జడల బర్రె (ఆంగ్లం: Yak) పొడవైన వెండ్రుకలు కలిగిన క్షీరదాలు. వీటి శాస్త్రీయ నామం బాస్ గ్రునియెన్స్ (Bos grunniens). ఇవి దక్షిణాసియా హిమాలయ పర్వత ప్రాంతాలలో, టిబెట్ నుండి మంగోలియా వరకు విస్తరించాయి. హిందూ దేవతల పూజా కార్యక్రమాలలో ఉపయోగించే చామరం దీని వెంట్రుకలతో తయారుచేస్తారు.

జడల బర్రె
నేపాల్ లో జడల బర్రె
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Genus:
Species:
B. grunniens
Binomial name
Bos grunniens
Synonyms

Poephagus grunniens


జీవనశైలి

మార్చు

ఇవి ఎక్కువగా పెంపుడు జంతువులుగా జీవిస్తాయి. కొద్ది జీవులు అడవులలో ఉంటాయి.

జడల బర్రె సమూహాలుగా జీవిస్తాయి. మగజీవులు సుమారు 2–2.2 మీటర్లు, ఆడజీవులు దానిలో మూడోవంతు పొడవుంటాయి. రెండింటికీ పొడవైన వెండ్రుకలు దట్టంగా శరీరమంతా కప్పి చలినుండి రక్షిస్తాయి. ఇవి గోధుమ, నలుపు, తెలుపు రంగులలో ఉంటాయి. రెండింటికీ కొమ్ములుంటాయి.

జడల బర్రె సుమారు సెప్టెంబర్ మాసంలో జతకడతాయి. ఆడజీవులు ఇంచుమించు 3–4 సంవత్సరాల వయసులో మొదలుపెట్టి ఏప్రిల్-జూన్ నెలల్లో దూడల్ని కంటాయి. వీటి గర్భావధి కాలం సుమారు 9 నెలలు. దూడలు సంవత్సర కాలం తల్లివద్ద పాలు త్రాగి, తర్వాత స్వతంత్రంగా 20 సంవత్సరాలు పైగా జీవిస్తాయి.

పెంపుడు జంతువు

మార్చు
 
షింగై సరస్సు వద్ద చమరీమృగంతో ఒక స్త్రీ

జడల బర్రె నుండి లభించే పాలు, ఉన్ని, మాంసం కోసం పెంచుతారు. వీటిని బరువైన పనులు చేయడానికి కూడా ఉపయోగించుకుంటారు. స్థానిక రైతులు, వర్తకులు వీటిని వస్తువులను ఎత్తైన పర్వతాల గుండా రవాణా చేయటానికి ఉపయోగిస్తారు. పర్వతారోహణ, సాహసిక బృందాలు వీటిని తమ సామగ్రిని చేరవేయటానికి కూడా ఉపయోగిస్తాయి. వీటిని నాగలి కట్టి పొలాలు దున్నటానికి కూడా ఉపయోగిస్తారు. జడల బర్రె పేడను ఆవుపేడ వలె పిడకలు చేసి వంటచెరుకుగా, ఇంధనంగా కూడా ఉపయోగిస్తారు. జడల బర్రె పాలనుండి చ్ఛుర్పీ (టిబెటన్, నేపాలీ భాషలు) లేదా బ్యాస్లాగ్ (మంగోలియన్) అనే ఒక రకం చీజ్ ను తయారుచేస్తారు. ఈ పాల నుండి తీసిన వెన్నను, టీలో కలిపి చేసిన బటర్ టీ ని టిబెట్ ప్రజలు విరివిగా తాగుతారు.[1] ఈ వెన్నను దీపాలు వెలిగించటానికి, మత సంబంధ ఉత్సవాలలో ఉపయోగించే వెన్న శిల్పాలను సృష్టించడానికి కూడా ఉపయోగిస్తారు.[2]

మృగాల మందలలో తరచూ జడల బర్రెలకు, సాధారణ బర్రెల మధ్య సంకరం ద్వారా పుట్టిన సంకర జాతి జంతువులు కూడా కనిపిస్తుంటాయి. వీటిని టిబెటన్ భాషలో డ్జో లేదా డ్జోప్క్యో అంటారు. మంగోలియన భాషలో వీటినే ఖైనాగ్ అంటారు. సాధారణ బర్రెలలాగా అంబాడే శబ్దము కాకుండా చమరీమృగాలు హుంకరిస్తారు.

జడల బర్రె నుండి లభించే పోగులు మృదువుగా, నునువుగా ఉండి, బూడిద, గోధుమ, నలుపు, తెలుపు మొదలైన అనేక వర్ణఛ్ఛాయలలో లభ్యమౌతాయి. 1.2 అంగుళాల పొడవుండే ఈ పోగులను మృగాల నుండి దువ్వడం లేదా విదిలించిండం ద్వారా సేకరిస్తారు. ఇలా లభ్యమైన పోగులను యేకటం ద్వారా తయారైన మొత్తని తంత్రులను వడికి ఉన్ని దారాన్ని తయారు చేస్తారు. ఈ దారాన్ని అనేక ఉన్నివస్త్రాలను అల్లటానికి ఉపయోగిస్తారు. జడల బర్రె వెంట్రుకల నుండి తాళ్ళు, రగ్గులు, అనేక ఇతర సామగ్రి తయారు చేస్తారు. ఈ జంతువుల తోలుతో బూట్లు, చేతిసంచుల తయారితో పాటు చిన్న పడవ నిర్మాణంలో కూడా ఉపయోగిస్తారు.

మూలాలు

మార్చు
  1. "Tibet and Tibetan Foods". Archived from the original on 2013-07-01. Retrieved 2009-01-30.
  2. Yaks, butter & lamps in Tibet Archived 2004-02-27 at the Wayback Machine, webexhibits.org

గ్యాలరీ

మార్చు

బయటి లింకులు

మార్చు
"https://te.wiki.x.io/w/index.php?title=జడల_బర్రె&oldid=4348535" నుండి వెలికితీశారు