ఆర్థిక శాస్త్రం లో డిమాండ్ అంటే, ఒక నిర్ణీత కాలవ్యవధిలో, వినియోగదారులు ఏదైనా వస్తువుల మీద ఆసక్తి కలిగి ఉండి, వివిధ ధరల శ్రేణిలో వాటిని ఎంత పరిమాణంలో కొనగలరు అని వివరించేది.[1] ఈ డిమాండ్ ఆధారంగానే ఒక వస్తువు యొక్క ధర నిర్ణయించడం జరుగుతుంది. ధర, పరిమాణం, డిమాండు మధ్య సంబంధాన్నే డిమాండ్ కర్వ్ అని వ్యవహరిస్తారు. ఒక వస్తువు డిమాండు దాని ఆవశ్యకత, ధర, నాణ్యత, అనుకూలత, అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలు, కొనుగోలు దార్ల ఆదాయం, అభిరుచులు, ఇంకా చాలా కారణాల మీద ఆధారపడి ఉంటుంది.

ప్రభావితం చేసే కారణాలు

మార్చు

ఒక వినియోగదారుడు వస్తువును కొనాలనే కోరిక కలగాలంటే అనేక కారణాలు ఉంటాయి. ఇందులో సర్వసాధారణమైనవి కొన్ని.

వస్తువు ధర

డిమాండుతో ప్రధానంగా వస్తువుల ధర, ఆ ధరల్లో అవి అమ్ముడు పోయే పరిమాణం మధ్య సంబంధం మీద ఆధారపడి ఉంటుంది. ధరలు ఎక్కువయ్యే కొద్దీ ఆ వస్తువల కోసం డిమాండు తగ్గుతుంది.

సంబంధిత వస్తువుల ధర

అసలు వస్తువుతో ప్రత్యక్ష సంబంధం ఉన్న ఇతర వస్తువుల ధరలను బట్టి వాటి డిమాండులో హెచ్చు తగ్గులు ఉంటాయి. ఉదాహరణకు వాహనాలు, ఇంధనం ప్రత్యక్ష సంబంధం ఉన్న వస్తువులు. ఇంధనం ధర పెరిగితే వాహన డిమాండు తగ్గే అవకాశం ఉంది.

వ్యక్తిగత ఆదాయం

సాధారణంగా పన్నులు, అన్నీ పోను ప్రజలకు ఎంత ఆదాయం ఉంటే వారికి అంత కొనుగోలు శక్తి ఉంటుంది. అప్పుడే వస్తువులకు డిమాండు ఉంటుంది.

అభిరుచులు

ఏదైనా వస్తువులు సొంతం చేసుకోవాలన్న కోరిక ప్రజల్లో పెరిగేకొద్దీ వాటి డిమాండు పెరుగుతుంది. అయితే ఈ కోరికకూ, డిమాండుకో వ్యత్యాసం ఉంది. ఒక వస్తువు అంతర్గత విలువను బట్టి దాన్ని స్వంతం చేసుకుంటే బాగుండుననుకోవడం కోరిక. ఆ ఆలోచనను ఆచరణలో పెట్టి నిజంగా కొనాలనుకోవడం డిమాండు.

జనాభా

జనాభా పెరిగితే డిమాండు కూడా దానంతట అదే పెరుగుతుంది

మూలాలు

మార్చు
  1. O'Sullivan, Arthur; Sheffrin, Steven M. (2003). Economics: Principles in Action. Upper Saddle River, New Jersey: Pearson Prentice Hall. p. 79. ISBN 9780131334830.
"https://te.wiki.x.io/w/index.php?title=డిమాండు&oldid=3585710" నుండి వెలికితీశారు