జుమ్మాఁ కథల సంపుటాన్ని వేంపల్లె షరీఫ్ రచించాడు. ఈ పుస్తకం 2011, ఆగస్టులో మొదట ప్రచురింపబడింది. ముస్లిం జీవనవిధానాలను, పేదరికాన్ని ఈ కథలు ప్రతిబింబించాయి. ప్రస్తుతం మూడో ముద్రణ మార్కెట్లో అందుబాటులో ఉంది.

జుమ్మాఁ
కృతికర్త: వేంపల్లె షరీఫ్
ముఖచిత్ర కళాకారుడు: లేపాక్షి
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: కథాసంపుటి
ప్రచురణ: సాఫిర్ పబ్లికేషన్స్
విడుదల: ఆగష్టు, 2011
పేజీలు: 104

జుమ్మా అంటే శుక్రవారం అని అర్థం. 2007లో హైదరాబాద్లోని మక్కా మసీదులో ఒక శుక్రవారం జరిగిన సంఘటన నేపథ్యంలో వేంపల్లె షరీఫ్ జుమ్మా పేరుతో కథ రాశారు. ఈ కథతోపాటు మరిన్ని కథలు ఈ పుస్తకంలో ఉన్నాయి.

జుమ్మా పుస్తకానికి షరీఫ్ 2012లో కేంద్ర సాహిత్య అకాడెమి యువ పురస్కారంతో పాటు అనేక పురస్కారాలు పొందారు. ఈ పుస్తకం ఇంగ్లీషు, కన్నడ భాషల్లోని అనువాదమైంది. కన్నడలో ఉత్తమ అనువాద కథల పుస్తకంగా కువెంపు భాషా భారతి పురస్కారం అందుకుంది.

ఇంకా ఈ పుస్తకానికి తెలుగులో కొలకలూరి కథా పురస్కారం, విమలాశాంతి కథా పురస్కారాలు కూడా దక్కాయి. ఈ కథలను కడప ఆల్ ఇండియా రేడియో ధారవాహికంగా ప్రసారం చేశారు. జుమ్మా పుస్తకంలోని మరికొన్ని కథలు మైథిలీ, హిందీ, కొంకణి, బెంగాలీ భాషల్లోకి అనువాదమయ్యాయి.

ఈ పుస్తకంలో 12 కథలు ఉన్నాయి. వీటిలో రెండవ కథ జుమ్మాఁను ఈ పుస్తకానికి శీర్షికగా రచయిత ఎన్నుకున్నాడు. ఈ పుస్తకంలోని కథలు వరుసగా

  1. పర్దా
  2. జుమ్మా
  3. ఆకుపచ్చ ముగ్గు
  4. దస్తగిరి చెట్టు
  5. రూపాయి కోడిపిల్ల
  6. రజాక్‌మియా సేద్యం
  7. అయ్యవారి చదువు
  8. జీపొచ్చింది
  9. పలక పండుగ
  10. అంజనం
  11. తెలుగోళ్ళ దేవుడు
  12. చాపరాయి

రచయిత గురించి

మార్చు

వేంపల్లె షరీఫ్ కడప జిల్లా వేంపల్లె గ్రామానికి చెందిన ఒక పేదముస్లిం కుటుంబం నుండి వచ్చాడు. 1980, ఏప్రిల్ 18న జన్మించిన షరీఫ్ 70కి పైగా కథలను వ్రాశాడు. వాటిలో బాలల కథలు కూడా ఉన్నాయి. ఇతడు హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి జర్నలిజంలో ఎం.ఫిల్. తోపాటు పిహెచ్ డి పట్టా పొందాడు. ఇతడు వివిధ పత్రికలలో పనిచేశాడు. సాక్షి టి.వి., ఎఫ్.ఎమ్.రెయిన్ బో మొదలైన వాటిలో పనిచేశాడు. ఇతని ఇతర కథలు ఇంగ్లీషు, మైథిలి భాషలలోకి అనువదించబడ్డాయి[1]. తలుగు అనే కథ నంది నాటకోత్సవాల్లో ప్రదర్శించబడింది.

డిగ్రీ పాఠ్యాంశంగా కథ

మార్చు

వేంపల్లె షరీఫ్ రాసిన "ఆకుపచ్చ ముగ్గు' కథ 2024-2025 సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డిగ్రీ (బిఏ, బీకాం, బిఎస్ సి, బిబిఏ) చదివే విద్యార్థులకు పాఠ్యంశంగా చేర్చారు. ఈ కథను జుమ్మా కథా సంకలనం నుంచి తీసుకున్నారు.[2][3]

పురస్కారాలు

మార్చు
  • కేంద్ర సాహిత్య అకాడమీ వారి యువపురస్కారం ఈ గ్రంథానికి గాను వేంపల్లె షరీఫ్ కు 2012లో లభించింది.[4]

మూలాలు

మార్చు
  1. "8 Jun 2013: Vempalli Shariff receives Sahitya Akademi Yuva Puraskar". Archived from the original on 27 ఆగస్టు 2016. Retrieved 17 జూన్ 2016.
  2. "'వేంపల్లె షరీఫ్‌'కు అరుదైన గౌరవం | - | Sakshi". web.archive.org. 2024-09-15. Archived from the original on 2024-09-15. Retrieved 2024-09-15.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. Varma, P. Sujatha (2024-09-06). "Story by writer from Kadapa district included in UG curriculum". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2024-09-15.
  4. ఉప్పలూరి, ఆత్రేయశర్మ. "8 Jun 2013: Vempalli Shariff receives Sahitya Akademi Yuva Puraskar". Muse India. Archived from the original on 27 ఆగస్టు 2016. Retrieved 17 June 2016.

బయటి లింకులు

మార్చు
"https://te.wiki.x.io/w/index.php?title=జుమ్మాఁ&oldid=4315602" నుండి వెలికితీశారు