జనవినోదిని
19 వ శతాబ్దంలో వచ్చిన తెలుగు మాస పత్రిక జనవినోదిని. పిల్లల కథలు, గేయాలు ప్రచురించిన తొలి పత్రిక ఇది. మద్రాసు స్కూల్‌బుక్ సొసైటీ ఈ పత్రికను ప్రచురించింది. వి. కృష్ణమాచార్యులు సంపాదకత్వంలో ఇది వెలువడింది.[1]
సంపాదకులు | వేదము వేంకటరాయశాస్త్రి |
---|---|
ముద్రణకర్త | మద్రాసు స్కూల్‌బుక్ సొసైటీ |
మొదటి సంచిక | 1875 |
ఆఖరి సంచిక | 1885 |
చరిత్ర
మార్చు1875 లో మొదలై 1885 వరకు పదేళ్ళ పాటు ప్రచురితమైన పత్రిక, జనవినోదిని. పిల్లల కథలు, గేయాలు ప్రచురించిన తొలి పత్రికగా దీనికి విశిష్టత ఉంది. "చిట్ల పొట్ల కాయ”, "రుంగు రుంగు బిళ్ళ" వంటి పిల్లల గేయాలను ఈ పత్రిక పచురించింది.[2]
వేదము వేంకటరాయశాస్త్రి దీనికి సంపాదకుడు. ఆయన ప్రతాపరుద్రుని కథను, కథానరిత్సాగరం కొన్ని ప్రకరణములనూ పత్రికలో ప్రచురించాడు.[3] చదలవాడ సీతారామశాస్త్రి రచించిన దక్కన్ పాతకథలు వరుసగా ఈ పత్రికలో వచ్చాయి.[1]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 వేదగిరి, రాంబాబు (2012). ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా వెలువడిన గ్రంథాలు. హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ, సాంసృతిక మండలి. p. 21.
- ↑ వెలగా, వెంకటప్పయ్య (1982). బాల సాహితీ వికాసం. విజయవాడ: సిద్ధార్థ పబ్లిషర్స్. p. 57.
- ↑ వెంకటరాయశాస్త్రు, వేదము (1949). జీవిత చరిత్ర సంగ్రహము. మద్రాసు: వేదము వేంకటరాయశాస్త్రి అండ్ బ్రదర్స్. p. 45.
ఈ వ్యాసం మీడియాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |