జియాజింగ్ షోయాజింగ్ సీ బ్రిడ్జ్
జియాజింగ్ షోయాజింగ్ సముద్రపు వంతెన (Jiaxing-Shaoxing Sea Bridge) ప్రపంచంలో అతి పొడవైన, వెడల్పైన సముద్రపు వంతెన. ఇది తీగల వంతెన. ఈ వంతెనను 10 కి.మీ పొడవుతో నిర్మించి చైనా ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఈ వంతెనను సుమారు 6.2 మైళ్ల పొడవు అనగా 10 కిలోమీటర్ల పొడవు తో "హాన్‌గ్యూ అఖాతం" నుండి "షాక్సింగ్" వరకు నిర్మించారు. దీనిపై 2560 అడుగుల వెడల్పుతో 6 వరుసల రోడ్లను వేశారు. ఏడేళ్ల పాటు కట్టిన దీనికి ఆధారంగా ఉండే ప్రధాన స్తంభాలు (పైలాన్స్) రెండే నిర్మించారు. ఇవి ఒక్కొక్కటి 745 అడుగుల ఎత్తు కలిగి ఉన్నది. ఈ వంతెన నిర్మాణానికి సుమారు 2.23 బిలియన్ డాలర్లు ఖర్చు అయింది. మన రూపాయలలో చెప్పాలంటే సుమారు 10,000 కోట్లకు పైమాటే. దీనిపై పాదచారులకు, ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదు. దీనిపై వెళ్ళే వాహనాలు గంటకు 95 కిలో మీటర్ల కనీస వేగం కలిగి యుండాలి. అంతకు తక్కువ వేగంతో పోయేవాటికి అనుమతి లేదు. ఈ వంతెన వల్ల చైనా లోని "షావోజింగ్", "షాంఘై" ప్రాంతాల మధ్య దూరం సగానికి తగ్గుతుంది. ఈ వంతెనను జూన్ 17 , 2013 న పూర్తి చేశారు.
జియాజింగ్ షోయాజింగ్ సీ బ్రిడ్జ్ 嘉兴至绍兴跨海大桥 | |
---|---|
![]() | |
OS grid reference | [1] |
లక్షణాలు | |
మొత్తం పొడవు | 6.2 మైళ్లు (10 కిలోమీటర్లు) |
వెడల్పు | 2,560 అడుగులు |
ఎత్తు | 745 అడుగులు (supporting pylons) |
చరిత్ర | |
నిర్మాణం పూర్తి | జూన్ 17, 2013 |
నిర్మాణ వ్యయం | ¥13.9 బిలియన్లు (US $2.23 బిలియన్లు)[1] |
గణాంకాలు | |
Daily traffic | 6 వరుసలు |
ఈ వంతెన "క్జియామిన్" లోని "హైకాంగ్" జిల్లా లోని మాకింగ్ రోడ్డు వద్దనుండి మొదలై "షాంఘై" లోని "లోంగై" వద్ద అంతమవుతుంది.
మూలాలు
మార్చుసూచికలు
మార్చు- ↑ "Jiaxing-Shaoxing sea bridge soon to reduce travel time to Shanghai". Archived from the original on 4 మార్చి 2016. Retrieved 19 June 2013.