చర్చ:కన్యాశుల్కం
Untitled
మార్చుగురజాడ మహాకవి రచించిన గొప్ప నాటకం కన్యాశుల్కం. నిజానికి తెలుగు సాహిత్యలోకంలో కన్యాశుల్క నాటకం ద్రువతార. ఇందులో సమాజమంతా ఉంది. సమాజంలోని అన్ని మనస్తత్వాల వ్యక్తులు ఇందులో ఉన్నారు. వ్యావహారిక భాషలో గురజాడ ఈ నాటకాన్ని రచించి గిడుగు రామమూర్తి గారి వ్యావహారిక భాషోద్యమానికి చేయూతనిచ్చాడు. కన్యాశుల్కంలో సమకాలీన సామాజిక సమస్యలన్నీ గురజాడ వివరించాడు. మధుర వాణి, గిరీశం, రామప్పంతులు, అగ్నిహోత్రావధానులు, లుబ్ధావధాని, కరటక శాస్రి, వెంకటేశమ్, బుచ్చమ్మ వంటి పాత్రలు సజీవ శిల్పాలు.