తిరుమాని సత్యలింగ నాయకర్
తిరుమాని సత్యలింగ నాయకర్ మాజీ ఎమ్మెల్యే, సత్యలింగం నాయకర్ అగ్నికులక్షత్రియ సమాజానికి చెందినవాడు ఆయన వివాద రహితుడిగా, నిజాయితీపరుడిగా పేరొంది 1983,[1] 1985[2], 1994[3] లో సంపర శాసనసభ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహించి హ్యాట్రిక్ సృష్టించారు. పేదవర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేయడం, నీతినిజాయితీగా వ్యవహరించడంతో ఆయన ఇటు రాజకీయ వర్గాల్లోను, అటు ప్రజల్లోను మంచివ్యక్తిగా, అవినీతికి ఆస్కారం ఇవ్వని మనిషిగా చెరగని ముద్ర వేసుకున్నారు.[4]
తిరుమాని సత్యలింగ నాయకర్ | |||
| |||
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్
| |||
నియోజకవర్గం | సంపర | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1935 జూన్ 12 కాట్రేనికోన మండలం బలుసుతిప్ప గ్రామం, ఆంధ్ర ప్రదేశ్ | ||
మరణం | జనవరి 20 2016 | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
జీవిత భాగస్వామి | అమ్మాజీ | ||
సంతానం | స్వామినాయకర్ (కొడుకు) | ||
మతం | హిందూ |
జీవిత విశేషాలు
మార్చుఆయన 1935 జూన్ 12 న తిరుమాని స్వామి, ముత్యాలమ్మ దంపతులకు కాట్రేనికోన మండలం బలుసుతిప్ప గ్రామంలో జన్మించారు. చిన్నతనం నుంచి ఆయన పేదల సమస్యలపై పోరాడడమే కాకుండా, అనేక సేవా కార్యక్రమాలు చేశారు.
రాజకీయ జీవితం
మార్చుఆయన 1968లో సర్పంచ్‌గా ఎన్నికై రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1983లో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తెలుగుదేశం స్థాపించాక ఆ పార్టీలో చేరి, అప్పటి సంపర నియోజకవర్గం (ఇప్పుడు కాకినాడ రూరల్ నియోజకవర్గం) నుంచి ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి, గెలుపొందారు. 1985, 1994లో కూడా సంపర నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు. 1986 నుంచి 1989 వరకు రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్‌గా వ్యవహరించారు. రాష్ట్రంలో మత్స్యకార సమస్యల పరిష్కారానికి కృషి చేసి, వారి కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత నాయకర్‌కే దక్కుతోంది. నిత్యం ప్రజల్లో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషిచేశారు.[5]
వ్యక్తిగత జీవితం
మార్చుఆయనకు భార్య అమ్మాజీ, కుమారుడు స్వామి నాయకర్ ఉన్నారు.
మరణం
మార్చుకొంతకాలంగా ఆయన అస్వస్థతతో ఉన్నారు. కాకినాడ రూరల్ మండలం తూరంగిలో ఉంటున్న కుమారుడు, న్యాయవాది స్వామి నాయకర్‌తో ఉంటున్నారు. ఇంటివద్దనే జనవరి 20 2016 న మరణించారు.[6][7]
మూలాలు
మార్చు- ↑ "List of Successful Candidates in Andhra Pradesh Assembly Election in 1983". Archived from the original on 2016-03-03. Retrieved 2016-01-21.
- ↑ list of Successful Candidates in Andhra Pradesh Assembly Election in 1985
- ↑ "List of Successful Candidates in Andhra Pradesh Assembly Election in 1994". elections.in/. Archived from the original on 5 సెప్టెంబరు 2016. Retrieved 20 January 2016.
- ↑ "Former MLA dead". » TODAY'S PAPER » ANDHRA PRADESH. The Hindu. January 21, 2016. Retrieved 20 January 2016.
- ↑ Sakshi (21 January 2016). "నాయకర్ కన్నుమూత". Archived from the original on 9 జనవరి 2022. Retrieved 9 January 2022.
- ↑ Andhrajyothy (21 January 2016). "'హ్యాట్రిక్' నాయకర్ కన్నుమూత". Archived from the original on 9 జనవరి 2022. Retrieved 9 January 2022.
- ↑ The Hindu (20 January 2016). "Former MLA Tirumani Satyalingam Naickerdead" (in Indian English). Archived from the original on 30 June 2024. Retrieved 30 June 2024.