చంద్రవంక నది
చంద్రవంక నది, కృష్ణానదికి ఉపనది. ఇది నల్లమల కొండల్లో ముత్తుకూరు వద్ద పుట్టి, తుమృకోటకు దగ్గరలో కృష్ణానదిలో కలుస్తుంది.తుమృకోట అభయారణ్యములో తాళ్ళపల్లి వద్ద 70 అడుగుల నుండి ఎత్తు నుండి దూకుతుంది.అలా ఏర్పడిందే ప్రసిద్ధ ఎత్తిపోతల జలపాతం. అక్కడి నుండి ఉత్తరదిశగా ప్రయాణించి, కృష్ణానదిలో కలుస్తుంది.[1] జన్మస్థానం నుండి కృష్ణలో కలిసేవరకు ఇది 22 కి.,మీ. ప్రయాణిస్తుంది.
చంద్రవంక నది చంద్రవంక వాగు | |
---|---|
![]() చంద్రవంక నది 70 అడుగులు దూకే ఎత్తిపోతల జలపాతం | |
భౌతిక లక్షణాలు | |
మూలం | |
• స్థానం | ముత్తుకూరు |
సముద్రాన్ని చేరే ప్రదేశం | |
• స్థానం | తుమృకోట |
పొడవు | 22 కి.మీ. |
పరీవాహక ప్రాంత లక్షణాలు | |
River system | కృష్ణా నది |
ఎత్తిపోతలు | ఎత్తిపోతల జలపాతం |
చంద్రవంక నది ఒడ్డున పలనాటి బ్రహ్మనాయుడు ఒక గ్రామాన్ని నిర్మించాడు.అదే నేటి మాచర్ల. వర్షాకాలంలో చంద్రవంక పొంగి మాచర్ల పట్టణంలోని ప్రాంతాలను ముంచెత్తడం జరుగుతూంటుంది. [2] పశ్చిమ దిశగా ప్రవహించే చంద్రవంక నది మాచర్ల వద్ద ఉత్తరానికి తిరుగుతుంది. ఈ మలుపు వద్ద లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయాన్ని నిర్మించారు.
1970-1980 దశకాల్లో ఎత్తిపోతల జలపాతం కింద ఏర్పడిన జలాశయంలో భారతీయ బురద మొసళ్ళ పెంపకం చేపట్టి విజయం సాధించారు. ఈ మొసలి ఐయుసిఎన్ వారి రెడ్ లిస్టులో ఉంది. ఈ పెంపకం చేపట్టే నాటికి 15 ఏళ్ళ ముందే ఈ ప్రాంతంలో ఈ మొసలి జాతి కనుమరుగై పోయింది.[3]
మూలాలు
మార్చు- ↑ Andhra Pradesh District Gazetteers By Andhra Pradesh (India), Bh Sivasankaranarayana, M. V. Rajagopal, N. Ramesan [1]
- ↑ "కుండపోత వర్షం | Prajasakti::Telugu Daily". www.prajasakti.com. Archived from the original on 2020-06-08. Retrieved 2020-06-08.
- ↑ రైట్, లిస్సీ; Resources, International Union for Conservation of Nature and Natural (1982). ది ఐయుసిఎన్ యాంఫీబియా-రెప్టీలియా రెడ్ డేటా బుక్ (in ఇంగ్లీష్). IUCN. p. 367. ISBN 978-2-88032-601-2. Archived from the original on 2020-06-09.