డి.వి.ఎం.సత్యనారాయణ

డి.వి.ఎం. సత్యరానారాయణ తెలుగు రచయిత. [1]

జీవిత విశేషాలు

మార్చు

డి.వి.ఎం.(దొడ్డవరపు) సత్యనారాయణ గారు ప్రకాశం జిల్లా దొడ్డవరం గ్రామంలో లలితాకుమారి, సుబ్బరామయ్య దంపతులకు జన్మించాడు. ఎం.ఎస్.సి చదివిన వీరు వృత్తిరీత్యా జీవితబీమా సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. వీరికి మొదటి నుండి కూడా తెలుగు భాష మీద కలిగిన ఆసక్తి వల్ల అనేక గ్రంథ పఠనం చేశారు. తర్వాత భావ కవిత్వంలో గాని పద్య రచనలో గాని మంచి పట్టు సంపాదించారు.వీరి రచనలలో వీరి యొక్క భావ స్పష్టత, పదప్రయోగాల్లో గంభీరత గోచరిస్తూ ఉంటాయి. అలతి అలతి పదాలతో గొప్ప భావాన్ని వ్యక్తీకరించగలిగిన గొప్ప పాండిత్యం గలవారు [1][1]

ముద్రిత రచనలు

మార్చు
  1. భజగోవిందం,
  2. ఆంధ్ర గాధాలహరి (హాలుని ప్రాకృత గాథా సప్తశతిలోని కొన్ని గాథలకు స్వేచ్ఛానువాదం)[2]

అముద్రిత రచనలు

మార్చు
  1. పద్య మంజరి(పద్య కవితా సంకలనం),
  2. కదంబం(వచన కవితా సంకలనం)
  3. ఆంధ్ర శతకం,
  4. ప్రకృతి గీతం
  5. సంకీర్తనావళి(స్వర సహితం)
  6. వ్యాసమంజూష(వ్యాస సంకలనం)
  7. శ్రీకృష్ణ లీలారింఛోళీ.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 ఆంధ్ర గాథాలహరి అచ్చుపుస్తకంలో ఇచ్చిన వివరాలు. ఆంధ్రగాథాలహరి,ప్రచురణకర్త: డి.సుమబాల 32-99--4, విశ్వభారతి స్కూవుల్ వద్ద, అడ్డంకి, ప్రకాశం.2019
  2. ఆంధ్ర భూమి దినపత్రికలో ధారావాహికంగా ప్రచురించబడిన ఆంధ్ర గాథాలహరి