జీడిపల్లి రిజర్వాయర్
జీడిపల్లి రిజర్వాయర్ అనేది ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఉన్న ఒక నీటిపారుదల ప్రాజెక్టు.[1] ఇది శ్రీశైలం జలాశయం నుండి నీటిని తీసుకునే హంద్రీ-నీవా కాలువ నుండి నీటిని పొందుతుంది.[2] ఇది బెళుగుప్ప మండలంలోని జీడిపల్లి గ్రామంలో ఉంది.[3]
జీడిపల్లి రిజర్వాయర్ | |
---|---|
![]() జీడిపల్లి జలాశయం ఉపగ్రహా చిత్రం, కుడి వైపున పెన్నా నది | |
ప్రదేశం | అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
అక్షాంశ,రేఖాంశాలు | 14°42′33″N 77°15′55″E / 14.70917°N 77.26528°E |
వివరాలు
మార్చుజలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. దీనిని 2012, నవంబరు 29న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించాడు.[4] ఇది బెళుగుప్ప మండలం జీడిపల్లి గ్రామ సమీపంలో ఉంది.[5] 1.7 tmcft స్థూల నిల్వ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ పెన్నా నది పరీవాహక ప్రాంతంలో ఉంది. ఈ జలాశయం ఆంధ్ర ప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలలోని పెన్నా, కృష్ణా, పాలార్ నదీ పరివాహక ప్రాంతాలలో కృష్ణా నది నీటిని సరఫరా చేయడానికి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా పనిచేస్తుంది.[6] కృష్ణా నదికి ఉపనది అయిన వేదవతి నదీ పరీవాహక ప్రాంతంలో ఉన్న భైరివాణి తిప్ప రిజర్వాయర్‌కు ఈ రిజర్వాయర్ నుండి నీటిని మరింత పంపింగ్ చేస్తారు.
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "The Hindu : Today's Paper / NATIONAL : Acquisition of forestland: Kiran orders posting of special officer". The Hindu. Archived from the original on 30 December 2012. Retrieved 29 November 2012.
- ↑ "Kiran to flag off Bhagiratha Vijaya Yatra on Nov. 18". The Hindu. 15 November 2012. Retrieved 22 May 2019.
- ↑ "CM to tour Anantapur district on Nov 29". 27 November 2012.
- ↑ "Rs 16,000 crore for irrigation projects in next 2 yrs: Kiran". 29 November 2012.
- ↑ "CM to tour Anantapur district on Nov 29". 27 November 2012.
- ↑ "Handri Neeva Sujala Sravanti (HNSS) JI00011". Archived from the original on 23 February 2016. Retrieved 9 May 2016.