డి. నాగేశ్వర్ రెడ్డి

జీర్ణాశయ ప్రేగుల వైద్య నిపుణులు
(డి. నాగేశ్వర్‌ రెడ్డి నుండి దారిమార్పు చెందింది)

పద్మశ్రీ డాక్టర్ డి. నాగేశ్వర్‌ రెడ్డి జీర్ణాశయ ప్రేగుల వైద్య నిపుణులు. ప్రపంచంలో అతిపెద్ద గ్యాస్ట్రోఎంటరాలజీ ఆసుపత్రి అయిన ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఛైర్మన్. విజయవాడలో ఇంటర్ పూర్తిచేశారు. కర్నూలు మెడికల్ కళాశాలలో చదువుకున్నారు. 2002 లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. చెన్నైలో ఇంటర్నల్ మెడిసిన్, అటుపైన గ్యాస్ట్రో ఎంటరాలజీ, పీజీఏ చండీగఢ్‌లో డీఎం చేశారు. నిమ్స్‌లో పనిచేశారు. తర్వాత గాంధీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు.[1]

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారం అందుంటున్న దువ్వూరు నాగేశ్వర్‌రెడ్డి.

2009 మాస్టర్ ఎండోస్కోపిస్ట్ అవార్డ్

మార్చు

అమెరికన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఎండోస్కోపీ (ASGE) వారు 2009 లో దువ్వూరు నాగేశ్వర్‌రెడ్డికి మాస్టర్ ఎండోస్కోపిస్ట్ అవార్డ్ ను ప్రదానం చేశారు. ఈ అవార్డ్ ఎండోస్కోపీ రంగంలో ప్రపంచ అత్యధిక పురస్కారంగా, తరచుగా ఎండోస్కోపీ యొక్క నోబెల్ బహుమతిగా అభివర్ణించబడుతుంది.

2013 మాస్టర్ ఆఫ్ వరల్డ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ

మార్చు

2013 ప్రపంచ అత్యుత్తమ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్య నిపుణులుగా ఈయన ఎంపికయ్యారు. చైనాలోని షాంఘై నగరంలో 23-9-2013న జరిగిన ప్రపంచ గ్యాస్ట్రో ఎంట్రాలజీ సదస్సులో మాస్టర్ ఆఫ్ వరల్డ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ పురస్కారాన్ని డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి ప్రదానం చేశారు. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఇచ్చే అంతర్జాతీయ ప్రతిష్ఠాత్మక పురస్కారం అయిన ఈ పురస్కారాన్ని అందుకున్న భారతీయుల్లో మొదటి వ్యక్తి నాగేశ్వరరెడ్డి. జీర్ణకోశ సంబంధిత వ్యాధులకు సంబంధించిన ఎండోస్కోపీ చికిత్సల్లో అనేక కొత్త విధానాలు వైద్య ప్రపంచానికి అందించడం, జీర్ణకోశ సంబంధిత వ్యాధుల పరిశోధనల కోసం అత్యుత్తమ పరిశోధనాలయం ఏర్పాటు చేయడం, రోగులకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం వంటి నిరంతర కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు.ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ హార్వర్డ్, హాంకాంగ్ తర్వాత మూడో స్థానంలో ఉంది.

2022 అమెరికన్‌ గ్యాస్ట్రో ఎంటరాలాజికల్‌ అసోసియేషన్‌ (ఏజీఏ) పురస్కారం

మార్చు

ప్రతిష్ఠాత్మక అమెరికన్‌ గ్యాస్ట్రో ఎంటరాలాజికల్‌ అసోసియేషన్‌ అందించే విశిష్ట విద్యావేత్త పురస్కారానికి డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి ఎంపికయ్యారు. ఈ అవార్డు భారతీయ వైద్యుడికి తొలిసారిగా దక్కడం విశేషం. 2022 మే 21 నుంచి 24 వరకు కాలిఫోర్నియాలో జరిగే డైజెస్టివ్‌ డిసీజ్‌ వీక్‌ కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.[2]

2021 సాక్షి ఎక్సలెన్స్ పురస్కారాలు

మార్చు

సాక్షి ఎక్సలెన్స్ పురస్కారాలు ప్రతీయేట బహుకరించే తెలుగు పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2021కి గానూ డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డిని వరించింది.[3]

మూడు పద్మ పురస్కారాలు

మార్చు

ఏఐజీ చైర్మన్ నాగేశ్వరరెడ్డికి భారత దేశంలోనే మూడు పద్మ పురస్కారాలు అందుకున్న ఏకైక వైద్యుడుగా అరుదైన గౌరవం లభించింది.

విశేషాలు

మార్చు
  • లండన్ తదితర ప్రాంతాలనుంచి చాలా ఆఫర్లు వచ్చినా, పదేళ్ళక్రితం హార్వర్డ్ యూనివర్సిటీ కోటి రూపాయల జీతం ఆఫర్‌చేసినావెళ్ళలేదు.స్వదేశంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు.ఇప్పుడు విదేశీయులే ఈయన దగ్గర శిక్షణకు వస్తున్నారు.
  • భారతదేశం లో మూడు పద్మ పురస్కారాలు అందుకున్న ఏకైక వైద్యుడు.

భావాలు,అనుభవాలు

మార్చు
  • మా ఆస్పత్రిలో అందరికీ జీతాలే. ఎవరూ ప్రాక్టీస్ చేయరు.దురదృష్టవశాత్తు ప్రభుత్వం కూడా పరిశోధనపై దృష్టి పెట్టడంలేదు. ప్రభుత్వం ప్రాథమిక వైద్యం అందించి, టెర్షరీ వైద్యాన్ని ప్రైవేట్‌కు వదిలిపెట్టాలి. ఆరోగ్యశ్రీ వంటివాటిపై మేం ఆధారపడటంలేదు. అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు ఇలా సామాజిక బాధ్యత తీసుకుంటే చాలా బాగుంటుంది. ఉదాహరణకు కేన్సర్ వైద్యానికి ప్రభుత్వం చాలా ఖర్చుచేస్తోది. దానివల్ల జీవితకాలాన్ని కొంత పొడిగించగలం. అదే ప్రభుత్వం పరిశోధనలకు తగిన నిధులు వెచ్చించి కేన్సర్ వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు తోడ్పడితే ఎంతోమంది ప్రాణాలు నిలబడతాయి.ప్రైవేట్ ఆస్పత్రులు కూడా సామాజిక బాధ్యతతో టెర్షరీ వైద్యాన్ని 20 శాతం ఉచితంగా చేయాలి. ఆరోగ్యశ్రీకన్నా బీమాపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి.
  • గ్రామీణ ప్రాంతాల్లో 90శాతం రోగాలకు మంచి నీరు లేకపోవడమే కారణం. పౌష్టికాహార లోపం, ఆరోగ్యంపై అవగాహన లేకపోవడమూ ప్రధాన కారణాలే.
  • డాక్టర్‌కు మానవతాదృక్పథం ఉండాలి. తానెందుకు ఈ వృత్తిలోకి వచ్చానన్న స్పష్టత అవసరం. డాక్టర్ పై నమ్మకం లేకపోతే మందు సరిగా పనిచేయదు.
  • మంచి వైద్యానికి డబ్బు కూడా కావాలి. మంచి డాక్టర్లకు జీతాలెక్కువ ఇవ్వాలి. అందుకే వైద్యం మొత్తం ప్రభుత్వమైనా ఉచితంగా చేయలేదు. డబ్బుకోస మే వైద్యం చేస్తున్నారని పేషంట్లు భావిస్తున్నారు. ఆస్పత్రులపై దాడులు చేస్తున్నారు. రెండువైపులా నమ్మకం పెరిగేలా డాక్టర్లు కొంచెం ఎక్కువ కృషిచేయాలి.
  • రాయలసీమలో చాలామంది అన్నంలో మిరపకాయ వేసుకుని తింటారు. కారం తిన్న పేషంట్‌కే అల్సర్ తొందరగా మాడింది. కాబట్టి అల్సర్‌కు కారానికి సంబంధం లేదు.మన దగ్గర నేలకూడా కలుషితమైపోయింది.నేలలో ఆఫ్లో టాక్సిన్ అనే విషపదార్థం ఉంటుంది. వేరుశనగ కాయల్లోకి ఆఫ్లోటాక్సిన్ అనే ఫంగస్ ప్రవేశిస్తుంది. ఇటువంటి వాటిని తినడం వల్ల పశువులిచ్చే పాలల్లో కూడా ఈ ఫంగస్ ఉంటుంది.దీనివల్ల లివర్ కేన్సర్ వచ్చే ప్రమాదముంది. చిన్నపిల్లల్లో ఎదుగుదల ఉండదు.
  • భారతీయుల్లో గ్యాస్ట్రో ఎంటరాలజీ జీన్స్ బలహీ నం. కడుపులోకానీ, కొలన్‌లో కాని, పాంక్రియాస్, లివర్‌లో వీక్‌గా ఉంటా యి. భారతీయుల్లో చాలామందికి ట్రంక్‌లో ఒబేసిటీ వస్తుంటుంది. అంటే మనిషి సన్నగా ఉన్నా పొట్ట మాత్రం వస్తుంది. అది జెనెటిక్ సమస్య. దీనివల్ల క్రమంగా లివర్‌లోకి ఫ్యాట్ చేరుతుంది. చివరకు లివర్ సిర్రోసిస్‌కు దారితీస్తుం ది. ఆల్కహాల్ తీసుకోకపోయినా, ఆహార నియమాలు పాటించినా జన్యులో పంవల్ల ఈ సమస్య వస్తుంది.

మూలాలు

మార్చు
  1. "వైద్యనగధీరుడు". 26 January 2025. Archived from the original on 26 January 2025. Retrieved 26 January 2025.
  2. "Nageshwar Reddy: డాక్టర్‌ నాగేశ్వరరెడ్డికి ఏజీఏ పురస్కారం". EENADU. Retrieved 2022-03-13.
  3. "Sakshi Excellence Awards 2021: Presented by YS Bharathi Reddy - Sakshi". web.archive.org. 2022-11-03. Archived from the original on 2022-11-03. Retrieved 2022-11-03.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "Padma Awards 2025: వైద్య విభూషణుడు". 26 January 2025. Archived from the original on 26 January 2025. Retrieved 26 January 2025.

ఇవి కూడా చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు


మూలాలు

మార్చు