జయంతి నటరాజన్
జయంతి నటరాజన్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన న్యాయవాది, రాజకీయ నాయకురాలు. ఆమె కాంగ్రెస్ పార్టీ నుండి 4 సార్లు రాజ్యసభకు ఎన్నికై, 1997 నుండి 1998 వరకు కేంద్రంలోని ఐ.కె.గుజ్రాల్ మంత్రివర్గంలో బొగ్గు & గనుల శాఖ మంత్రిగా, రెండవసారి 12 జూలై 2011 నుండి 2013 డిసెంబరు 20 వరకు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కేంద్ర అటవీ & పర్యావరణ శాఖ మంత్రిగా పనిచేసింది.[1]
జయంతి నటరాజన్ | |||
| |||
అటవీ & పర్యావరణ శాఖ సహాయ మంత్రి
| |||
పదవీ కాలం 12 జులై 2011 – 20 డిసెంబర్ 2013 (రాజీనామా) | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
---|---|---|---|
బొగ్గు & గనుల, పౌర విమానాయ & పార్లమెంటరీ వ్యవహారాల శాఖల మంత్రి
| |||
పదవీ కాలం 1997 – 1998 | |||
ప్రధాన మంత్రి | ఐ.కె.గుజ్రాల్ | ||
రాజ్యసభ సభ్యురాలు తమిళనాడు
| |||
పదవీ కాలం 2008 – 2014 | |||
పదవీ కాలం 1997 – 2002 | |||
పదవీ కాలం 1992 – 1997 (రాజీనామా) | |||
పదవీ కాలం 1986 – 1992 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | మద్రాస్, మద్రాస్ రాష్ట్రం(ఇప్పుడుచెన్నై, తమిళనాడు, భారతదేశం) | 1954 జూన్ 7||
రాజకీయ పార్టీ |
(1982–1997;2002–2015)
(1997–2002) | ||
జీవిత భాగస్వామి | వి. కే. నటరాజన్ | ||
సంతానం | 1 కుమారుడు | ||
నివాసం | న్యూఢిల్లీ/చెన్నై | ||
పూర్వ విద్యార్థి | ఎతిరాజ్ కాలేజీ ఫర్ విమెన్ |
జననం, విద్యాభాస్యం
మార్చుజయంతి నటరాజన్ మద్రాసులో డాక్టర్ సిఆర్ సుందరరాజన్, రుక్మిణి సుందరరాజన్ దంపతులకు1954 జూన్ 7న జన్మించింది. ఆమె ప్రముఖ సామాజిక కార్యకర్త సరోజినీ వరదప్పన్ మేనకోడలు, కాంగ్రెస్ రాజకీయ నాయకుడు, 1963 - 1967 తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎం. భక్తవత్సలం మనవరాలు. జయంతి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలు పెట్టింది.[2]
రాజకీయ జీవితం
మార్చుజయంతి నటరాజన్ 1980వ దశకంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ జీవితం ప్రారంభించి 1986లో మొదటిసారి రాజ్యసభ సభ్యురాలిగా, 1992లో రెండోసారి రాజ్యసభకు ఎన్నికైంది. ఆమె 1997లో పీవీ నరసింహారావుపై అసంతృప్తితో పార్టీని వీడి జీకే మూపనార్ ఆధ్వర్యంలో తమిళ మానిల కాంగ్రెస్‌ను స్థాపించి రాజ్యసభకు రాజీనామా చేసి 1997లో టీఎంసీ తరపున తిరిగి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైంది. జయంతి తరువాత కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో భాగమై 1997లో కేంద్ర బొగ్గు, పౌర విమానయాన, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేసింది.
జయంతి నటరాజన్ జీకే మూపనార్ మరణాంతరం తమిళ మానిల కాంగ్రెస్‌ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఆమె తరువాత కాంగ్రెస్ అధికార ప్రథినిగా నియమితురాలైంది. జయంతి 2011 జూలై 12 నుండి 2013 డిసెంబరు 20 వరకు పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రిగా (స్వతంత్ర బాధ్యత) పనిచేసి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నుంచి వచ్చిన సూచనల ప్రకారమే ఆమె పార్టీ కోసం పనిచేసేందుకు మంత్రి పదవికి రాజీనామా చేసింది.[3]
మూలాలు
మార్చు- ↑ The Hindu (13 July 2011). "New Environment Minister takes charge" (in ఇంగ్లీష్). Archived from the original on 7 March 2022. Retrieved 7 March 2022.
- ↑ NDTV (15 November 2011). "Who is Jayanthi Natarajan?". Archived from the original on 10 March 2022. Retrieved 10 March 2022.
- ↑ Sakshi (22 December 2013). "జయంతి రాజీనామా". Archived from the original on 10 March 2022. Retrieved 10 March 2022.