చెన్నై రాజధాని ఎక్స్‌ప్రెస్

చెన్నై రాజధాని ఎక్స్‌ప్రెస్ (12433/34) తమిళనాడు రాజధాని చెన్నైను దేశ రాజధాని ఢిల్లీ ల మద్య నడుపబడుతోంది.ఈ రైలు భారతదేశం లోని ప్రతిష్ఠాత్మక రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు వర్గం లోకి చేరుతుంది.ఈ రైలును 1993 లో వారానికి రెండు రోజుల పాటు ప్రయాణించువిధముగా ప్రారంభించారు.చెన్నై రాజధాని ఎక్స్‌ప్రెస్ అతితక్కువ కాలంలోనే తమిళనాడు ఎక్స్‌ప్రెస్మరియు గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్ లకు ప్రత్యామ్నాయ రైలుగా మారింది.ఈ రైలు చెన్నై, ఢిల్లీ ల మద్యగల 2176 కిలోమీటర్ల దూరాన్ని 28గంటల 10నిమిషాలలో సగటున 72కిలో మీటర్ల వేగంతో చేరుతుంది.

చెన్నై రాజధాని ఎక్స్‌ప్రెస్
Chennai Rajdhani Express
சென்னை ராஜதானி எக்ஸ்பிரஸ்
AC 3 tier coach of Chennai Rajdhani express
సారాంశం
రైలు వర్గంరాజధాని ఎక్స్‌ప్రెస్
స్థానికతతమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లి
ప్రస్తుతం నడిపేవారుదక్షిణ రైల్వే జోన్
మార్గం
మొదలుచెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను
ఆగే స్టేషనులు8
గమ్యంన్యూఢిల్లీ రైల్వే స్టేషన్
ప్రయాణ దూరం2,175 కి.మీ. (1,351 మై.)
సగటు ప్రయాణ సమయం28 గంటల 15 నిమిషాలు
రైలు నడిచే విధంDaily (12433)
Daily (12434)[1]
సదుపాయాలు
శ్రేణులుఎసి 1వ క్లాస్, ఏసీ 2 టైర్, ఎసి 3 టైర్
కూర్చునేందుకు సదుపాయాలుకలవు
పడుకునేందుకు సదుపాయాలుకలవు
ఆహార సదుపాయాలుఉంది
చూడదగ్గ సదుపాయాలుReceived new LHB rakes in 2012
వినోద సదుపాయాలుకలవు(1A)
సాంకేతికత
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం72.23 km/h (44.88 mph) average with halts
మార్గపటం
Indian Railways Chennai Rajdhani Express (interactive map)

రాజధాని ఎక్స్‌ప్రెస్

మార్చు

భారతీయ రైల్వే వ్యవస్థలో ఈ రైళ్లకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. దీనికి పూర్తిగా ఎయిర్-కండిషన్ బోగీలు ఉంటాయి. ప్రయాణం సందర్భంగా ప్రయాణికులకు ఉచిత భోజనాలు అందజేస్తారు. ప్రయాణ వ్యవధి, సమయాలు ఆధారంగా, మధ్యాహ్న భోజనం, టీ, రాత్రి భోజనం, ఉదయం టీ, అల్పాహారం అందిస్తారు. దాదాపుగా అన్ని రాజధాని రైళ్లలో మూడు తరగతుల వసతి ఉంటుంది: అవి 2- లేదా 4 బెర్త్‌ల లాకబుల్ బెడ్‌రూములతో ఫస్ట్ క్లాస్ AC, ఓపెన్ బెర్త్‌లతో AC 2-టైర్ (4 బెర్త్‌ల గదులు + కారిడార్ మరోవైపు 2 బెర్త్‌లు), దీనిలో ఏకాంతం కల్పించేందుకు కర్టన్లు ఉంటాయి, AC 3-టైర్ (6 బెర్త్‌ల గదులు + మరోవైపు 2 బెర్త్‌లు), వీటికి కర్టన్లు ఉండవు.

ఇంజన్

మార్చు

చెన్నై రాజధాని ఎక్స్‌ప్రెస్ (12433/34) కొరకు లాల్ గుడా ఆధారిత WAP-7 లోకోమోటివ్ ఇంజన్ ను ఉపయోగిస్తున్నారు.

జోను, డివిజను

మార్చు

చెన్నై రాజధాని ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు లోని దక్షిణ రైల్వే జోన్ పరిధి లోకి వస్తుంది.

రైలు పెట్టెల అమరిక

మార్చు

చెన్నై రాజధాని ఎక్స్‌ప్రెస్ లో మొత్తం 18 పెట్టెలు ఉన్నాయి. వీటిలో 9 ఎసి 3వ తరగతి భోగీలు,5 ఏసీ 2 టైర్ భూగీలు, ఎసి 1వ క్లాస్ భూగి 1 వుంటాయి.వీటితో పాటు పాటు ఒక పాంట్రీ కార్,2 జనరేటర్ భోగీలతో కలిపి 18 భోగీలు ఉన్నాయి.

Loco EOG B1 B2 B3 B4 B5 B6 B7 B8 B9 PC A1 A2 A3 A4 A5 H1 EOG

సమయ సారిణి

మార్చు

|}

సం కోడ్ స్టేషను పేరు 12839:
రాక పోక ఆగు

సమయం

దూరం రోజు
1 0.0 MAS చెన్నై సెంట్రల్ ప్రారంభం 06:10 1
2 BZA విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను 11:50 12:10 15ని 431.3 1
3 WL వరంగల్లు 14:39 14:40 1ని 639.1 1
4 BPQ బల్లార్షా జంక్షన్ 17:50 18:00 10ని 882.3 1
5 NGP నాగ్పూర్ జంక్షన్ 20:35 20:45 10ని 1090.8 1
6 BPL భోపాల్ 02:00 02:10 10ని 1481.0 2
7 JHS ఝాన్సీ రైల్వే జంక్షన్ 05:26 05:31 5ని 1773.1 2
8 GWL గ్వాలియర్ 06:30 06:32 2ని 1870.6 2
9 AGC ఆగ్రా 07:55 07:57 2ని 1988.7 2
10 NZM హజరత్ నిజాముద్దీన్ 10:25 గమ్యం

ములాలు

మార్చు
  1. "H Nizamuddin (NZM), Delhi Railway Station". MakeMyTrip.com. Archived from the original on 20 జూన్ 2013. Retrieved 17 April 2013.