తమెంగ్‌లాంగ్
తమెంగ్‌లాంగ్, మణిపూర్ రాష్ట్రంలోని తమెంగ్‌లాంగ్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. ఈ పట్టణంలో రోంగ్మీ ప్రజలు నివసిస్తున్నారు, రోంగ్మీ భాష మాట్లాడుతారు.[1]
తమెంగ్‌లాంగ్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 24°59′26.39″N 93°30′3.26″E / 24.9906639°N 93.5009056°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మణిపూర్ |
జిల్లా | తమెంగ్‌లాంగ్ |
Elevation | 1,580 మీ (5,180 అ.) |
జనాభా (2011) | |
• Total | 19,363 |
భాషలు | |
• అధికారిక | రోంగ్మీ, లియాంగ్‌మై, జెమ్, ఇన్‌పుయి |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 795141 |
టెలిఫోన్ కోడ్ | 03877 |
Vehicle registration | ఎంఎన్ |
అక్షరాస్యత | 86.95% |
Website | అధికారిక వెబ్‌సైటు |
భౌగోళికం
మార్చుఈ పట్టణం 24°59′26.39″N 93°30′3.26″E / 24.9906639°N 93.5009056°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సమద్రమట్టానికి 1,580 మీ. (5,180 అ.) ఎత్తులో ఉన్న ఈ పట్టణం, మణిపూర్ రాష్ట్ర పశ్చిమం వైపు ఉంది. పట్టణమన్న కొండపైన బరాక్ నది ప్రవహిస్తోంది. రాష్ట్ర రాజధాని ఇంఫాల్ నగరానికి పశ్చిమం వైపు 160 కి.మీ.ల దూరంలో ఈ పట్టణం ఉంది. దీనికి తూర్పు వైపు సేనాపతి జిల్లా, పశ్చిమం వైపు అస్సాంలోని ఉత్తర కచార్ హిల్స్ జిల్లా, ఉత్తరం వైపు నాగాలాండ్ రాష్ట్ర పెరెన్ జిల్లా, దక్షిణం వైపు చురచంద్‌పూర్ జిల్లా ఉంది.
జనాభా
మార్చు2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఇక్కడ 19,363 జనాభా ఉంది. ఇందులో 9,837 మంది పురుషులు, 9,526 మంది స్త్రీలు ఉన్నారు. మొత్తం జనాభాలో 2,683 (13.86%) మంది 0-6 సంవత్సరాల వయస్సు గలవారు ఉన్నారు. పట్టణ అక్షరాస్యత రేటు 86.95% కాగా, ఇది రాష్ట్ర సగటు 76.94% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 90.64% కాగా, స్త్రీల అక్షరాస్యత రేటు 83.15% గా ఉంది.[2]
మతం
మార్చుఇక్కడి జనాభాలో క్రైస్తవులు 95.90%, హిందువులు 3.22%, ముస్లింలు 0.42%, సిక్కులు 0.10%, బౌద్ధులు 0.27%, జైనులు 0.03%, ఇతరులు 0.05% ఉన్నారు.
పరిపాలన
మార్చుఈ పట్టణంలో మొత్తం 3,481 గృహాలు ఉన్నాయి. పట్టణ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో త్రాగునీరు, పరిశుభ్రత వంటి ప్రాథమిక సౌకర్యాలు అందించబడుతున్నాయి. పట్టణ పరిమితుల్లో రహదారులను నిర్మించడానికి, దాని పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్ను విధించడానికి కూడా ఈ కమిటీకి అధికారం ఉంది.[2]
పర్యాటక ప్రాంతాలు
మార్చు‘ల్యాండ్ ఆఫ్ హార్న్‌బిల్’ గా పేరొందిన ఈ పట్టణం, వృక్ష జంతుజాలాలతో సమృద్ధిగా ఉంది. ఇక్కడ అరుదైన జాతుల మొక్కలు, జంతువులు, పక్షులు ఉన్నాయి. నదులు, జలపాతాలు, గుహలు, సరస్సులు, దట్టమైన ఉష్ణమండల అడవులు కూడా ఉన్నాయి.[3]
- జీలాడ్ సరస్సు
- జిలాడ్ వన్యప్రాణుల అభయారణ్యం
- బరాక్ జలపాతాలు
- కిషా ఖౌ
- థరోన్ కేవ్
- బన్నింగ్ మేడో
ప్రధాన తెగలు
మార్చు- రోంగ్మీ భాష మాట్లాడే రోంగ్మీ నాగ తెగ ఇక్కడ ఉంది.
• జెమే నాగా 2 లియాంగ్‌మై నాగా 3 ఇన్‌పుయి నాగ
వాతావరణం
మార్చుఇక్కడ తేమతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణం ఉంటుంది. ఇది ఒక ఎత్తైన ప్రదేశం. జూలై నెలలో ఎక్కువ వర్షం కురుస్తుంది, డిసెంబరు నెలలో పొడిగా ఉంటుంది.[4]
చిత్రమాలిక
మార్చు-
గైడై పర్వత ప్రాంతం నుండి పట్టణం దృశ్యం
-
ఫాంల్యాండ్ సరస్సు
-
రేంగన్ బామ్డువాన్
-
ప్రార్థన పర్వతం
-
న్రియాంగ్లువాంగ్
-
బరాక్ వద్ద రాహ్ నౌ బంగ్ (ఘోస్ట్ బ్రెస్ట్స్)
-
బరాక్ వద్ద ఆశా నాప్లోయిహ్ (ఆశా రైస్ పాట్)
-
మాగులోంగ్ వద్ద కాచా ఖౌ (పర్వతం)
మూలాలు
మార్చు- ↑ "Villages & Towns in Tamenglong Sub Division of Tamenglong, Manipur". www.census2011.co.in. Retrieved 2021-01-08.
- ↑ 2.0 2.1 "Tamenglong Census Town City Population Census 2011-2021 | Manipur". www.census2011.co.in. Retrieved 2021-01-08.
- ↑ "Top 8 Places To Visit In Manipur". Trans India Travels. 2016-12-05. Retrieved 2021-01-08.
- ↑ "Tamenglong - Climate graph, Temperature graph, Climate table". Climate-Data.org. Retrieved 2021-01-08.