గోపాల్ స్వరూప్ పాఠక్

గోపాల్ స్వరూప్ పాఠక్ (1896 ఫిబ్రవరి 24 -1982 అక్టోబరు 4) భారతదేశానికి నాలుగవ ఉపరాష్ట్రపతిగా 1969 ఆగస్టు నుండి 1974 ఆగస్టు మధ్యలో పనిచేశాడు. అతను ఉప రాష్ట్రపదవిని చేపట్టి రాష్ట్రపతి పదవిని పొందని మొదటి భారతీయుడు. అంతకు ముందు ముగ్గురు ఉపరాష్ట్రపతులు రాష్ట్రపతి పదవిని చేపట్టారు.

గోపాల్ స్వరూప్ పాఠక్
గోపాల్ స్వరూప్ పాఠక్


భారత ఉపరాష్ట్రపతి
పదవీ కాలం
1969 ఆగస్టు 31 – 1974 ఆగస్టు 30
రాష్ట్రపతి వి.వి.గిరి
ముందు వి.వి.గిరి
తరువాత బి.డి.జట్టి

కర్ణాటక గవర్నర్
పదవీ కాలం
1967 మే 13 – 1969 ఆగస్టు 31
ముందు వి.వి.గిరి
తరువాత ధర్మవీర

వ్యక్తిగత వివరాలు

జననం (1896-02-26)1896 ఫిబ్రవరి 26
బరేలీ, బ్రిటిష్ ఇండియా
(ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్)
మరణం 4 అక్టోబరు 1982(1982-10-04) (aged 86)
పూర్వ విద్యార్థి అలహాబాద్ విశ్వవిద్యాలయం

జీవిత విశేషాలు

మార్చు

అతను 1896 ఫిబ్రవరి 26 న ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జన్మించాడు. అలహాబాద్ విశ్వవిద్యాలయంలో న్యాయవిద్యను అభ్యసించాడు.

1945-46లో అలహాబాద్ హైకోర్టుకు న్యాయమూర్తిగా పనిచేసాడు. 1960 నుండి 1966 వరలి రాజ్యసభ సభ్యునిగా పనిచేసాడు. 1966-67 కాలంలో కేంద్ర న్యాయ మంత్రిగా ఉన్నాడు. మైసూర్ రాష్ట్ర గవర్నరుగా 1967 నుండి 1969 వరకు పనిచేసాడు. మైసూర్ విశ్వవిద్యాలయం, బెంగళూరు విశ్వవిద్యాలయం, కర్ణాటక విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్ గా పనిచేసాడు. "అలహాబాదు విశ్వవిద్యాలయం పూర్వవిద్యార్థుల అసోసియేషన్" 42 మంది పూర్వ సభ్యుల జాబితాలో అతనికి "ప్రౌడ్ పాస్ట్ అల్యూమ్ని"తో సత్కరించారు.[1][2][3][4]

అతను 1982 అక్టోబరు 4 న మరణించాడు. అతని కుమారుడు ఆర్.ఎస్. పాథక్ భారత ప్రధాన న్యాయమూర్తి. పాథక్ హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో భారతదేశానికి చెందిన ముగ్గురు న్యాయమూర్తులలో ఒకడు. (మరొకరు 1985 నుండి అధ్యక్షుడిగా పనిచేసిన నాగేంద్ర సింగ్ 1988).

మూలాలు

మార్చు

బాహ్య లంకెలు

మార్చు
రాజకీయ కార్యాలయాలు
అంతకు ముందువారు
వి. వి. గిరి
కర్ణాటక గవర్నర్లు
1967–1969
తరువాత వారు
ధర్మ వీర
భారత ఉపరాష్ట్రపతి
1969–1974
తరువాత వారు
బి.డి. జెట్టి