రష్యా నుండి అమెరికాకు వలస వచ్చిన దంపతులకు న్యూయార్కులో 1922 లో జన్మించారు గ్రేస్ పాలీ. న్యూయార్కు ప్రజల జీవన విధానాన్ని ఈమె కథలు ప్రతి బింబిస్తాయి. రాసికన్నా వాసి ఎక్కువ వున్న ఈమె కథలు ఈమెకు మంచి పేరుతో బాటు అనేక అవార్డులు, రివార్డులు తెచ్చి పెట్టాయి. ఈమె మొదటి రచనతోనే విలక్షణ కథా రచయిత్రిగా గుర్తింపు తెచ్చుకుంది.

గ్రేస్ పాలీ
BornGrace Goodside
(1922-12-11)1922 డిసెంబరు 11
The Bronx, New York City
Diedఆగస్టు 22, 2007(2007-08-22) (aged 84)
Thetford, Vermont
Occupationరచయిత్రి,కవి, ఉపాధ్యాయిని, రాజకీయ విస్లేషకిwriter, poet, political activist, teacher
Nationalityఅమెరికా
Notable works"Goodbye and Good Luck"
"The Used-Boy Raisers"
Spouseజెస్ పాలీ
రాబర్ట్ నికొలాస్
Childrenనోరా పాలీ
డానీ పాలీ

బాల్యము/విద్య

మార్చు

రష్యా నుంచి అమెరికాకు వలస వచ్చిన యూదు దంపతులకు గ్రేస్ పాలీ 1922 డిసెంబరు 11లో న్యూయార్కులో జన్మించారు. ఆనాటి రచనల మీదా.... రాజకీయ కార్య కలాపాలమీద ఈమె బాల్యం చాల ప్రభావము చూపింది. పెళ్ళికి ముందు ఈమె పేరు గ్రేస్ గుడ్ సైడ్. ఈమె హంటర్ కాలేజీలోను, న్యూయార్కు యూనివర్సిటీలోను విద్యాభ్యాసము చేశారు.

రచనా వ్యాసంగము

మార్చు

ఈమె 1942లో జే పాలీని పెళ్ళాడారు. వీరికి ఇద్దరు పిల్లలు. 1950 లో తొలి కవిత్వంతర్వాత కథలు వ్రాయడం ప్రారంబించారు. మొదటి కథా లంకలనము ది లిటిల్ డిస్టర్బెన్స్ ఆఫ్ మాన్ ఇది 1959 లో విడుదలైనది. దీనితోనే అమెకు విలక్షణ కథా రచయిత్రిగా మంచి గుర్తింపు వచ్చింది. విమర్శకులు అమెరికన్ కథా చరిత్రలో ఈ పుస్తక పరచురణకు ఒక చారిత్రిక ప్రాధాన్యత వుందని కొనియాడారు. 1974 లో ఈమె రచించిన రెండవ కథా సంకలనం ఎనార్మన్ చేంజెస్ అట్ ది లాస్ట్ మినిట్ వెలువడింది. 1985 లో మరొక సంపుటి లెటర్ ది సేం డే వెలువడింది. ఇది ఈమెకు మరింత పేరు తెచ్చి పెట్టింది. ఈమె కథలలో న్యూయర్కు ప్రజల జీవన విధానము ప్రతి బింబింస్తుంది.

ఉద్యమాలు

మార్చు

1960,, 1970 వ సంవత్సరాలలో వియత్నాం పై అమెరికా చేసిన యుద్ధానికి వ్యతిరేకంగా వుద్యమించింది. ఆకారణంగా ఈమె కొంత కాలం జైలులో గడపాల్సి వచ్చింది. ఆ తర్వాతి కాలంలో అణ్వస్త్ర వ్యతిరేక ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించింది. అమెరికా ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని విమర్శిస్తూ ఇతర దేశాలలో కూడా పర్యటించింది.

పురస్కారాలు

మార్చు

లాక్షిణికులు, విమర్శకులు ఈమె రచించిన మంచి కథలను ఉదాహరణలుగా విద్యార్థులకు బోధించారు. ఈమె స్వయంగా కొలంబియా సైరాక్యూస్ యూనివర్శిటీల్లో, ఇతర కాలేజీలలో క్రియేటొఇవ్ రైటింగ్ గురించి బోధించింది. 1988 వ సంవత్సరంలో న్యూయార్క్ స్టేట్ శాసనసభ ఈమెను స్టేట్ ఆథర్ గా ప్రకటించింది. ఈమె వ్రాసిన ఫిక్షన్ కొరకు గగెన్ హైం ఫేలో షిప్, కథా రచనకు గాను నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ సంస్థ అవార్డును ఇచ్చి గౌరవించింది. 1993 లో ఈమెకు రీ అవార్డు (కథా రచనకు గాను ఇచ్చే అత్యున్నత సత్కారం) కూడా వచ్చింది.

మరణము

మార్చు

గ్రేస్ పాలీ తన 84 ఏండ్ల వయసులో 2007వ సంవత్సరంలో రొమ్ము క్యాన్సర్ వ్యాధితో మరణించారు.

మూలాలు

మార్చు
  • ముక్తవరం పార్థసారథి సంకలనము చేసి ప్రచురించిన 'ప్రపంచ రచయిత్రుల కథలు' (14) అనే పుస్తకము నుండి గ్రహించబడింది.

ఇతర లింకులు

మార్చు