జయశ్రీ ఖాదిల్కర్
జయశ్రీ ఖాదిల్కర్ పాండే (జననం 1962 ఏప్రిల్ 25) భారతీయ చెస్ క్రీడాకారిణి. 1979లో అంతర్జాతీయ చెస్ సమాఖ్య (FIDE) నుండి ఆమె ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ సాధించింది.[2] దీంతో ఈ టైటిల్‌ను సాధించిన మొదటి భారతీయ మహిళగా గుర్తింపుపొందింది.[3] ఆమె నాలుగు సార్లు భారత మహిళల ఛాంపియన్‌షిప్‌ను కూడా గెలుచుకుంది.[4]
జయశ్రీ ఖాదిల్కర్ పాండే | |
---|---|
దేశం | భారతదేశం |
పుట్టిన తేది | 1962 ఏప్రిల్ 25 |
టైటిల్ | ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ (1979) |
ఫిడే రేటింగ్ | 2120 ఇన్‌యాక్టివ్ |
అత్యున్నత రేటింగ్ | 2120 (జనవరి 1987)[1] |
కెరీర్
మార్చువీరు ముగ్గురు సోదరీమణులు వాసంతి ఖాదిల్కర్, జయశ్రీ ఖాదిల్కర్, రోహిణి ఖాదిల్కర్. ఈ ముగ్గురూ భారతదేశ మహిళల చెస్ ఛాంపియన్‌షిప్‌లలో ఆధిపత్యం చెలాయించడంతో పాటు మొదటి దశాబ్దంలోనే అన్ని టైటిళ్లను గెలుచుకున్నందుకు గుర్తింపు పొందారు.[4] జయశ్రీ ఖాదిల్కర్ పీక్ FIDE స్ట్రెంగ్త్ రేటింగ్ 2120, ఆమె జనవరి 1987లో సంపాదించింది. ముగ్గురు సోదరీమణులలో, ఆమె అత్యధిక టైటిల్‌లు, టోర్నమెంట్‌లను గెలుచుకుంది.
ఖాదిల్కర్ సోదరీమణుల తండ్రి, నీల్కాంత్ ఖాదిల్కర్ (1934-2019) స్థాపించిన నవ కాల్ వార్తాపత్రికకు ఆమె సంపాదకురాలు, ప్రింటర్, అలాగే ప్రచురణకర్త కూడా.[5][6]
మూలాలు
మార్చు- ↑ Khadilkar, Jayshree FIDE rating history, 1979-2001 at OlimpBase.org
- ↑ Jackson, John (28 September 2017). "The Khadilkar Sisters". Chess-Site.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2019-11-23.
- ↑ D.K. Bharadwaj (2003-05-13). "A big boom in the brain game". Press Information Bureau, Government of India.
- ↑ 4.0 4.1 Menon, Ajay (3 June 2012). "Anand's win fires former chess whiz from Girgaon". Hindustan Times. Mumbai. Archived from the original on 8 August 2014. Retrieved 5 August 2014.
- ↑ "Information box at bottom-left on Page 11" (PDF). Nava Kaal (in Marathi). Mumbai. Retrieved 5 August 2014.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "Senior journalist Nilkanth Khadilkar dies at 86". 22 November 2019.