తంగిరాల వెంకట సుబ్బారావు
తంగిరాల వెంకట సుబ్బారావు (జ. మార్చి 30, 1935) బెంగళూరు విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యయన శాఖాధ్యక్షుడు. వీరు అనేక గ్రంథాలు రచించారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి ఆచార్య పింగళి లక్ష్మీకాంతం, ఆచార్య జి.యన్. రెడ్డి గార్ల పర్యవేక్షణలో "తెలుగు వీరగాథా కవిత్వము" అన్న అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ సంపాదించారు.[2]
తంగిరాల వెంకట సుబ్బారావు | |
---|---|
జననం | మార్చి 30, 1935 |
మరణం | జనవరి 25, 2025[1] | (aged 89)
విద్య | తెలుగు సాహిత్యంలో పి.హెచ్.డి |
విద్యాసంస్థ | శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం |
వృత్తి | ఆచార్యుడు, రచయిత |
ఉద్యోగం | బెంగళూరు విశ్వవిద్యాలయం |
శ్రీకృష్ణ దేవరాయ రస సమాఖ్య
మార్చు11.4.1994 న శ్రీకృష్ణ దేవరాయ రస సమాఖ్య అనే సాహిత్య సంస్థను ప్రారంభించి ప్రతి నెలా ఒక సాహిత్య కార్యక్రమాన్ని నిర్వహించారు.[3] ఇప్పటి దాకా 150 ప్రసంగాలు, 50 గోష్ఠులు నిర్వహించారు. తెలుగు ప్రాచీన సాహిత్యం గురించి, ఆధునిక సాహిత్యం గురించి, జానపద సాహిత్యం గురించి ప్రముఖుల చేత ప్రసంగాలు ఇప్పించి తెలుగు సాహిత్యం, భాషా వికాసానికి కృషి చేస్తున్న తంగిరాల రేనాటి సూర్యచంద్రులు పుస్తకంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బుడ్డా వెంగళరెడ్డిల గురించి చేసిన పరిశోధన విశిష్ఠమైనది.
రచనలు
మార్చు- హంసపదిక, వనదేవత, గుండెపూచిన గులాబి వంటి సృజనాత్మక రచనలు
- జానపదసాహిత్యము-వీరగాథలు, కాటమరాజు కథలు, తెలుగు వీరగాథా కవిత్వము, అంకమ్మ కథలు, శ్రీకృష్ణ కర్ణామృతము, రేనాటి సూర్యచంద్రులు ( మొదటి, రెండవ సంపుటాలు) వంటి పరిశోధనాత్మక గ్రంథాలు
- తెలుగులోనే కాకుండా కన్నడంలో " వేమన- ఎరడు అద్యయనగళు", విశ్వనాథ సత్యనారాయణ, హిమవద్ గోపాలస్వామి వంటి రచనలు చేసిన బహుముఖ ప్రఙ్ఞాశాలి.
శ్రీకృష్ణ దేవరాయ రస సమాఖ్య
మార్చు11.4.1994 న శ్రీకృష్ణ దేవరాయ రస సమాఖ్య అనే సాహిత్య సంస్థను ప్రారంభించి ప్రతి నెలా ఒక సాహిత్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటి దాకా 150 ప్రసంగాలు, 50 గోష్ఠులు నిర్వహించారు. తెలుగు ప్రాచీన సాహిత్యం గురించి, ఆధునిక సాహిత్యం గురించి, జానపద సాహిత్యం గురించి ప్రముఖుల చేత ప్రసంగాలు ఇప్పించి తెలుగు సాహిత్యం, భాషా వికాసానికి కృషి చేస్తున్న తంగిరాల రేనాటి సూర్యచంద్రులు పుస్తకంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బుడ్డా వెంగళరెడ్డిల గురించి చేసిన పరిశోధన విశిష్ఠమైనది.
పురస్కారాలు
మార్చు- 2025: ప్రతిభా మూర్తి జీవితకాల సాధన పురస్కారం - అజో-విభో-కందాళం ఫౌండేషన్, జాషువా సాంస్కృతిక వేదిక విజయవాడ[4]
వనరులు
మార్చు- ↑ "తరలిపోయిన సాహితీసుమం తంగిరాల". EENADU. Retrieved 26 January 2025.
- ↑ "జానపద పరిశోధకులు డాక్టర్ తంగిరాల - Prajasakti". 2024-12-30. Retrieved 2025-01-26.
- ↑ telugu, NT News (2025-01-26). "సాహిత్య పరిశోధకులు వెంకటసుబ్బారావు కన్నుమూత". www.ntnews.com. Archived from the original on 2025-01-26. Retrieved 2025-01-26.
- ↑ "తంగిరాల వెంకట సుబ్బారావుకు ప్రతిభా మూర్తి జీవితకాల పురస్కారం - Prajasakti". 2025-01-05. Archived from the original on 2025-01-26. Retrieved 2025-01-26.