చర్చ:శ్రీశ్రీ
శ్రీశ్రీ జన్మ తేది
మార్చుశ్రీశ్రీ జన్మించిన తేది ఏప్రిల్ 30 తేది కదా, మొన్ననే శతజయంతి ఉత్సవాలు కూడా ఆరంభమయ్యాయి. వ్యాసంలో తేది మార్చాలేమో! -- C.Chandra Kanth Rao-చర్చ 20:40, 2 మే 2009 (UTC)
- అసలు జన్మ తేదీ ఏప్రిల్ 30 తేదీనే అనుకుంటా, కానీ రికార్డుల ప్రకారం జనవరి 2కు మార్చినట్టు ఈ వ్యాసంలోనే ఉంది. మరియు ఈ సైట్లొ] కూడా జనవరిగానే పేర్కొన్నారు. ఏది ఉంచితే బాగుంటుందో మరి. నాకైతే అసలు తేదీ ఉంచితేనే బాగుంటుందని అనిపిస్తుంది. δευ దేవా 18:54, 3 మే 2009 (UTC)
శ్రీశ్రీ చలోక్తుల్లో కొన్ని ఆధార రహితాలు
మార్చుశ్రీశ్రీని విశ్వనాథ నీళ్ళాడుతున్నాడే అంటే విశ్వనాథని శ్రీశ్రీ అవును కవిసమ్రాట్ కనుచుండగా అన్నట్టు ఉన్న చలోక్తి ఆధార రహితం. ఇద్దరి జీవితాల గురించీ లోతుగా చదివాకా విశ్వనాథ, శ్రీశ్రీ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, విశ్వనాథ ఇంటికి శ్రీశ్రీ వెళ్ళడం లాంటివి జరిగినా ఆయనకి రాత్రి ఆతిథ్యమిచ్చి స్నానం చేస్తుండగా దగ్గర వుండేంత చనువు వారిద్దరి మధ్య లేదు. పైగా ఇవన్నీ బస్టాండుల్లో అమ్మే సాధారణమైన జోకుల పుస్తకాల్లోనూ, సాహిత్యమరమరాలు అంటూ కొందరు పాత్రికేయులు నిర్వహించే శీర్షికల్లోనూ కనిపించేవే తప్ప ప్రామాణికం కాదు. ఎక్కువ ఆధారాలు దొరికితే వికీపీడియా విశ్వసిస్తుందని అన్నా, ఆధారరహితమైన, అప్రామాణికమైన పుస్తకాల నుంచి స్వీకరించి వ్రాయడం వికీ పద్ధతి కాదనే అనుకుంటున్నాను. కనుక దానిని తొలగిస్తున్నాను.--పవన్ సంతోష్ (చర్చ) 11:47, 23 నవంబర్ 2014 (UTC)