తాష్కెంట్ (ఉజ్బెక్:Тошкент, రష్యన్:Ташкент, ఆంగ్లం:Stone City) ఉజ్బెకిస్తాన్ దేశము యొక్క రాజధాని. తాష్కెంట్ ప్రాంతము యొక్క ముఖ్య పట్టణం. 1999 అంచనాల ప్రకారము ఈ నగరం యొక్క జనాభా 2,142,700.

తాష్కెంట్

ఈ నగరం యొక్క పేరు కాలక్రమేణా అనేక మార్పులు చెందుతూ వచ్చింది. మధ్య యుగంలో ఈ పట్టణం, చుట్టు పక్కల ప్రాంతాన్ని ఛాచ్ అని పిలిచేవారు. ఆ తరువాత అది కాస్తా ఛచ్‌ఖండ్/ఛస్‌ఖండ్ (ఛాచ్ నగరం) గా మారింది. పాత పర్షియన్ భాషలో కంద అనగా పట్టణం లేదా నగరం అను పదము నుండి ఉద్భవించిన కండ్, ఖండ్, కెంట్, కద్, కథ్, కుద్ ఇవన్నీ నగరానికి పేర్లే. సమర్‌ఖండ్, యార్‌కంద్, పెంజికెంట్ మొదలైన పేర్లు వీటికి ఉదాహరణలు. 16 శతాబ్దము తరువాత క్రమక్రముగా పూర్వపు పర్షియన్ మాట్లాడే ప్రజల స్థానే ఉజ్బెక్ ల జనాభా పెరిగిపోవడముతో నగరం పేరు ఛచ్‌ఖండ్/ఛస్‌ఖండ్ నుండి కొద్దిగా రూపాంతరము చెంది తష్‌కండ్ అయినది. తష్‌కండ్ అనగా రాతి నగరం. కొత్తగా వచ్చి స్థిరపడిన వారికి ఈ పేరు పూర్వపు ఛచ్‌ఖండ్ అనే పేరుకంటే సముచితమైనదనిపించింది. ప్రస్తుత ఆధునిక తాష్కెంట్ అనే ఉఛ్ఛారణ సోవియట్ ప్రభావము వల్ల యేర్పడింది.

"https://te.wiki.x.io/w/index.php?title=తాష్కెంట్&oldid=3676220" నుండి వెలికితీశారు