శివరాంపల్లి జాగీర్
శివరాంపల్లి జాగీరు, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ మండలంలోని గ్రామం.[1]
శివరాంపల్లి జాగీర్ | |
---|---|
నగరంలోని ప్రాంతం | |
దేశం | ![]() |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాద్ జిల్లా |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
Vehicle registration | టి.ఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | ఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం |
నగర ప్రణాళిక సంస్థ | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
![](http://up.wiki.x.io/wikipedia/commons/thumb/1/1b/Shivarampally.jpg/250px-Shivarampally.jpg)
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
మార్చు2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]
ఇది హైదరాబాదు పరిసర ప్రాంతం. ఒక ప్రధాన వాణిజ్య, నివాస ప్రాంతం.రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానించబడింది. పి.వి. నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే శివరాంపల్లి జాగీర్ గుండా వెళుతుంది. హైదరాబాద్‌లో ఎక్కువగా సందర్శించే ప్రదేశమైన నెహ్రూ జూలాజికల్ పార్క్ కూడా శివరాంపల్లికి దగ్గరలో ఉంది. రిటైల్ కార్పొరేట్ దిగ్గజాలు వాల్మార్ట్, మెట్రో క్యాష్, క్యారీ శివరంపల్లికి దగ్గరగా ఉన్నాయి.ప్రసిద్ధి చెందిన రామ్‌దేవ్ బాబా ఆలయం ఇక్కడ ఉంది. దీనిని దివంగత శ్రీ గోపాల్ బజాజ్ నిర్మాణం గావించాడు.
చారిత్రాత్మక రుక్న్-ఉద్-దౌలా సరస్సు ఇక్కడకు సమీపంలో ఉంది. విమానాశ్రయానికి కనెక్టివిటీ ఉన్నందున పారిశ్రామికంగా ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందింది. శివరాంపల్లి జాగీర్ ప్రాంతం నుండి సాగిన జాతీయ రహదారి సంఖ్య 7 లో రాఘవెేంద్ర నగర్ కాలనీ అనే ఒక పేరుపొందిన హౌసింగ్ సొసైటీ ఉంది.సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ రాఘవెేద్ర నగర్ కాలనీకి ఎదురుగా ఉంది.
శివరాంపల్లిజాగీర్ పరిదిలో ఉన్న జాతీయ రహదారి 7 లో ప్రతిష్ఠాత్మక సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ ఉండటం హైదరాబాదు నగరానికే గర్వంగా భావిస్తారు.
మూలాలు
మార్చు- ↑ https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Rangareddy.pdf
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-06.