం ఇ.వి.వి.సత్యనారాయణ
తారాగణం బాలకృష్ణ,
సిమ్రాన్
సంగీతం కోటి
నిర్మాణ సంస్థ రామకృష్ణ హార్టికల్చరల్ సినిస్టూడియోస్
భాష తెలుగు

మురళి మనోహర్ (నందమూరి బాలకృష్ణ) పారిశ్రామికవేత్త ఎస్వీఆర్ (ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం) కుమారుడు. అతను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత స్టేట్స్ నుండి ఇండియా చేరుకుంటాడు. ఎస్వీఆర్ తన కోసం జిడ్డు బాలమణి (సాధిక) అనే అమ్మాయిని ఫిక్స్ చేసి ఆమెను పెళ్ళి చేసుకోమని అడుగుతాడు. ఆ పెళ్ళి నుండి బయటపడటానికి, మనోహర్ తిరిగి స్విట్జర్లాండ్కు పారిపోతాడు.

సౌమ్య (సిమ్రాన్) అచ్యుత రామయ్య (సత్యనారాయణ) మనవరాలు. అచ్యుత రామయ్య కుటుంబంలో అతని ముగ్గురు కుమార్తెలు, వారి భర్తలు, వారి పిల్లలు సౌమ్య, జలంధర (సంఘవి) ఉన్నారు. జలంధర అచ్యుత రామయ్య కుమారుడి చట్టబద్ధమైన కుమార్తె, సౌమ్య అచ్యుత రామయ్య కుమారుడి చట్టవిరుద్ధ కుమార్తె. అందువల్ల అచ్యుత రామయ్య మినహా కుటుంబంలోని ప్రతి ఒక్కరూ సౌమ్యను చట్టవిరుద్ధమైన కుమార్తె అని వేధిస్తూంటారు. జలంధరకు సౌమ్య పట్ల చాలా ద్వేషం ఉంది. ఆమె సౌమ్యతో పైకి మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తుంది, కాని ప్రతిసారీ సౌమ్యను వెన్నుపోటు పొడుస్తూనే ఉంటుంది.

సౌమ్యకు స్విట్జర్లాండ్‌లో బ్యాంక్ మేనేజర్‌గా ఉద్యోగం వస్తుంది. విమానాశ్రయంలో మనోహర్ సౌమ్య మధ్య పరిచయమౌతుంది. మిస్టర్ సుబ్బారావు (చలపతి రావు) సౌమ్యను తీసుకెళ్ళడానికి విమానాశ్రయానికి రానందున, ఆమె మనోహర్ సహాయం తీసుకోవలసి వస్తుంది.

ఇక తరువాతి కథంతా వాళ్ల మధ్య ప్రేమ, పెళ్ళి ప్రయత్నాల చుట్టూ తిరుగుతుంది.

నటవర్గం

మార్చు

పాటలు జాబితా

మార్చు
  • నీ హైట్ ఇండియా గేట్.. రచన: భువన చంద్ర, గానం.సుక్విందర్ సింగ్, పూర్ణిమ
  • ప్రేమిస్తే ఎంతో గ్రేట్.. రచన: భువనచంద్ర, దేవన్, కె ఎస్ చిత్ర
  • మూడోచ్చే గోపాల.. రచన: సురేంద్ర కృష్ణ, గానం.కె.ఎస్.చిత్ర
  • నాచేరే నాచేరె.. రచన; సామవేదం షణ్ముఖశర్మ, గానం.సుక్విందర సింగ్, మానసి స్కాట్
  • వచ్చేస్తుందో చేస్తుందో.. రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర
  • అమ్మగారికి పెసరట్టు.. రచన:భువన చంద్ర, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.

సాంకేతికవర్గం

మార్చు