చేతన్ భగత్

భారతదేశానికి చెందిన రచయిత

చేతన్ భగత్ (జననం: 22 ఏప్రిల్ 1974) భారతదేశానికి చెందిన రచయిత, కాలమిస్టు, స్క్రీన్ ప్లే రచయిత, టెలివిజన్ ప్రముఖులు, వక్త. ఆంగ్లంలో ఈయన రాసిన నవలలు యువతకు చాలా చేరువయ్యాయి. 

చేతన్ భగత్
పుట్టిన తేదీ, స్థలం (1974-04-22) 1974 ఏప్రిల్ 22 (వయసు 50)
ఢిల్లీ
భాషఆంగ్లం(నవలలు, వ్యాసాలు), హింది(వ్యాసాలు)
జాతీయతభారతీయుడు
విద్యఆర్మీ పబ్లిక్ స్కూల్, ధులా కాన్, ఐఐటీ ఢిల్లీ(మెకానికల్ విభాగం, బిటెక్), ఐఐఎం అహ్మదాబాద్(ఎంబిఎ)
రచనా రంగంకాల్పనిక, కాల్పనికేతర రచనలు
గుర్తింపునిచ్చిన రచనలుఫైవ్ పాయింట్ సంవన్(2004), ఒన్ నైట్ @ ది కాల్ సెంటర్(2005), ది 3 మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్(2008), 2 స్టేట్స్(2009), రివల్యూషన్ 2020(2011), వాట్ యంగ్ ఇండియా వాంట్స్(2012)(ప్రసంగాలు, వ్యాసాలు), హాఫ్ గర్ల్ ఫ్రెండ్(2014),  మేకింగ్ ఇండియా  ఆసమ్(2015) THE GIRL IN ROOM 105 (2018)
జీవిత భాగస్వామిఅనూషా సూర్యనారాయణన్ భగత్
సంతానంకవలలు: శ్యాం, ఇషాన్

చేతన్ ది టైమ్స్ ఆఫ్ ఇండియా (ఆంగ్ల పత్రిక), దైనిక్ భాస్కర్ (హింది) పత్రికలలో యువత గురించి, కెరీర్ గురించి, సమకాలీన అంశాల గురించి  కాలమ్ లు రాస్తుంటారు.[1][2][3]  

ఆయన రాసిన కొన్ని నవలలు ఏడు మిలియన్ కాపీలు అమ్ముడుపోయాయి. 2008లో భారతీయ సాహిత్య చరిత్రలో "అత్యంత ఎక్కువగా అమ్ముడుపోయిన ఆంగ్ల నవలల రచయితగా" ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక పేర్కొంది[4][5].

కాయ్ పో చే! (2015), 2 స్టేట్స్ (2014), కిక్ (2015) సినిమాలకు ఆయన స్క్రీన్ ప్లే రాశారు. జనవరి 2014లో 59వ ఫిలింఫేర్ అవార్డలో కాయ్ పో చే సినిమాకుగానూ చేతన్ భగత్ ఫిలింఫేర్ బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు అందుకున్నారు.

పాకిస్థాన్ లో ఒక పంజాబీ కుటుంబంలో పుట్టారు చేతన్[6]. ఆయన  తండ్రి ఆర్మీలో అధికారిగా పనిచేశారు. తల్లి వ్యవసాయ శాఖలో ప్రభుత్వ ఉద్యోగిని. చేతన్ తమ్ముడు కేతన్ భగత్ కూడా నవలా రచయితే.

ఢిల్లీ లోని  ధులా కాన్ ది ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో ప్రాథమిక విద్య  పూర్తి చేశారు ఆయన. 1995లో  ఐఐటీ ఢిల్లీ లో మెకానికల్  విభాగంలో బిటెక్ పట్టా పుచ్చుకున్నారు భగత్. 1997లో ఐఐఎం అహ్మదాబాద్ నుండి ఎంబిఎ పట్టా అందుకున్నారు.

దశాబ్దం పాటు హాంగ్ కాంగ్ లోని గోల్డ్ మాన్ సాచ్స్ సంస్థలో ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ గా పనిచేశారు. హాంగ్ కాంగ్ లో ఉన్నప్పుడే ఆయన ఫైవ్ పాయింట్ సంవన్ అనే నవల రాశారు. ఆ నవల బహుళ ప్రజాదరణ పొందడంతో పూర్తి స్థాయి రచయితగా మారి ముంబై కు వచ్చేశారు భగత్.

1998లో భగత్ అనూషా సూర్యనారాయణన్ తో వివాహం జరిగింది. ఆమె తమిళనాడుకు చెందినవారు. వీరిద్దరూ ఐఐఎం అహ్మదాబాద్ లో కలసి చదువుకున్నారు.

కెరీర్

మార్చు

ఫైవ్ పాయింట్ సంవన్ (2004), ఒన్ నైట్ @ ది కాల్ సెంటర్ (2005), ది 3 మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్ (2008), 2 స్టేట్స్ (2009), రివల్యూషన్ 2020 (2011), వాట్ యంగ్ ఇండియా వాంట్స్ (2012) (ప్రసంగాలు, వ్యాసాలు), హాఫ్ గర్ల్ ఫ్రెండ్ (2014),  మేకింగ్ ఇండియా  ఆసమ్ (2015)  వంటి బెస్ట్ సెల్లర్ నవలలను రాశారు భగత్. వీటిలో  నాలుగు నవలలు 3 ఇడియట్స్, కాయ్ పో చే!, 2 స్టేట్స్, హలో  సినిమాలుగా కూడా వచ్చాయి. టైమ్ పత్రిక చేతన్ భగత్ ను అత్యంత  ప్రభావవంతులైన 100మంది జాబితా లో చేర్చింది[7]. కొన్ని  ఈవెంట్లలో ఆయన వక్తగా కూడా పాల్గొంటుంటారు[8][9][10]. 2014లో విడుదలైన కిక్ సినిమాతో స్క్రీన్ ప్లే రచయితగా కూడా మారారు భగత్.

ది టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ టైమ్స్ పత్రికల్లో వ్యాసాలు రాస్తుంటారు భగత్.[11] స్టార్ యాంకర్ హంట్ వాయిస్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ కు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు[12]. ఎబిపి న్యూస్ ఛానల్ లో 11 జనవరి 2014న  మొదలైన 7 ఆర్.సి.ఆర్ కార్యక్రమానికి ఆయన వ్యాఖ్యతగా కూడా వ్యవహరిస్తున్నారు. భారతదేశ ప్రధానమంత్రి అభ్యర్థుల జీవిత విశేషాల గురించి వివరిస్తుంది ఈ కార్యక్రమం.[13]

కార్పొరేట్ సంస్థలు, విద్యా సంస్థలు, దైనిక్ భాస్కర్ వంటి పత్రికలు ఏర్పాటు చేసే కార్యక్రమాలకు ఆయన వక్తగా పాల్గొంటుంటారు. కాలమ్  రాయడమే కాకుండా ది టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించే పలు కాన్ఫరెన్స్ లలో కూడా ఆయన ప్రసంగాలు ఇస్తుంటారు[14].

నచ్ బలియే షోలో ఆయన న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరిస్తున్నారు[15].He was also the judge of the dance reality show Nach Baliye.[15]

పుస్తకాలు

మార్చు
  • ఫైవ్ పాయింట్ సంవన్ (2004)
  • ఒన్ నైట్ @ ది కాల్ సెంటర్ (2005)
  • ది 3 మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్ (2008)
  • 2 స్టేట్స్ (2009) 
  • రివల్యూషన్ 2020 (2011)
  • వాట్ యంగ్ ఇండియా వాంట్స్ (2012)
  •  హాఫ్ గర్ల్ ఫ్రెండ్ (2014)
  •  మేకింగ్ ఇండియా ఆసమ్ (2015)
  • THE GIRL IN ROOM 105 (2018)

సినిమాలు

మార్చు
ఏడాది సినిమా స్క్రీన్ ప్లే కథ
2008 హలో
2009 3 ఇడియట్స్
2013 కాయ్ పో చే! ఫిలింఫేర్ బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు
2014 2 స్టేట్స్
2014 కిక్
2016 హాఫ్ గర్లఫ్రెండ్

అవార్డులు

మార్చు
  • సొసైటీ యువ అచీవర్ 2004[16]
  • పబ్లిషర్స్ రికగ్నిషన్ అవార్డు 2005[16] 
  • 2010లో టైమ్ పత్రికలో వరల్డ్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ జాబితాలో చోటు[17] 
  • కాయ్ పో చే! సినిమాకు ఫిలింఫేర్ బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు
  • సి.ఎన్.ఎన్‌-ఐబిఎన్ సంస్థ 2014 సంవత్సరానికి ఎంటర్ టైన్మెంట్ విభాగంలో అవార్డు ప్రదానం
  1. Chetan Bhagat in Kathmandu Rejuvenates Youth Potential Archived 2011-11-04 at the Wayback Machine.
  2. Bhagat, Chetan (19 August 2011). "Anna Hazare's fight for change has inspired millions of Indians". The Guardian. London. Retrieved 17 August 2011.
  3. Columns.
  4. Greenlees, Donald (26 March 2008).
  5. "Chetan Bhagat's much-anticipated novel will be released this October". Asia Pacific Arts. 20 September 2011. Archived from the original on 6 అక్టోబరు 2014. Retrieved 23 ఏప్రిల్ 2016.
  6. "Writing 2 States helped me forgive my father: Chetan Bhagat". The Times of India. 12 April 2014. Retrieved 12 April 2014.
  7. Time 100 most influential people in the world list 2010 Archived 2013-08-25 at the Wayback Machine.
  8. CIOIN Archived 2011-03-05 at the Wayback Machine.
  9. "Open letter to Sonia Gandhi from young India". The Times of India. 13 February 2011. Archived from the original on 2012-07-19. Retrieved 2016-04-23.
  10. Becoming One With the World.
  11. "Columns". chetanbhagat.com. Retrieved 5 June 2014.
  12. "Judges for Anchor hunt: Chetan Bhagat" Archived 2010-03-23 at the Wayback Machine. staranchorhunt.com. 19 March 2010.
  13. "Chetan Bhagat's '7 RCR' to go on air Jan 11". IANS. 11 January 2014. Retrieved 2014-01-11.
  14. Chetan Bhagat at PROTON Academic Conclave 2009.
  15. 15.0 15.1 http://indiatoday.intoday.in/story/chetan-bhagat-to-dance-on-nach-baliye-season-7-finale-karishma-tanna-upen-patel-rashami-desai-nandish-sandhu-amruta-khanvilkar-himanshu-malhotra/1/450016.html
  16. 16.0 16.1 Biodata of Chetan Bhagat Archived 2011-11-06 at the Wayback Machine.
  17. "Search Results for Chetan Bhagat". Time. 21 April 2011. Archived from the original on 16 జూలై 2012. Retrieved 23 ఏప్రిల్ 2016.
"https://te.wiki.x.io/w/index.php?title=చేతన్_భగత్&oldid=4360453" నుండి వెలికితీశారు